బంగారం కాబట్టి వదులుకోలేక... | people are struggling about gold weives | Sakshi
Sakshi News home page

బంగారం కాబట్టి వదులుకోలేక...

Published Fri, Mar 20 2015 11:54 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM

people are struggling about gold weives

హైదరాబాద్ :  తాము అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు నాయుడును నమ్మి రైతులు ఓటు వేశారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాము తీసుకున్న రుణం మాఫీ అవుతుందని రైతులు ఆ రుణాలు కట్టలేదని ...అయితే అధికారంలోకి వచ్చిన బాబు ...రుణమాఫీ అమలు విషయంలో ఆంక్షలు పెట్టారని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎప్పుడైనా రుణమాఫీపై ఆంక్షలు గురించి మాట్లాడారా అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు.

ప్రస్తుతం తులం బంగారం రూ.27వేలు ఉందని, అయితే బ్యాంకులు తులానికి రూ.10వేలో,13వేలో ఇచ్చాయని, అయితే రుణం మాఫీ అవుతుందన్న ఆశతో ఆ రుణాలు రైతులు కట్టలేదన్నారు. బంగారం కాబట్టి వదులుకోలేక....వడ్డీలు మీడ వడ్డీలు కడుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. మరోవైపు  బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని వేలం వేస్తామని రైతులకు బ్యాంకులు వరుసగా నోటీసులు ఇస్తున్నాయని వైఎస్ జగన్ అన్నారు. ప్రతి జిల్లాలోని రైతులకు ఇలాంటి నోటీసులు ఇస్తున్నారని, చంద్రబాబు సొంత జిల్లాలో బంగారం వేలం నోటీసులు జారీ అవుతున్నాయని ఆయన మీడియా దృష్టికి తీసుకు వచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement