సీఆర్డీఏ ఆఫీస్ కు తాళాలు
Published Tue, Feb 23 2016 11:51 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండలోని సీఆర్డీఏ ఆఫీస్ ఎదుట మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆఫీస్ లోని సిబ్బందిని బయటకు పంపి కార్యాలయానికి తాళాలు వేశారు. రైతుల చెక్కుల పంపిణీల్లో అక్రమాలు జరుగుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై తీరుపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన చెందుతున్నారు. డిప్యూటీ కలెక్టర్ శారదపై విచారణ జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Advertisement