CRDA office
-
ముగిసిన హై పవర్ కమిటీ భేటీ
-
హై పవర్ కమిటీ భేటీ ప్రారంభం
-
జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రివర్గ భేటీలో చర్చిస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. నివేదికకు యథాతథంగా ఆమోదించాలా? ఇంకా ఏమైనా మార్పులు చేయాలా? అన్నది చర్చిస్తామన్నారు. కమిటీలో నిపుణులు సభ్యులుగా ఉన్నారని, అన్ని అంశాలను పరిశీలించాకే నివేదిక సమర్పించారని చెప్పారు. మీ తాబేదార్ల కోసం దోపిడీ చేస్తారా? రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి రాజధాని నిర్మించే ఆర్థిక స్థోమత రాష్ట్రానికి లేదని బొత్స పేర్కొన్నారు. కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తే మిగతా 12 జిల్లాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీల సిఫార్సులను చంద్రబాబు ప్రభుత్వం పక్కనపెట్టి నారాయణ కమిటీతో ముందుకు వెళ్లిందని విమర్శించారు. రాజకీయాల కోసం ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడతాయని బొత్స పేర్కొన్నారు. ‘మీ తాబేదార్ల కోసం దోపిడీ చేస్తారా?’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబును నిలదీశారు. రాజధాని ప్రకటనకు ముందే హెరిటేజ్ సంస్థ అమరావతి ప్రాంతంలో భూములు కొనడం ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ కాదా? అని ప్రశ్నించారు. -
రాజధానికి భూములిచ్చి మోసపోయాం: రైతులు
-
సీఆర్డీఏ ఆఫీస్ వద్ద రైతు,ప్రజా సంఘాల ధర్నా
-
సీఆర్డీఏ: రాజధాని రైతుల ధర్నా
సాక్షి, విజయవాడ: ప్రభుత్వం బలవంతంగా తమ భూములు లాక్కుంటున్నదంటూ రాజధాని రైతులు.. అమరావతిలోని సీఆర్డీఏ ఆఫీస్ ఎదుట శనివారం ధర్నాకు దిగారు. విజయవాడలో రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం తాజాగా విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఇప్పటికే రాజధాని కోసమని రైతుల నుంచి సేకరించిన 33వేల ఎకరాల భూముల్లో ఎటువంటి నిర్మాణం చేపట్టలేదని, ఇప్పుడు రింగ్ రోడ్ పేరిట మరో 24 వేల ఎకరాల భూమిని కాజేయాలని చూస్తోందని రైతులు ప్రభుత్వంపై మండిపడ్డారు. భూ మాఫియా కోసమే మూడు పంటలు పండే రైతుల భూములను సేకరిస్తున్నారని విమర్శించారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు భూములు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ఒకవేళ బలవంతంగా భూములు లాక్కుంటే.. కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం భూములు లాక్కుంటే.. వారి కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
అమరావతి: పెనుమాక సీఆర్డీఏ కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూసేకరణ నోటిఫికేషన్ విడుదలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన దిగారు. కూరగాయాలు పారబోసి నిరసన తెలిపారు. సీఆర్డీఏ అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాజధానికి భూములు ఇచ్చేందుకు తాము నిరాకరించడంతో ప్రభుత్వం బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని పెనుమాక రైతులు రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుసు మార్కెట్ యార్డు ఎదుట అన్నదాతలు ఆందోళనకు దిగారు. గ్రేడింగ్ పేరుతో కొనుగోళ్లను మార్కెఫెడ్ అధికారులు కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారని ఆరోపిస్తు రైతులు నిరసన చేపట్టారు. కొంతమంది రైతులు భవనంపైకి ఎక్కి దూకుతామని బెదిరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారికి సర్దిచెప్పేందుకు తోటి రైతులు ప్రయత్నించారు. -
పెనుమక సీఆర్డీఏ ఆఫీసు వద్ద ఉద్రిక్తత
-
వైద్యశాల సరే... సీఆర్డీఏ కార్యాలయం ఎక్కడ?
► 30 పడకల ఆస్పత్రి నిర్మాణంతో సందిగ్ధత ► కార్యాలయ నిర్వహణ కష్టమంటున్న అధికారులు తుళ్ళూరు: తుళ్ళూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో తాత్కాలిక సీఆర్డీఏ కార్యాలయం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే రాజధానిలో పెరుగుతున్న ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తుళ్లూరు పీహెచ్సీ ఆవరణలో 30 పడకల వైద్యశాల నిర్మాణం చేపట్టింది. పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణం పూర్తయితే ఈ పరిసరాలలో సీఆర్డీఏ కార్యాలయం నిర్వాహణ కష్టతరమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల తుళ్ళూరు సీఆర్డీఏ కార్యాలయం గుంటూరుకో లేదా, విజయవాడకో మారుస్తారని ప్రచారం జరిగింది. మరి కొంతకాలం మందడంలో శాశ్వత భవనం ఏర్పాటు చేస్తారని, లింగాయపాలెం వద్ద తుళ్ళూరు సీఆర్డీఏ శాశ్వత కార్యాలయం వుంటుందని రాజధాని గ్రామాలలో ప్రచారం జరిగింది. అయితే అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. దీంతో సీఆర్డీఏ కార్యాలయం ఈ ప్రాంతంలో వుంటుందా?లేదా? అని రాజధాని గ్రామాల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అలాగే నాణ్యతా ప్రమాణాలతో వైద్యశాలను నిర్మించాలని తుళ్ళూరు ప్రజలు కోరుతున్నారు. -
రాజధానిపై ఏప్రిల్‌లో నిష్ణాతుల కమిటీ నివేదిక
సాక్షి, అమరావతి: ఏపీ సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపదలను రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో నిక్షిప్తం చేయడానికి ఏర్పాటైన ‘నిష్ణాతుల కమిటీ’ ఏప్రిల్ మొదటి వారంలోగా కసరత్తు పూర్తి చేయాలని నిర్ణయించింది. మలి విడత సమావేశాల్లో భాగంగా ఆదివారం సీఆర్డీఏ కార్యాలయంలో భేటీ అయిన ఈ కమిటీ పలు అంశాలపై చర్చించింది. ఎవరెవరు ఏయే బాధ్యతలను గడువులోగా పూర్తి చేయాలో కమిటీ నిర్ణయించింది. ఈ నెలాఖరులోపు కుడ్యాలు, కూడళ్లు, భవంతులు, ప్రాకారాల నమూనాలను వేర్వేరుగా వర్గీకరించి తుది ఆకృతులకు దృశ్య రూపకల్పన చేసే బాధ్యతను ప్రముఖ సినీ ఆర్డ్ డైరెక్టర్ ఆనంద్‌సాయికి అప్పగించింది. కమిటీ చేసే సూచనలు, సలహాలను అమరావతి నగర రూపశిల్పిగా ఉన్న నార్మన్ పోస్టర్ సంస్థకు త్వరలో అందించాల్సి ఉందని కమిటీ సారథి పరకాల ప్రభాకర్ తెలిపారు. -
నిర్మాణాల్లో ప్లానర్ల పాత్ర కీలకం
సాక్షి, అమరావతి బ్యూరో : అమరావతి రాజధాని నగర, రీజియన్ పరిధిలో ప్రణాళికబద్ధంగా లే అవుట్లు, నిర్మాణాలు చేపట్టే విషయంలో ఆర్కిటెక్టులు, టౌన్‌ప్లానర్ల పాత్ర కీలకమని ఏపీ సీఆర్డీఏ డెవలప్మెంట్ ప్రమోషన్ విభాగం డైరెక్టర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ టౌన్‌ప్లానర్స్ ఏపీ రీజియన్ చాప్టర్ సెక్రటరీ వి.రాముడు పేర్కొన్నారు. సీఆర్డీఏ కార్యాలయంలో మంగళవారం వరల్డ్ టౌన్ ప్లానర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వి.రాముడు మాట్లాడుతూ కాలానుగుణంగా టౌన్ ప్లానింగ్ యాక్ట్‌లో వస్తున్న మార్పులను టౌన్ ప్లానర్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. క్రమబద్ధమైన ప్లానింగ్ ఆవశ్యకతను అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ప్లానర్లదేనని పేర్కొన్నారు. ఆక్రమ లే అవుట్లు, భవన నిర్మాణాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదని సూచించారు. సీఆర్డీఏ పరిధిలో ఎలాంటి ఆక్రమ లే అవుట్లు, నిర్మాణాలకు అనుమతించడం లేదని చెప్పారు. డెవలప్మెంట్ ప్రమోషన్ విభాగంలో ఎన్నో మార్పులు చేపట్టామని, డెవలప్మెంట్ పర్మిషన్ సిస్టం ద్వారా ఆటోమేటిక్ ప్రమోషన్ విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ ప్రిన్సిపల్ ప్లానర్లు వీవీఎల్ఎన్ శర్మ, ఎన్ఆర్ అరవింద్, సీనియర్ ప్లానింగ్ అధికారి జి.నాగేశ్వరరావు, ప్లానింగ్ అధికారి సీహెచ్‌వీ సాంబశివరావు, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు. -
ఓపెన్ ఫోరానికి 36 దరఖాస్తులు
విజయవాడ : సీఆర్డీఏ స్థానిక కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఓపెన్ ఫోరానికి 36 దరఖాస్తులు అందాయి. అనుమతుల కోసం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఈ ఓపెన్ ఫోరం నిర్వహించారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న 26 దరఖాస్తులను అప్పటికప్పుడే ఆమోదించి ప్రాథమిక అనుమతి మంజూరు పత్రం జారీచేశారు. మరో ఏడింటికి అదనపు సమాచారం కోరారు. నిబంధనలకు అనుగుణంగా లేని మూడు దరఖాస్తులను తిరస్కరించారు. వీటిలో భవన నిర్మాణ అనుమతుల కోసం నాలుగు దరఖాస్తులు రాగా, రెండింటిని అప్పటికప్పుడే ఆమోదించి ప్రాథమిక అనుమతి ఇచ్చారు. ఒక దరఖాస్తుకు అదనపు సమాచారం కోరారు. మరో దరఖాస్తును తిరస్కరించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం 13 దరఖాస్తులు రాగా, వాటిలో తొమ్మిదింటిని ఆమోదించి సర్టిఫికెట్లు జారీచేశారు. నాలుగు దరఖాస్తులకు సంబంధించి అదనపు సమాచారం కోరారు. లేఅవుట్ల అనుమతుల కోసం ఆరు దరఖాస్తులు రాగా, అన్నీ సక్రమంగా ఉన్న ఐదు లేఅవుట్లకు అప్పటికప్పుడే ప్రాథమిక అనుమతి పత్రం మంజూరు చేశారు. -
సీఆర్డీఏ ఆఫీసు వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం తుళ్లురు సీఆర్డీఏ కార్యాలయం ఎదుట గురువారం ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోలు పోసుకుని రాంబాబు అనే రైతు ఆత్మహత్యాయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ రాజధాని నిర్మిస్తే తుళ్లురు ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పి తమ వద్ద నుంచి భూములను లాక్కున్నారని రైతు రాంబాబు వాపోయాడు. రాజధానికి 47 సెంట్లు భూమిస్తే.. ఇప్పుడేమో 44 సెంట్ల కౌలు ఇస్తామంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏడాది నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని, దాంతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు రైతు రాంబాబు వాపోయాడు. -
సీఆర్డీఏ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన
విజయవాడ: విజయవాడలో సీఆర్డీఏ కార్యాలయం వద్ద రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా రైతులు ఆందోళన చేపట్టారు. భూములు ఇవ్వని ఉండవల్లి, పెనుమాక రైతుల పోలాల్లో రోడ్డు మార్కింగ్ పిల్లర్లు వేశారంటూ సీఆర్డీఏ అధికారులపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూముల జోలికి రావొద్దని కోర్టు చెప్పినా.. అధికారులు భూమలివ్వాలంటూ తమను బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సీఆర్డీఏ ఆఫీస్ కు తాళాలు
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండలోని సీఆర్డీఏ ఆఫీస్ ఎదుట మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆఫీస్ లోని సిబ్బందిని బయటకు పంపి కార్యాలయానికి తాళాలు వేశారు. రైతుల చెక్కుల పంపిణీల్లో అక్రమాలు జరుగుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై తీరుపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన చెందుతున్నారు. డిప్యూటీ కలెక్టర్ శారదపై విచారణ జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
సీఆర్డీఏ ఆఫీసు వద్ద ఎమ్మెల్యే ఆర్కే ఆందోళన
గుంటూరు: గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం నిడమర్రులో శనివారం సీఆర్డీఏ ఆఫీసు ఎదుట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే(ఆళ్ల రామకృష్ణారెడ్డి) ఆందోళనకు దిగారు. ఏడున్నర ఎకరాల ఎసైన్డ్ భూమిని ఇతరుల పేర్లతో నమోదు చేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ భూమిని దోచుకుంటున్నారని ఆర్కే మండిపడ్డారు. వివాదాస్పద భూమి వివరాలను పది రోజుల్లో ఇస్తామని ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా అధికారులు హామీ ఇచ్చారు. -
'సింగపూర్ జపం మానవా..'
విజయవాడ (గాంధీనగర్) : సీఎం చంద్రబాబునాయుడు సింగపూర్ జపం మానుకోవాలని, విదేశీ కంపెనీలకు భూములు ధారాదత్తం చేసే వైఖరిని వీడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హితవు పలికారు. రాజధాని ప్రాంత భూములను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టవద్దంటూ విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో సోమవారం ధర్నా జరిగింది. ధర్నానుద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్లో ఆమోదించే సమయంలో రాష్ట్ర రాజధానికి అన్ని రకాలుగా కేంద్రం సహకరిస్తుందని స్పష్టంగా పేర్కొన్నట్లు చెప్పారు. అయినప్పటికీ కేంద్ర సహకారం తీసుకుని రాజధాని నిర్మాణం చేపట్టకుండా ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాలు సమీకరించారన్నారు. ఆ విధంగా సమీకరించిన వేలాది ఎకరాల భూమిని సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నుంచి తెచ్చిన వందల కోట్ల నిధులకు లెక్కచెప్పాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. నిధులకు సంబంధించి కనీసం యుటిలైజేషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. భూముల్లో నాలుగువేల ఎకరాల ప్రైమ్‌ల్యాండ్ అంతా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా సింగపూర్ కంపెనీలకు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వేలాది ఎకరాల భూమిని వారికి కట్టబెట్టి 25 కిలోమీటర్ల వ్యాసార్థంలో ప్రభుత్వానికి ఏమాత్రంఅధికారం లేకుండా చేస్తున్న కంపెనీల వైఖరిని ఎండగట్టారు. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతోనే రాజధానిని నిర్మించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసి పెట్టుబడిదారీ వర్గాలకు కట్టబెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టడానికి వామపక్ష పార్టీలన్నీ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పోరాటానికి సమాయత్తం అవుతున్నట్లు పేర్కొన్నారు. -
CRDA ఆర్కిటెక్ట్ ఇంట్లో ఏసీబీ సోదాలు
-
సీఆర్డీఏ కార్యాలయంపై ఏసీబీ దాడులు
విజయవాడ: విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. డ్రాఫ్ట్‌మెన్ సాయికుమార్ 40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. దీంతో ఏసీబీ అధికారులు సీఆర్డీఏ కార్యాలయంలో దాడులు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సేకరిస్తే రణమే
పోరాటాల ఖిల్లా బెజవాడ బెబ్బులిలా గర్జించింది. రాజధాని ప్రాంతంలో మూడు పంటలు పండే భూములను లాక్కోవడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు నిరసన తెలియజేస్తూ శాసనసభ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. రైతులకు అండగా నిలుస్తూ విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం వద్ద బుధవారం ఆయన చేసిన ధర్నాతో నగరం దద్దరిల్లింది. లెనిన్ సెంటర్ జన కెరటంతో పోటెత్తింది. భూసేకరణకు వ్యతిరేకంగా నేతలు గర్జించారు. ఈ ధర్నాలో వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలతోపాటు వారికి మద్దతుగా జనం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ పిలుపునకు స్పందించి రాజధాని రైతుకు అండగా నిలిచిన ఆ జనవాహినిని చూస్తే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. - గాంధీనగర్ భూ సేకరణ నోటిఫికేషన్ బెదిరింపుల్లో భాగమే భూసేకరణ చట్టం ప్రయోగించి నోటిఫికేషన్ జారీచేయడం బెదిరింపుల్లో భాగమే. భూమి ఇవ్వకపోతే ఎంత వేధిస్తారో తుళ్లూరుకు చెందిన బోయపాటి సుధారాణి ఉదంతమే నిదర్శనం. ఆమె వద్దకు పోలీసులను, అధికారులను పంపి ఒత్తిడి చేశారు. నాయకులను కూడా పంపి కులం కార్డు ప్రయోగించారు. ఒత్తిళ్లు భరించలేక ఆమె భూములు ఇచ్చివేశారు. ప్రజల కన్నీళ్లతో, వారి కడుపుకొట్టి నిర్మించే రాజధాని అక్కర్లేదు. -అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే రైతులకు అండగా వైఎస్సార్సీపీ మూడు పంటలు పండే భూములను రైతుల వద్ద నుంచి బలవంతంగా లాక్కోవడం అన్యాయం. భూ సేకరణ నిలుపుదల చేయాలి. రైతులకు అండగా వైఎస్ఆర్ సీపీ ఉంటుంది. రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా కోసం ఈనెల 29న నిర్వహించే బంద్‌ను విజయవంతం చేయాలి. కేసుల్ని లెక్క చేయకుండా అందరూ ముందుకు రావాలి. - జలీల్‌ఖాన్, ఎమ్మెల్యే అడ్డగోలు భూసేకరణ తగదు రాజధాని ప్రాంత రైతులు పిల్లల చదువులు, పెళ్లిళ్ల నేపథ్యంలో భూములపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా భూసేకరణ చేపడుతోంది, ఇప్పటికే వేల ఎకరాల భూములు లాక్కుం ది. అవి చాలవన్నట్లు ఇంకా లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రజల తరపున ఆందోళన చేసేందుకు వైఎస్ జగన్ రోడ్డుపైకి వచ్చారు. రాష్ట్రానికి చంద్రబాబు పాలన అతి త్వరలో అంతమవుతుంది. -మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, నూజివీడు ఎమ్మెల్యే రైతుల కన్నీరు రాజధానికి మంచిది కాదు రైతుల కన్నీరు రాజధాని నిర్మాణానికి మంచిదికాదు. రైతుల ఇష్టాఇష్టాలతో సంబంధంలేకుండా భూములు బలవం తంగా లాక్కోవద్దు. మూడు పంటలు పండే భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయవద్దు. రాజధానిలో రైతన్నల ఆక్రోశం గుర్తించిన జగన్ సీఆర్డిఏ ఎదుట ఆందోళన చేపట్టారు. - పి గౌతంరెడ్డి, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రూపాలు మారుస్తున్న చంద్రబాబు చంద్రబాబు అవసరాన్ని బట్టి అనేక రూపాలు మారుస్తుంటారు. అధికారం కోసం మోసాలు చేసే అవతారం, పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన అవతారం. తాజాగా రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే భూ బకాసురుడి అవతారం ఎత్తారు. రాజధాని ప్రాంతంలో భూములు కోల్పోయే ఒక్కో కుటుంబానిది ఒక్కో కథ, కన్నీటి వ్యథ. అయినా చంద్రబాబు గుండె కరగడం లేదు. ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది. -ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్యే, పామర్రు పేదలకు బెజవాడలో ఉండే హక్కులేదా? విజయవాడ వన్‌టౌన్‌లో 1400 కుటుంబాలకు చెందిన పేదల ఇళ్లు తొలగిస్తామంటున్నారు. వాళ్లేం పాపం చేశారు. టీడీపీకీ ఓటెయ్యడమేనా వారు చేసిన పాపం. ప్రజలు ఆగ్రహిస్తే టీడీపీ ప్రభుత్వాన్ని తరిమికొడతారు. -వంగవీటి రాధాకృష్ణ, వైఎస్సార్సీపీ యువజన రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వ కుట్రలు సాగనివ్వం ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలతో రాజధాని ప్రాంతంలోని భూములు గుంజుకుంటోంది. ఆందోళనలతో రైతులు కంటి మీద కునుకులేకుండా జీవిస్తున్నారు.గ్రామకంఠాలను సైతం తీసు కుంటామని ప్రకటించడంతో రైతులు మనోవేదన కు గురవుతున్నారు. దౌర్జన్యంగా భూములు సేకరించడం ఆపాలి. - మర్రి రాజశేఖర్, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అన్యాయంగా రైతుల భూములను లాక్కుంటున్నారు. రైతు కూలీల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుం ది. గతంలో ఏర్పడ్డ ఏ రాష్ర్టంలోనూ రాజధానికి ఇంతగా భూములు తీసుకోలే దు. ఐదువేల ఎకరాలకు మించి అవసరంలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే వేల ఎకరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం మార్చుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదు. -సామినేని ఉదయభాను, అధికార ప్రతినిధి అదరొద్దు, బెదరొద్దు రాజధాని ప్రాంతంలో రైతులు, కూలీలకు భరోసా ఇచ్చేందుకే వైఎస్ జగన్ ఈ ధర్నా చేపట్టా రు. రైతులు, కూలీలు ప్రభుత్వ బెది రింపులకు అదరొద్దు, బెదరొద్దు. ఎవరు ఎప్పుడు కష్టాలలో ఉన్నా వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. బలవంతపు భూసేకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న దాష్టీకాన్ని అడ్డుకుందాం. -కొలుసు పార్థసారథి, అధికార ప్రతినిధి బాబుకు కనువిప్పు కలగాలి చంద్రబాబుకు కనువిప్పుకలగాలి. అభివృద్ధికి మా పార్టీ వ్యతిరేకం కాదు. రైతుల్ని క్షోభపెట్టి భూమలు తీసుకోవడం సరికాదు. ఇలాగే వేలాది ఎకరాలు విదేశీ సంస్థలకు కట్టబెడుతూ పోతే రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత వస్తుంది. చంద్రబాబు చేస్తున్న మోసం, దుర్మార్గం ప్రజలు క్షమించరు. -జోగి రమేష్, వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మంత్రి నారాయణకు రైతుల గురించి ఏం తెలుసు? విద్యా వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించిన మంత్రి నారాయణకు రైతు బాధలు ఏలా తెలుస్తాయి? ఎన్నికల్లో టీడీపీకి డబ్బు పెట్టుబడిగా పెడితే ఆ కృతజ్ఞతతో చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. రైతుల ఇళ్లకొచ్చి మంత్రులు బెదిరింపులకు దిగడం సరికాదు. - లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ గుంటూరు నగర అధ్యక్షుడు -
'రాత రాసి ఉంటే.. సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు'
-
రైతుల నోళ్లు కొట్టి...భూసేకరణా?
-
తుళ్లూరులో వైఎస్సార్సీపీ ఆందోళన
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ నాయకులు మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి, కావటి మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుని వెంటనే భూసేకరణను నిలిపివేయాలని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు. మరోవైపు భూసేకరణకు వ్యతిరేకంగా మంగళగిరిలో వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజాసంఘాలు, రైతుసంఘాలు, అఖిలపక్షాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాజధాని కోసమని చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన భూదందాపై నిరసనలు చేపట్టేందుకు అఖిలపక్షాలు కార్యాచరణ రూపొందించాయి. భూసేకరణకు వ్యతిరేకంగా దశలవారీగా ఆందోళనలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 23వ తేదీన ప్రకాశం బ్యారేజిపై రాస్తారోకో, 24న నిడమర్రులోని సీఆర్డీఏ కార్యాలయం ముట్టడి, అదే రోజు సాయంత్రం అక్కడ బహిరంగసభ ఉంటాయి. ఆగస్టు 25న నిడమర్రు, బేతపూడి, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి మండలాల్లో సీఆర్డీఏ కింద భూములు సేకరించే గ్రామాల్లో బంద్ పాటించనున్నారు. అలాగే 26న విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో చేపట్టే దీక్షల్లో పాల్గొంటారు. ఈ మేరకు వివిధ పక్షాలతో చర్చించి, ఏకాభిప్రాయానికి వచ్చినట్లు నేతలు ప్రకటించారు. -
కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరం
తుళ్ళూరు: రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, అసైన్డ్, సీలింగ్ భూమి సాగుదారుల నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలతో ప్రభుత్వం ఏంచేయాలా అన్న ఆలోచనలో పడింది. ఇందులో భాగంగా రైతు నాయకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. శనివారం తుళ్ళూరు సీఆర్డీఏ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్‌కుమార్, జాయింట్‌కలెక్టర్ శ్రీధర్, సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్లు రాజధాని ప్రాంత రైతునాయకులతో సమావేశమై సమస్యలపై సుదీర్ఘంగా చర్చిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు పనులు లేవని, కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. రైతు దగ్గర భూమి ఉందనీ, ప్రభుత్వం వద్ద పాలసీ ఉందనీ, దీంతో ఇంతవరకు విజయవంతం చేయగలిగామన్నారు. కానీ కూలీల పరిస్థితే అర్థం కావటంలేదన్నారు. 9.3 ద్వారా భూములు తీసుకోవడం, 9.14 ద్వారా భూస్వాధీన ఒప్పందపత్రాలు సిద్ధం చేసి కౌలు పరిహారం ఇవ్వడంతో మా పని అయిపోతుందని భావించవద్దని సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్లనుద్దేశించి అన్నారు. జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు 10%మాత్రమే పనులు జరిగాయని, ఇంకా 90% చేయాల్సిందన్నారు.అధికారులు సమస్యలను అధ్యాయనం చేసి పరిష్కారం కనుగొనాలన్నారు. పనుల నిర్వహణలో పురోగతిపై సమీక్షించుకోవాలన్నారు. ఈ సందర్భంగా కొందరు రైతు నాయకులు రాజధాని ప్రాంతంలోని ప్రజలకు హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. సమావేశం అనంతరం శ్రావణ్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలోని వ్యవసాయ కూలీలకు ఎన్.ఆర్.ఇ.జీ.యస్ ద్వారా పనులు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో ఉండే ముఠామేస్తీలను కలిసి ఉపాధి పనులపై చర్చిస్తామన్నారు. కూలీలకు పనులు కల్పించడంతో పాటు జాబ్‌కార్డుల మంజూరుకు చర్యలుతీసుకోవాలని అధికారులను కోరారు. బ్యాంకుల్లో బంగారం తాకట్టుపెట్టి రుణం పొందిన అసైన్డ్ సాగుదారులు రుణమాఫీ కోసం సీఆర్డీఏ కార్యాలయంలో స్పెషల్‌గ్రేడ్ ఆఫీసర్ రహంతుల్లాను సంప్రదించాల్సిందిగా ఎమ్మెల్యే సూచించారు. ఇప్పటి వరకు గుర్తించిన భూమిలేని రైతులకు నెలవారీ పింఛన్ రూ.2500 అందచేయాలన్నారు. కార్యక్రమంలో సీఆర్డీఏ అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవులు, ఆర్డీవో తూమాటి భాస్కరనాయుడు, ఎంపీపీ వడ్లమూడి పద్మలత పాల్గొన్నారు. -
చంద్రబాబు పచ్చి మోసగాడు: మధు
తుళ్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చి మోసగాడని, ఓటుకు నోటు వ్యవహారంలో అతడిపై కేసు నమోదు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. తుళ్లూరులో సీఆర్డీఏ కార్యాలయం వద్ద రాజధాని ప్రాంత వ్యవసాయ కార్మికులు, భూమి లేని, కౌలురైతులకు నెలవారీ పింఛన్ రూ.9 వేలు చెల్లించాలని తదితర డిమాండ్లతో సీపీఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో భూమిపై ఆధారపడి జీవించే వ్యవసాయకూలీలు, కౌలురైతులు, డ్వాక్రా మహిళలు, వృత్తిదారులను చంద్రబాబు నమ్మించి మోసగించారని దుయ్యబట్టారు. నెలవారీ పింఛన్, కౌలు పరిహారం పంపిణీలో జాప్యం ఎందుకని నిలదీశారు. వ్యవసాయశాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిన్నింగ్ మిల్లుకు సంబంధించి కోట్ల రుపాయల బకాయిలను రద్దు చేశారని ఆరోపించారు. పేదలకు మాత్రం మొండిచేయి చూపుతున్నారని, ఇది దగాకోరు ప్రభుత్వమని అభివర్ణించారు. రాజధాని ప్రజల సమస్యలపై ఈ నెల 9న అన్ని వామపక్షాలు విజయవాడలో సమావేశం అవుతున్నట్లు తెలిపారు. సమావేశంలో చర్చించిన అనంతరం లక్షమంది మహిళలతో మహోద్యమం చేపడతామని, చంద్రబాబు సంగతి తేలుస్తామని హెచ్చరించారు. రాజధాని ప్రాంత సీపీఎం సమన్వయకమిటీ కన్వీనర్ సిహెచ్.బాబురావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజధాని ప్రాంత వ్యవసాయ కార్మికులు, ఇతర వర్గాలకు న్యాయం చేయకపోతే చంద్రబాబు సహా మంత్రులను గ్రామాల్లో తిరగనీయబోమని చెప్పారు. వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.రవి, సీపీఎం మంగళగిరి డివిజన్ కార్యదర్శి జె.వి.రాఘవులు, చేనేత కార్మికసంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ, సీపీఎం నాయకులు జొన్నకూటి వీర్లంకయ్య, జె.నవీన్‌ప్రకాష్, ఈమని అప్పారావు, జయప్రకాష్ పాల్గొన్నారు. -
తిండి పెట్టండి లేదా పని కల్పించండి
తుళ్ళూరు(గుంటూరు జిల్లా): తిండి పెట్టండి లేదంటే పనులైనా కల్పించండి’ అంటూ వ్యవసాయ కూలీలు బుధవారం అన్నం గిన్నెలు పట్టుకొని గుంటూరు జిల్లా తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీలు, అసైన్డ్, సీలింగ్ భూమి సాగుదారులు, చేతివృత్తిదారులు ప్రదర్శనగా వెళ్లి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పోలీసుల నిషేధాజ్ఞలను లెక్కచేయకుండా కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లారు. తమ డిమాండ్లపై అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కూలీలను కార్యాలయం నుంచి బయటకు రప్పించినప్పటికి అక్కడి నుంచి కదలలేదు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబూరావు మాట్లాడుతూ కౌలు పరిహారం చెక్కులు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. నెలకు రూ.2,500 పింఛనుతో కుటుంబాలు గడవడం సాధ్యపడదని, రూ.9,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాజధాని కమిటీ కన్వీనర్ రాధాకృష్ణ మాట్లాడుతూ పింఛన్ లబ్ధిదారుల సంఖ్యను కుదించేందుకే ప్రభుత్వం మరోసారి సర్వే జరిపేందుకు సిద్ధమైందన్నారు. వ్యవసాయకార్మిక జిల్లా సంఘం అధ్యక్షుడు రవి మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల సమస్యల్ని పరిష్కరించకుంటే మంత్రుల్ని గ్రామాల్లో తిరగనియ్యమని హెచ్చరించారు. అనంతరం కాంపిటెంట్ ఆఫ్ అథారిటీకి చెందిన డిప్యూటీ కలెక్టర్ రహంతుల్లాకు వినతి పత్రం అందచేశారు. -
తుళ్లూరు దేశంలో ధూం..ధాం..!
తాడికొండ : తుళ్లూరు మండలం తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు. పదేళ్లపాటు అధికారంలో లేకపోయినా సొంత డబ్బుతో పార్టీని భుజానవేసుకొని మోశాం. తీరా పార్టీ అధికారంలోకి వస్తే తమకే అన్యాయం జరుగుతుందని ఆ పార్టీ నాయకులు శుక్రవారం వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో తలుపులు వేసుకొని నిర్వహించిన సమావేశంలో పార్టీలోని ఓ వర్గంపై మరో వర్గం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నట్టు తెలిసింది. కొందరు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ తీరుపై మండిపడినట్టు సమా చారం. కొన్నాళ్ల కిందట తుళ్లూరులో టీడీపీ కార్యకర్తకు మీ-సేవ కేంద్రం ఏర్పాటుకు అవకాశం రాగా, మరో వర్గం నాయకులు అడ్డుకున్నారని, తన మాటను కూడా ఖాతరు చేయలేదని సమావేశంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ఆరోపించినట్టు తెలిసింది. అనంతరం ప్రస్తుతం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి ఒకరిద్దరు నాయకులకు మినహా మిగిలిన వారికి పనులు జరగటం లేదని ఓ వర్గం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్టు సమాచారం. తమకు అన్యాయం చేస్తే పార్టీ జెండాలతోనే ధర్నా చేస్తామని మరో వర్గం హెచ్చరించినట్టు తెలుస్తోంది.పార్టీ జెండాలను మోసినవారిని గుర్తుంచుకుని, పార్టీ పదవుల్లో సీనియర్లకు ప్రాధాన్యం కల్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. తమకు ప్రతిసారీ అన్యాయం జరుగుతుందంటూ పార్టీ నాయకులు కొమ్మినేని సత్యనారాయణ, జమ్ముల శ్రీనివాసరావు తదితరుల మంత్రి ఎదుట వాపోయారు. ఈ విషయాన్ని తాము కొద్ది రోజుల్లో పరిష్కరిస్తామని మంత్రి నాయకులకు భరోసా ఇచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మాత్రం తాను అందరిని కలుపుకుని పోతున్నానని చెప్పారు. లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. దాదాపు గంటన్నరసేపు చర్చ జరిగింది. -
సీఆర్డీఏ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన
-
సీఆర్డీఏ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన
గుంటూరు : ఏపీ రాజధాని ప్రాంత గ్రామాల రైతుల ఆందోళన కొనసాగుతోంది. తాడేపల్లి మండలం పెనుమాకలో సీఆర్డీఏ కార్యాలయం వద్ద మంగళవారం రైతులు నిరసనకు దిగారు. గతంలో తాము ఇచ్చిన భూముల అంగీకార పత్రాలు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటామని స్థానిక అధికారులు చెబుతున్నారు. -
28 తేదీ తరువాత భూ సేకరణ
రాష్ట్ర మంత్రి నారాయణ తాడికొండ: గుంటూరు జిల్లాలో ప్రతిపాదిత రాజధాని ప్రాంతంలో 28వ తేదీ తరువాత ప్రభుత్వం భూసేకరణకు చర్యలు తీసుకుంటుందని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో మంగళవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ భూసమీకరణ గడువు పెంపు యోచనే లేదన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం 24,200 ఎకరాల భూమిని సమీకరించిందన్నారు. భూ సేకరణకంటే భూ సమీకరణతోనే రైతులకు మేలు కలుగుతుందన్నారు. అనంతరం సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌తో కలసి స్థానిక రైతులు, నాయకులతో పలు అంశాలపై చర్చించారు. -
నేడు వైఎస్సార్సీఎల్పీ పర్యటన
సాక్షి, గుంటూరు/గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం వైసీపీ శాసనసభాపక్షం రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించనుంది. అక్కడి రైతులు, కౌలురైతులు, కూలీలు, వ్యవసాయాధారిత కుటుంబాల సాధకబాధకాలు తెలుసుకోనుంది. పార్టీ నేతలు జరీబు పొలాల్లో తిరిగి, పచ్చని పంట పొలాలను పరిశీలించి, రైతుల ఆందోళనకు ఆలంబనగా నిలువనున్నారు. అనంతరం రాజధాని గ్రామాల్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకుని విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకుంటారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తారు. -
సీఆర్డీఏ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నా
-
‘రాజధాని’లో సింగపూర్ బృందం
రెండురోజుల పాటు గ్రామాల్లో పర్యటన సాక్షి, విజయవాడ బ్యూరో/ గుంటూరు: రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతలు చేపట్టిన సింగపూర్ అధికారుల బృందం ఆ ప్రాంతంలో రెండురోజులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, భవన నిర్మాణాలపై దృష్టి సారించింది. శనివారం ఏరియల్ సర్వే కూడా నిర్వహించింది. మధ్యాహ్నం బృందం సభ్యులు విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌తో సమావేశమయ్యారు.వీరి పర్యటనను గోప్యంగా ఉంచేందుకు అధికారులు ప్రయత్నించారు. సీఆర్డీఏ కార్యాలయంతో పాటు గుంటూరు కలెక్టర్ నుంచి బేస్ మ్యాప్‌లు తీసుకున్న నలుగురు సభ్యుల సింగపూర్ బృందం.. ఆ మ్యాప్‌ల ఆధారంగా పర్యటన కొనసాగించింది. శుక్ర, శనివారాల్లో అమరావతి, ఉండవల్లి, తుళ్లూరు గుంటూరు పరిసర ప్రాం తాల్లో పర్యటించి అక్కడి భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, భూములను పరిశీలించింది. శని వారం గుంటూరులో ఆర్డీవో భాస్కర్ నాయు డు వీరిని పలు ప్రాంతాలకు తీసుకువెళ్లారు. మధ్యాహ్నం విజయవాడ వెళ్లిన ఈ బృందం మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌తో సమావేశమయ్యింది. ఈ నెల 12, 13 తేదీల్లో సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో పాటు ఉన్నతాధికారు లు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపనున్న నేపథ్యంలో పర్యటనకు ప్రాధాన్యత చేకూరింది. కాగా 13న చంద్రబాబుతో కలసి ఈశ్వరన్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు.