నిర్మాణాల్లో ప్లానర్ల పాత్ర కీలకం | planners role is important in constructions | Sakshi
Sakshi News home page

నిర్మాణాల్లో ప్లానర్ల పాత్ర కీలకం

Published Tue, Nov 8 2016 10:41 PM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

నిర్మాణాల్లో ప్లానర్ల పాత్ర కీలకం

నిర్మాణాల్లో ప్లానర్ల పాత్ర కీలకం

సాక్షి, అమరావతి బ్యూరో : అమరావతి రాజధాని నగర, రీజియన్‌ పరిధిలో ప్రణాళికబద్ధంగా లే అవుట్లు, నిర్మాణాలు చేపట్టే విషయంలో ఆర్కిటెక్టులు, టౌన్‌ప్లానర్ల పాత్ర కీలకమని ఏపీ సీఆర్‌డీఏ డెవలప్‌మెంట్‌ ప్రమోషన్‌ విభాగం డైరెక్టర్, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టౌన్‌ప్లానర్స్‌ ఏపీ రీజియన్‌ చాప్టర్‌ సెక్రటరీ వి.రాముడు పేర్కొన్నారు. సీఆర్‌డీఏ కార్యాలయంలో మంగళవారం వరల్డ్‌ టౌన్‌ ప్లానర్స్‌ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వి.రాముడు మాట్లాడుతూ కాలానుగుణంగా టౌన్‌ ప్లానింగ్‌ యాక్ట్‌లో వస్తున్న మార్పులను టౌన్‌ ప్లానర్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. క్రమబద్ధమైన ప్లానింగ్‌ ఆవశ్యకతను అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ప్లానర్లదేనని పేర్కొన్నారు. ఆక్రమ లే అవుట్లు, భవన నిర్మాణాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదని సూచించారు. సీఆర్‌డీఏ పరిధిలో ఎలాంటి ఆక్రమ లే అవుట్లు, నిర్మాణాలకు అనుమతించడం లేదని చెప్పారు. డెవలప్‌మెంట్‌ ప్రమోషన్‌ విభాగంలో ఎన్నో మార్పులు చేపట్టామని,  డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ సిస్టం ద్వారా ఆటోమేటిక్‌ ప్రమోషన్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌డీఏ ప్రిన్సిపల్‌ ప్లానర్లు వీవీఎల్‌ఎన్‌ శర్మ, ఎన్‌ఆర్‌ అరవింద్, సీనియర్‌ ప్లానింగ్‌ అధికారి జి.నాగేశ్వరరావు, ప్లానింగ్‌ అధికారి సీహెచ్‌వీ సాంబశివరావు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement