సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు | farmers dharna due to power supply in ananthpur district | Sakshi
Sakshi News home page

సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు

Published Mon, Oct 12 2015 10:05 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

farmers dharna due to power supply in ananthpur district

గాండ్లపెంట: పది రోజులుగా వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ఆగ్రహించిన రైతులు సోమవారం ఉదయం  సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం చెరువుముందరి తాండా, వేపరాల గ్రామాల వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా కావడం లేదు.

ఈ గ్రామాలకు పనిచేసే లైన్‌మన్‌ను సస్పెండ్ చేయడంతో ఆ లైన్‌కు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పునరుద్ధరించలేదు. దాంతో ఆగ్రహించిన రెండు గ్రామాల రైతులు సోమవారం ఉదయం గాజులవారిపలిలెలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. స్పందించిన ఏఈ గౌరీశంకర్ లైన్‌మన్‌ను పంపి విద్యుత్‌ను పునరుద్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement