రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం మంత్రి ప్రత్తిపాటి
వర్గీకరణ సున్నిత అంశం..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు పెట్టుకున్నాయని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై మీ వైఖరేంటని ప్రశ్నించగా, అది సున్నితమైన అంశమని, ముఖ్యమంత్రి పరిష్కరిస్తారని సమాధానం దాటవేశారు. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, పార్టీ నాయకులు దాసరి రాజామాస్టారు, మన్నవ సుబ్బారావు, బోనబోయిన శ్రీనివాసయాదవ్, మద్దాళి గిరిధర్, టీవీ రావు తదితరులు పాల్గొన్నారు.
కొరిటెపాడు (గుంటూరు) : రైతులకు గిట్టుబాబు ధర కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే రైతుల నుంచి కందులు కొనుగోలు చేస్తున్నామని, త్వరలో మినుములు, శనగలు, పెసలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. మోన్‌శాంటో హైబ్రిడ్ పత్తి విత్తనాల వేసిన చాలామంది రైతులు పింక్‌బౌల్ పురుగు సోకి నష్టపోయారని తెలిపారు. మోన్‌శాంటో కంపెనీ(ప్యాకెట్‌పై) వసూలుచేస్తున్న రూ.180 ఈ ఏడాది మానుకోవాలని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. రైతులకు అవసరమైన అధునాత యంత్ర పరికరాలను 50 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ఏపీ ఆగ్రోస్ ద్వారా కొన్ని వ్యవసాయ యంత్ర పరికరాలను తయారీదారుల నుంచే నేరుగా రైతులకు అందజేనున్నట్లు మంత్రి ప్రత్తిపాటి వివరించారు.