అగచాట్లు | Farmers Suffering For Sees In YSR Kadapa | Sakshi
Sakshi News home page

అగచాట్లు

Published Sat, Oct 6 2018 2:18 PM | Last Updated on Sat, Oct 6 2018 2:18 PM

Farmers Suffering For Sees In YSR Kadapa - Sakshi

మహిళలను క్యూలో నుంచి లాగేస్తున్న పోలీసులు

సాక్షి కడప : విత్తనాల కోసం రైతులకు అగచాట్లు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తగా శనగ విత్తన కంపెనీకి వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. మొదటిరోజు సర్వర్‌తోపాటు ఆన్‌లైన్‌ సమస్యలు ఏర్పటడంతో ఇబ్బందులు తలెత్తాయి. బుడ్డశనగ విత్తన కాయల కోసం రాజుపాలెం, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు ప్రాంతాల్లో రైతులు భారీగా బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలుచోవాల్సి వస్తోందని వాపోతున్నారు. శుక్రవారం పులివెందుల ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో క్యూలైన్లలో నిలుచున్న మహిళలను స్థానిక మహిళా పోలీసులు లాగేశారు. పోలీసుల మాటలతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.ఉన్నతాధికారులు స్పందించి విత్తనాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement