హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆడపిల్ల పుట్టడాన్ని జీర్ణించుకోలేని ఓ కసాయి తండ్రి నాలుగు నెలల పసికందును గొంతు నులిమి హతమార్చాడు. ఈ హృదయ విదారక సంఘటన బుధవారమిక్కడ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వాసు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లాకు చెందిన బాబన్న(25), రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన శాంతకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి అనూష (4 నెలలు) అనే చిన్నారి ఉంది.
అత్తరు వ్యాపారం చేసే బాబన్న పాపిరెడ్డి కాలనీ వాంబే గృహ సముదాయంలో ఉంటున్నాడు. బాబన్న మంగళవారం చిత్తుగా తాగి అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నాడు. చర్చికి వెళ్లాలని చెప్పి బుధవారం ఉదయం భార్యను మంచినీటికోసం కిందకు పంపాడు. అనంతరం బాబన్నలోని రాక్షసుడు నిద్ర లేచాడు. అనూషను గొంతు నులిమి హత్య చేసి ఏమీ ఎరగనట్టు ఉయ్యాలలో పడుకోబెట్టాడు. చర్చికి వెళ్లేందుకు బిడ్డను చేతుల్లోకి తీసుకున్న శాంత... చిన్నారిలో ఎలాంటి కదలికలు లేకపోవడం, మెడ చుట్టు కమిలి ఉండడంతో నిర్ఘాంతపోయింది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు బాబన్నను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆడపిల్ల పుట్టిందని..
Published Thu, Jan 2 2014 12:20 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement