కనురెప్పే కాటేసింది | Father sexually abused daughter at Hydrabad | Sakshi
Sakshi News home page

కనురెప్పే కాటేసింది

Published Thu, Feb 13 2014 8:25 AM | Last Updated on Tue, Sep 4 2018 4:52 PM

అమర్‌నాథ్ ముదిరాజ్‌ - Sakshi

అమర్‌నాథ్ ముదిరాజ్‌

కన్న కూతుళ్లపై ఏడాదిగా తండ్రి లైంగిక దాడి
 
హైదరాబాద్ : అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లతో ఓ ఇంటి వారిని చేయాల్సిన తండ్రే కన్న కూతుళ్లను కామాంధుడిగా మారి కాటేశాడు. మనిషిననే ఇంగితం మరచి ఇద్దరు కూతుళ్లపై ఏడాదిగా లైంగిక దాడితో తన కామవాంఛ తీర్చుకుంటూ వారిని నరకయాతన పెట్టాడు. ఓ కూతురు ధైర్యం చేసి తల్లికి జరిగిన విషయాన్ని చెప్పడంతో ఆమె అవాక్కయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన  జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ...జగద్గిరిగుట్ట అంజ య్యనగర్‌కు చెందిన అమర్‌నాథ్ ముదిరాజ్‌కు  ఇద్దరు భార్యలు. సంజయ్‌పురి కాలనీలో ఉండే మొదటి భార్య తన ఇద్దరు కూతుళ్లతో పెద్ద కూతురు(15), చిన్న కూతురు (14)తో కలిసి నివాసం ఉంటుంది.


 
 ఈ ఇద్దరు కూతుళ్లపై తండ్రి గత ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. కాగా విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. అంతేకాకుండా ‘మీ అమ్మకు ఈ విషయం తెలిస్తే గుండె ఆగి చస్తుంది’ అంటూ కూతుళ్లను మానసికంగానూ దెబ్బతీసేవాడు. కొంత కాలంగా పిల్లలపై లైంగిక వేధింపులు తీవ్రతరం కావడంతో, విషయాన్ని తల్లికి మొరపెట్టుకున్నారు. దాంతో తల్లి తన ఇద్దరు కూతుళ్లతో మంగళవారం రాత్రి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమర్‌నాథ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇటీవల ఈ ప్రబుద్ధుడు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా నియమితుడు కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement