ఫిబ్రవరి 2, 3 తేదీల్లో కేంద్ర మంత్రి పర్యటన | February 2, 3, dates central Minister tour | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 2, 3 తేదీల్లో కేంద్ర మంత్రి పర్యటన

Published Thu, Jan 30 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

February 2, 3, dates central Minister tour

 రంపచోడవరం, న్యూస్‌లైన్ : కేంద్ర పంచాయతీరాజ్, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి వై.కిషోర్ చంద్రదేవ్ ఫిబ్రవరి 2,3 తేదీల్లో ఏజెన్సీలో పర్యటించనున్నట్టు ఐటీడీఏ పీఓ సి.నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. రెండున రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం, అడ్డతీగల మండలాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉంటాయన్నారు. మూడున పీఎంఆర్‌సీలో వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. అదే రోజు మంత్రి వ్యవసాయ, ఉద్యానవన, ఐకేపీ, రాజీవ్ యువ కిరణాలు, మండల మహిళా సమాఖ్య లీడర్లు తదితరులతో చర్చాగోష్టిలో పాల్గొంటారని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement