kishore chandra dev
-
టీడీపీ ఎన్డీయేలో చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ రాజీనామా
-
టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా
సాక్షి, అమరావతి: టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు. ఎన్డీయేలో టీడీపీ చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. విద్వేష శక్తులతో చేతులు కలపడం సహించరాని విషయమన్న కిశోర్.. అధికారం కోసం తన ఆత్మను అమ్ముకోలేనని చంద్రబాబుకు ఘాటు లేఖ రాశారు. ఇదీ చదవండి: పొత్తు.. టీడీపీ సీనియర్లు చిత్తు -
మట్టి కరిచిన 30 ఏళ్ల అనుభవం!
సాక్షి, విశాఖసిటీ: అనుభవం పనిచేయలేదు.. రాజ కుటుంబమనే గౌరవమూ దక్కలేదు. మూడు దశాబ్దాలుగా అధికారాన్ని కట్టబెడితే.. చేసిన మంచి ఏమీ లేదని గ్రహించిన గిరిపుత్రులు రాజుని ఇంటికి సాగనంపారు. మట్టి మనిషి చేతిలో ఘోర పరాభవాన్ని పరిచయం చేశారు. స్వచ్ఛమైన గిరి పుత్రికకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. కల్మషం లేని మనుషులంతా కలకాలం గుర్తుండిపోయే విజయాన్ని జగనన్నకు కానుకగా అందించారు. తండ్రీ కూతుళ్లకు తగిన గుణపాఠం చెప్పారు. అరకు పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. పోరాటాలే అనుభవాలుగా.. తండ్రి ఆశయాల కోసం రాజకీయాల వైపు అడుగులు వేసిన గొడ్డేటి మాధవి తెగువ.. తిరుగులేని విజయాన్ని అందించింది. ప్రత్యర్థి అనుభవమంత వయసు లేకపోయినా.. బినామీ కొండను ఢీకొట్టి.. అమాయక గిరిజనుల్లో కొత్త శకానికి నాంది పలికారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన మాధవి.. 30 ఏళ్లుగా రాజకీయ చక్రం తిప్పుతున్న కిశోర్‌చంద్రదేవ్‌ని ఇంటికి సాగనంపారు. మొదటి రౌండ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడా వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌కు అవకాశం ఇవ్వకుండా.. మాధవి ముందంజలో దూసుకుపోయారు. మొత్తంగా.. మాధవికి 5,51,560 ఓట్లు పోలవ్వగా.. కిశోర్‌చంద్రదేవ్‌కు 3,34,214 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన వైరిచర్ల కుమార్తె శృతిదేవి 17,479 ఓట్లకే పరిమితమై డిపాజిట్లు కోల్పోయారు. ఈమె కంటే నోటాకు (47,376) రెండున్నర రెట్లు అధికంగా ఓట్లు పోలవ్వడం గమనార్హం. తొలి రౌండ్లో మొదలైన వైఎస్సార్సీపీ ఆధిక్యం.. ఎక్కడా తగ్గకుండా.. దూసుకుపోయింది. మొత్తంగా.. 2 లక్షల 17 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఓటుతో గుణపాఠం చెప్పిన గిరిజనం సుదీర్ఘ రాజకీయ అనుభవం.. రాజరిక వారసత్వం.. 30 సంవత్సరాలు పార్లమెంట్లో గడిపారన్న ఘన చరిత్ర.. ఇవన్నీ చెప్పుకోడానికే తప్ప.. ఓటు వేసి గెలిపించిన ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కనీసం కృషి చేయలేదన్న అపవాదుని కిశోర్ చంద్రదేవ్ మూటకట్టుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప.. నియోజకవర్గాన్ని పట్టించుకున్న సందర్భం లేదు. ఈ వ్యతిరేకతే.. అనుభవానికి గుణపాఠం చెప్పింది. అసలేం చేశారని ఓటెయ్యాలంటూ ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కిశోర్‌చంద్రదేవ్ కుమార్తె శృతి దేవిని సైతం సాగనంపారు. కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితిలో ఘోర పరాజయం చవిచూశారు. తండ్రీ కుమార్తెలను గిరి పుత్రులు ఓటుతో గుణపాఠం చెప్పారు. -
మట్టి కరిచిన 30 ఏళ్ల అనుభవం
సాక్షి, శ్రీకాకుళం: అనుభవం పనిచెయ్యలేదు.. రాజ కుటుంబమనే గౌరవమూ దక్కలేదు. మూడు దశాబ్దాలుగా అధికారాన్ని కట్టబెడితే.. చేసిన మంచి ఏమీ లేదని గ్రహించిన గిరిపుత్రులు రాజుని ఇంటికి సాగనంపారు. మట్టి మనిషి చేతిలో ఘోర పరాభవాన్ని పరిచయం చేశారు. స్వచ్ఛమైన గిరి పుత్రికకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. కల్మషం లేని మనుషులంతా కలకాలం గుర్తుండిపోయే విజయాన్ని జగనన్నకు కానుకగా అందించారు. తండ్రీ కూతుళ్లకు తగిన గుణపాఠం చెప్పారు. అరకు పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. పోరాటాలే అనుభవాలుగా.. తండ్రి ఆశయాల కోసం రాజకీయాల వైపు అడుగులు వేసిన గొడ్డేటి మాధవి తెగువ.. తిరుగులేని విజయాన్ని అందించింది. ప్రత్యర్థి అనుభవమంత వయసు లేకపోయినా.. బినామీ కొండను ఢీకొట్టి.. అమాయక గిరిజనుల్లో కొత్త శకానికి నాంది పలికారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన మాధవి.. ముప్ఫై ఏళ్లుగా రాజకీయ చక్రం తిప్పుతున్న కిశోర్‌చంద్రదేవ్‌ని ఇంటికి సాగనంపారు. మొదటి రౌండ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడా వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌కు అవకాశం ఇవ్వకుండా.. మాధవి ముందంజలో దూసుకుపోయారు. మొత్తంగా మాధవికి 5,51,560 ఓట్లు పోలవ్వగా.. కిశోర్‌చంద్రదేవ్‌కు 3,34,214 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన వైరిచర్ల కుమార్తె శృతిదేవి 17,479 ఓట్లకే పరిమితమై డిపాజిట్లు కోల్పోయారు. ఈమె కంటే నోటాకు (47,376) రెండున్నర రెట్లు అధికంగా ఓట్లు పోలవ్వడం గమనార్హం. తొలి రౌండ్లో మొదలైన వైఎస్సార్సీపీ ఆధిక్యం ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయింది. మొత్తంగా 2 లక్షల 17 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. కాగా, పాలకొండ నియోజకవర్గం నుంచి గొడ్డేటి మాధవికి 68241 ఓట్లు పోలవ్వగా, టీడీపీ అభ్యర్థి కిశోర్‌చంద్రదేవ్‌కు 53202 ఓట్లు పోలయ్యాయి. జనసేన అభ్యర్థి వి.గంగులయ్యకు 2933 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి వై.శృతీదేవికి 1305 ఓట్లు పోలయ్యాయి. -
కిషోర్ చంద్రదేవ్‌కు షాక్
సాక్షి, పాలకొండ: ఎట్టకేలకు పాలకొండ టీడీపీ టికెట్ నిమ్మక జయకృష్ణకు ఖరారు చేశారు. ఆ పార్టీ తరఫున అరకు పార్లమెంటు అభ్యర్థిగా రంగంలో ఉన్న కిషోర్ సూర్య చంద్ర సూర్యనారాయణదేవ్ తాను సూచించిన వ్యక్తికి కేటాయించాలని చంద్రబాబునాయుడుని కోరినా.. చివరకు మంత్రి కళా వెంకటరావు మాటే నెగ్గింది. అరకు నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఒక్క పాలకొండ టికెట్ మాత్రమే తను సూచించిన వ్యక్తికి కేటాయించాలని సీఎంను కోరారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న జయకృష్ణపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు కుమార్తెకు టికెట్ అందించాలని కోరారు. దీంతో కొంత కాలంగా పాలకొండ టీడీపీ అభ్యర్థి విషయంలో చంద్రబాబు తేల్చలేదు. జయకృష్ణకు వ్యతిరేకంగా పాలకొండ, వీరఘట్టం, భామిని, సీతంపేట మండల స్థాయి నాయకులు ఫిర్యాదులు అందించారు. జయకృష్ణకు టికెట్ ఇస్తే పార్టీ కోసం పనిచేసేది లేదని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిలో జయకృష్ణ స్థానంలో మరో వ్యక్తిని తెరపైకి తీసువస్తారన్న ప్రచారం జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కమిడి కళావెంకటరావును నమ్ముకుని టికెట్ ఆశించిన జయకృష్ణ ఆయన ఆశీస్సులతో ఎట్టకేలకు టికెట్ సాధించారు. భగ్గుమన్న అసమ్మతి నేరుగా చంద్రబాబునే కలిసి తమ వాదన వినిపించి అభ్యర్థిని కొత్తవారిని తీసురావాలని కోరినా చివరకు జయకృష్ణకే టికెట్ కేటాయించడంపై ప్రత్యర్థి వర్గాలు భగ్గుమంటున్నాయి. ఆదివారం అత్యవసరంగా సమావేశమైన వీరు తమ కార్యాచరణపై చర్చించారు.కిషోర్‌తో సమావేశమై తమ వాదన వినిపించారు. అభ్యర్థిని మార్చాలని, లేకపోతే కిషోర్ పోటీ నుంచి తప్పుకునేలా ప్రతిపాదన చేయాలని పట్టుపడుతున్నారు. దీంతో పాలకొండ పంచాయితీ మరోమారు చంద్రబాబు వద్దకు చేరింది. -
ఒప్పందం బట్టబయలు
-
'బాక్సైట్ అనుమతులన్నీ చంద్రబాబు ఇచ్చినవే'
సాక్షి, విజయనగరం : తెలుగుదేశం పార్టీలోకి మారేటప్పుడు ఆ పార్టీని స్తుతిస్తూ మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ బాక్సైట్ జీఓల విషయంలో అబద్ధాలు మాట్లాడారని వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. గిరిజన సలహా మండలి ద్వారా గతంలో చంద్రబాబు లీజులు ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టడంతో, తరువాత వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ఇచ్చిన జీఓను రద్దు చేశారని గుర్తు చేశారు. జీఓ నెంబర్ 97ను చంద్రబాబు ఇష్యూ చేస్తే వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఒత్తిడి తెచ్చినా పూర్తి స్థాయిలో రద్దు చేయనిది చంద్రబాబు ప్రభుత్వమేనని నిప్పులు చెరిగారు. బాక్సైట్ అనుమతులు, లీజులు అన్ని చంద్రబాబు ఇచ్చినవేనని తెలిపారు. అటవీ హక్కులపై చంద్రబాబు తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గిరిజనులు, వారి ప్రతినిధులు ఒత్తిడి తెచ్చినా చంద్రబాబు వినలేదని చెప్పారు. ఐదేళ్ల పాలన సమయం అయిపోవడంతో అభివృద్ధి చూసి ఓట్లేయమని అడగకుండా, కొత్త పథకాలు పెడుతూ, ఎన్నికల తాయిలాలు ఇస్తున్నారని తూర్పారబట్టారు. పసుపు కుంకుమ వంటి పథకాలు క్రింది స్థాయికి వెళ్ల లేదని తెలుసుకొని పిచ్చి ప్రేలాపణలు చేస్తున్నారన్నారు. బీజేపీతో కలసి ప్రయాణించినప్పుడు సాగించిన చంద్రబాబు చేతగాని పాలనను ప్రజలు మరచిపోలేదన్నారు. సాక్షి పత్రికను బహిష్కరించండి అంటూ సుధీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు ప్రజాస్వామ్యానికి మూలస్థంభం అయిన పత్రికా స్వేచ్చను హరించేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. వాస్తవాలు ప్రచారం చేస్తున్నాయనే భయంతో సాక్షిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పత్రికలను బహిష్కరించాలన్న ఒక్క పిలుపుతో చంద్రబాబుకు ఓటమిపై భయం పట్టుకుందన్న విషయం స్పష్టమవుతోందన్నారు. -
తండ్రి టీడీపీ నుంచి..కూతురు కాంగ్రెస్ నుంచి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎన్నికల్లో పోటీ చేయడం సంగతేమో కానీ టికెట్ల రేసులోనే కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్‌కు ఇంటిపోరు మొదలైంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిశోర్ చంద్రదేవ్ త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు మంగళవారం ఢిల్లీలో ప్రకటించారు. ధర్మపోరాట దీక్ష అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ఆయన పార్టీలో చేరికపై, అరకు లోక్‌సభ నుంచి పోటీ చేసే విషయమై చర్చించినట్టు చెప్పారు. వాస్తవానికి ఆయన కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి ఈ పరిణామం ఊహించిందే. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆయన కుమార్తె శృతీదేవి సరిగ్గా రెండు రోజుల కిందటే అరకు లోక్‌సభ సీటు కేటాయించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు దరఖాస్తును సోమవారం విజయనగరం జిల్లా డీసీసీ కార్యాలయంలో అందించినట్టు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాస్ వెల్లడించారు. పార్టీ టికెట్ల నిర్ణయం, పోటీ ఏమో గానీ... తండ్రి ‘సైకిల్’ ఎక్కేందుకు పోటీ పడుతుంటే కుమార్తె ‘హస్త’వాసిని నమ్ముకోవడం మాత్రం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇలావుండగా టీడీపీ అధిష్టానం అవకాశమిస్తే విశాఖ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తానని సినీనటుడు బాలకృష్ణ చిన్నల్లుడు, మాజీ ఎమ్మెల్యే గీతం మూర్తి మనుమడు, గీతం వర్సిటీ ప్రస్తుత అధ్యక్షుడు శ్రీభరత్ విశాఖలో తెలిపారు. -
కాంగ్రెస్‌లో కొత్త అనుబంధ సంఘం ఏర్పాటు
న్యూఢిల్లీ : ఆలిండియా ఆదివాసీ కాంగ్రెస్ పేరుతో కొత్త అనుబంధ సంఘంను ఏఐసీసీ ఏర్పాటు చేసింది. దీనికి జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్‌ను రాహుల్ గాంధీ నియమించారు. 58 మందితో జాతీయ కార్యవర్గం ఏర్పాటు చేశారు. ఈ కొత్త అనుబంధ సంఘంలో ఐదుగురు వైస్ ఛైర్మెన్లను నియమించారు. వైస్ ఛైర్మెన్‌గా తెలుగు రాష్ట్రానికి చెందిన బెల్లయ్య నాయక్ అవకాశం దక్కింది. సభ్యులుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పి.బాలరాజు, సీతక్క, బలరాం నాయక్, పొద్దం వీరయ్య, రవీంద్ర నాయక్, రేగా కాంతారావ్, ఆత్రం సక్రులు చోటు చేజిక్కించుకున్నారు. -
దళితుడైతే దాడులు మర్చిపోతారా?
♦ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిపై పీసీసీ చీఫ్ ఉత్తమ్.. ♦ జనరల్ స్థానాల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు టికెట్లు: కిశోర్ చంద్రదేవ్ ♦ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల ముఖ్యులతో టీపీసీసీ శిక్షణా శిబిరం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నేతను పోటీకి పెడితే వారిపై జరుగుతున్న దాడులను మరచిపోతారా అని టీపీసీసీ అధ్య క్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం లోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల ముఖ్యనేత లతో టీపీసీసీ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణా శిబిరం హైదరాబాద్‌లో బుధవారం జరిగిం ది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గత ఎన్నికల్లో కొంత బలహీనపడిందని ఉత్తమ్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లోనూ గత ఎన్నికల్లో ఓడి పోవడంపై సమీక్షించుకుని, తిరిగి బలోపేతం కావడానికి పనిచేయాలని సూచించారు. పంజాబ్‌లో అమలు చేసిన విధానం సత్ఫలి తాలిచ్చిందని, అదే మోడల్‌ను రాష్ట్రంలోనూ అమలు చేయనున్నట్లు తెలిపారు. దళితులను బీజేపీ, టీఆర్ఎస్ మోసం చేస్తున్నాయని విమ ర్శించారు. సీఎం కేసీఆర్ ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఎస్టీలకు మొదటి సంతకంతోనే రిజర్వేషన్లు ఇస్తామని ఇంకా ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పింఛను 1,500 కు పెంచుతామని, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లిస్తామని, అదనంగా మరో గది ఇస్తామని చెప్పారు. సమర్థులైన ఎస్సీ, ఎస్టీ లకు కూడా జనరల్ స్థానాల్లో కాంగ్రెస్ నుంచి అవకాశాలు న్నాయని ఏఐసీసీ ఆదివాసీ విభాగం చైర్మన్, కేంద్ర మాజీమంత్రి కిశోర్ చంద్రదేవ్ చెప్పా రు. ప్రాంతీయ పార్టీలు.. ప్రాంతీయతత్వాని కి, సంకుచిత ప్రయోజనాలకే పరిమితమ వుతాయని విమర్శించారు. రాష్ట్రంలో, కేంద్రం లో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. యూపీఏ పథకాలకు పేర్లు మారుస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం ఒట్టి ప్రచారం చేసుకుం టోందని విమర్శించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులన్నీ మోదీ కట్టించారా.. అని ప్రశ్నించారు. బ్రహ్మపుత్ర నదిపై బ్రిడ్జికి రిబ్బ న్ కత్తిరించి, తామే కట్టి నట్లు మోదీ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. రిజర్వుడ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలహీనపడు తోందని ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో 31 స్థానాల్లో పోటీచేస్తే 6 స్థానాల్లోనే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారని, వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారన్నారు. బూత్ స్థాయి నుంచి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులకు పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలను టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వివరించారు. -
ఫిబ్రవరి 2, 3 తేదీల్లో కేంద్ర మంత్రి పర్యటన
రంపచోడవరం, న్యూస్‌లైన్ : కేంద్ర పంచాయతీరాజ్, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి వై.కిషోర్ చంద్రదేవ్ ఫిబ్రవరి 2,3 తేదీల్లో ఏజెన్సీలో పర్యటించనున్నట్టు ఐటీడీఏ పీఓ సి.నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. రెండున రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం, అడ్డతీగల మండలాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉంటాయన్నారు. మూడున పీఎంఆర్సీలో వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. అదే రోజు మంత్రి వ్యవసాయ, ఉద్యానవన, ఐకేపీ, రాజీవ్ యువ కిరణాలు, మండల మహిళా సమాఖ్య లీడర్లు తదితరులతో చర్చాగోష్టిలో పాల్గొంటారని తెలిపారు. -
కిశోర్‌పై తిరుగుబావుటా!
బొబ్బిలి, న్యూస్‌లైన్: కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్‌పై బొత్స వర్గం తిరుగుబావుటా ఎగురవేసింది. ఒకే పార్టీలో ఉంటున్నా కొంత కాలంగా చాపకింద నీరులా వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. బొత్సను లక్ష్యంగా చేసుకొని ప్రతిసారీ కిశోర్ చంద్రదేవ్ మాటల యుద్ధం చేస్తుంటే, ఇప్పుడు అదను దొరకడంతో బొత్స వర్గం కిశోర్‌పై అసంతృప్తిని వెళ్లగక్కింది. అందుకు జిల్లా కేంద్రంలో జరిగిన అభిప్రాయ సేకరణ కార్యక్రమమే వేదిక అయింది. ‘ఢిల్లీలోనే నిత్యం తిరుగుతున్న అరుకు ఎంపీ, కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ గల్లీలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, ఈ సారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిల్లోనూ టిక్కెట్టు ఇవ్వకపోతేనే మంచిదని’ అదే పార్టీకి చెందిన నాయకులు జిల్లాకు వచ్చిన కాంగ్రెస్ పరిశీలకులు, ర్ణాటక ఎమ్మెల్సీ మానేకర్ శ్రీనివాస్, పీసీసీ కార్యదర్శి చినఅప్పలనాయుడు వద్ద కుండ బద్దలు కొట్టారు. ఏడు జిల్లాలకు విస్తరించిన ఉన్న అరుకు పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కోసం సోమవారం జిల్లా కేంద్రంలో రాహుల్ దూతలు అభిప్రాయ సేకరణ చేశారు. పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రస్తుతం అరుకు ఎంపీగా ఉన్న కేంద్రమంత్రిపై అభిప్రాయం అడిగేసరికి సాలూరుకు చెందిన నాయకులు ఒకే సారి ముక్త కంఠంతో ఆయనకు టిక్కెట్ ఇవ్వవద్దని చెప్పారు. ఎంపీ అయిన తరువాత, కేంద్ర మంత్రి పదవి వచ్చిన తరువాత అసలు కి శోర్ చేసిందేమీ లేదని, ఈ సారి టిక్కెట్టు ఇస్తే విజయం కష్టమని చెప్పుకొచ్చారు. అయితే జిల్లా మంత్రి బొత్స, కిశోర్‌కు మధ్య ఎప్పటి నుంచోఅభిప్రాయ బేధాలున్నాయి. దీంతో బొత్స వర్గం ఇప్పుడు కిశోర్‌కు వ్యతిరేకంగా గళమెత్తినట్టు సమాచారం. సమైక్య రాష్ర్టం కోసం కూడా కిశోర్ పలు రకాలుగా వాదనలు వినిపించడం వల్ల వ్యతిరేకిత తీవ్రంగా ఉందని, ఈ పరిస్థితిల్లో టిక్కెట్టు ఇవ్వకపోవడమే మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తంచేసినట్లు సమాచారం. -
'ప్రత్యేక రాయలసీమ.. ఆంధ్ర రాజధానిగా విశాఖను చేయాలి'
రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక సమర్పించారు. అలాకాని పక్షంలో తెలంగాణలో రాయలసీమను కలపాలని కిశోర్ చంద్రదేవ్ సూచించారు. ఇక ఆంధ్ర ప్రాంతానికి విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించాలని నివేదించారు. తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందం సోమవారం ఇరు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులతో సమావేశమైంది. తొలుత తెలంగాణ, ఆ తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు జీవోఎంతో భేటి అయ్యారు. హైదరాబాద్, భద్రాచలంతో కూడిన తెలంగాణ కావాలని ఆ ప్రాంత మంత్రులు కోరగా, సీమాంధ్ర మంత్రులు ప్రత్యేక ప్యాకేజీ, హైదరాబాద్ యూటీ విషయం గురించి మాట్లాడినట్టు తెలిపారు. -
కాంగ్రెస్ అధిష్టానానికి కిశోర్‌చంద్రదేవ్ లేఖలు
తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉద్యమం చేపట్టిన ఏపీ ఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపాలని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ బుధవారం లేఖలు రాశారు. రాష్ట్ర విభజనతో నష్టపోతామని వారంతా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సీమాంధ్ర ఉద్యమంతో ఒకటిన్నర మాసాలుగా ప్రభుత్వం, పాలనా యంత్రాంగం పూర్తిగా స్థంభించిపోయాయని వివరించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభను లేఖలో ప్రస్థావించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రక్షణ మంత్రి ఆంటోనీ, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌లకు మంత్రి విడివిడిగా లేఖలు రాశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో ఎన్జీవో సంఘం నేతలు ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలూ చేయలేదని, హుందాగా వ్యవహరించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్భాగమైన ఎన్జీవోల సభ విజయవంతం కావడం మొత్తం ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలకు, విభజనపై వారిలో వ్యక్తమవుతున్న భయాందోళనలకు అద్దం పట్టిందని వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏపీ ఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపాలని అధిష్టానం పెద్దలకు విజ్ఞప్తి చేశారు.