'ప్రత్యేక రాయలసీమ.. ఆంధ్ర రాజధానిగా విశాఖను చేయాలి'
రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక సమర్పించారు. అలాకాని పక్షంలో తెలంగాణలో రాయలసీమను కలపాలని కిశోర్ చంద్రదేవ్ సూచించారు. ఇక ఆంధ్ర ప్రాంతానికి విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించాలని నివేదించారు.
తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందం సోమవారం ఇరు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులతో
సమావేశమైంది. తొలుత తెలంగాణ, ఆ తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు జీవోఎంతో భేటి అయ్యారు. హైదరాబాద్, భద్రాచలంతో కూడిన తెలంగాణ కావాలని ఆ ప్రాంత మంత్రులు కోరగా, సీమాంధ్ర మంత్రులు ప్రత్యేక ప్యాకేజీ, హైదరాబాద్ యూటీ విషయం గురించి మాట్లాడినట్టు తెలిపారు.