విద్యానగర్,న్యూస్‌లైన్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఆధార్‌ను అనుసంధానం చేయటం అన్యాయమని విద్యార్థులు ధ్వజమెత్తారు. దానివల్ల ఎందరో విద్యార్థులు నష్టపోతున్నారంటూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం సంక్షేమశాఖ భవన్‌ను ముట్టడించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి అయ్య స్వామి, అధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడుతూ ఆధార్ అనుసంధానం వల్ల ఆధార్‌లేనివారు, పేర్లు తదితరాలు తప్పు ఉన్నవారు తీవ్రంగా నష్ట పోతున్నారని చెప్పారు. వెంటనే ఆధార్ అనుసంధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లా వ్యాప్తంగా 60 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఆధార్‌తో అర్జీలు పెట్టుకున్నారని, మిగిలిన 40 శాతం మంది విద్యార్థులు ఆధార్‌లేక ఫీజు రీఎంబర్స్‌మెంట్ పొందలేకపోతున్నారని వాపోయారు. ఆధార్ లింక్ ఉపసంహరించాలని నినాదాలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. విధ్యార్థులు సంక్షేమభవన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించటంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఆధార్ అనుసంధానం అన్యాయం
Published Thu, Jan 9 2014 2:50 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
Advertisement