గుంటూరు : తెనాలిలో సోమవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ, వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరగడంతో సమావేశంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు ఎజెండాలోని అంశాలను వివరించగా.. వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ టీడీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. దాంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి.