కరీంనగర్ :
సార్వత్రిక ఎన్నికల పోరు మొదలైంది. ఊహించినట్లుగానే షెడ్యూల్ బుధవారం విడుదలైంది. కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు 13 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 30న పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా తొమ్మిది విడుతల్లో జరగనున్న లోకసభ ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.
తెలంగాణలో మొదటి విడతగా ఏప్రిల్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు జరిగి ఏప్రిల్ 2న కౌంటింగ్ ఉండగా ఆ వెంటనే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికోసం ఏప్రిల్ 2న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదే రోజు నుంచి 9వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 10న నామినేషన్ల పరిశీలన, 12న ఉపసంహరణ ఉంటాయి. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు.30న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మే 16న ఓట్లు లెక్కించి, ఫలితం వెల్లడిస్తారు. మే 28వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తారు.
సాధారణ ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్ అధికారులను బుధవారం నియమించారు. కరీంనగర్ పార్లమెంట్‌కు కలెక్టర్ వీర బ్రహ్మయ్య రిటర్నింగ్ అధికారి కాగా, పెద్దపల్లి పార్లమెంట్‌కు జేసీ సర్పరాజ్ అహ్మద్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆర్డీవో స్థారుు అధికారులను రిటర్నింగ్ అధికారులుగా నియుమించారు. నిర్వహణకు గ్రావు, పట్టణ, జిల్లా స్థారుులో ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశారు.
వుహారాష్ట్ర నుంచి జిల్లాకు కొత్తగా 12,000 ఈవీఎంలను తెప్పించే పనిలో ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన నోటా మీట ఉన్న ఈవీఎంలు జిల్లాకు రానున్నారుు. జిల్లా స్థారుులో ఎన్నికల వ్యయు వూనిటరింగ్ కమిటీ అధికారిగా శ్రీనివాస్ కువూర్‌ను నియుమించారు. ఎన్నికల వ్యయు పరిశీలనతోపాటు గ్రావు స్థారుులో వీఆర్వో, పంచాయుతీ సెక్రటరీ, వీఎల్వో, బీఎల్వోలు ఎన్నికల కోడ్‌ను అవులు చేస్తారు. వుండలస్థారుులో తహశీల్దార్, ఎంపీడీవో, ఎస్సైలు పర్యవేక్షిస్తారు. అసెంబ్లీ స్థారుులో డివిజనల్ అధికారులు, ఎస్‌డీపీవోలు అకౌంటింగ్ టీంగా వ్యవహరిస్తారు.అన్ని నియోజకవర్గాలకు కలిపి20 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఎప్పటికప్పుడు ఎన్నికల కోడ్ అవులు తీరును పర్యవేక్షిస్తూ రిజిస్టర్ మెయింటేన్ చేస్తాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలకు సిఫారసు చేస్తారు. మూడు పార్లమెంట్ స్థానాలకు గాను కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థులు మాత్రమే జిల్లాలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. నిజామాబాద్ లోక్‌సభకు నిజామాబాద్‌లోనే నామినేషన్ వేయాల్సి ఉంటుంది.
పొత్తుల దోబూచులాట
గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీల నడుమ పొత్తులు దోబూచులాట నడుస్తోంది. టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని, టీడీపీ, బీజేపీల నడుమ పొత్తులు ఉంటాయని అంతా భావిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విలీనం ఉండదని కేసీఆర్ స్పష్టం చేయడం, తెలంగాణ ఏర్పాటులో బీజేపీ మోసం చేసిందంటూ టీడీపీ నేతలు బీజేపీపై విమర్శలకు దిగడంతో ఇరుపార్టీల నడుమ దూరం పెరిగిపోయింది. దీంతో ఒంటరిపోరు తప్పదని తేలిపోయింది. పైగా సీపీఐతో టీఆర్‌ఎస్‌కు పొత్తు అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పొత్తుకు ఇంకా తలుపులు మూసుకుపోలేదని ఆయా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీ, బీజేపీ మాత్రం ఒంటరిపోరుకు సై అంటున్నాయి.
మూడో ఎన్నిక
జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన తరువాత జరుగుతున్న రెండో ఎన్నిక అయినప్పటికీ, కొన్ని నియోజకవర్గాలకు ఇది ముచ్చటగా మూడో ఎన్నిక. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీడీపీ, టీఆర్‌ఎస్, స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, ఉప ఎన్నికలు రావడంతో ప్రస్తుతం ఆ నియోజకవర్గాలు మూడో ఎన్నికను ఎదుర్కొంటున్నాయి. పునర్విభజనలో మేడారం, బుగ్గారం, నేరెళ్ల, ఇందుర్తి, కమలాపూర్, మెట్‌పల్లి నియోజకవర్గాలు పోయి రామగుండం, ధర్మపురి, వేములవాడ, మానకొండూరు, హుస్నాబాద్, హుజూరాబాద్, కోరుట్ల నియోజకవర్గాలుగా ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గాల్లో ధర్మపురి, రామగుండం, సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, హుజురాబాద్ నియోజకవర్గాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉద్యమ క్రమంలో రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరిగాయి. మార్చి 30న ఈ నియోజకవర్గాలు మూడో ఎన్నికను ఎదుర్కోనున్నాయి.
వేడెక్కిన రాజకీయం
మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడడం, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అన్ని పార్టీలు సార్వత్రిక పార్టీల పొత్తు, అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. తమ గాడ్‌ఫాదర్‌ల ప్రాపకం కోసం ఇప్పటికే ఆశావహులు రాజధానికి పయనమయ్యారు.