assembli
-
నెలల చిన్నారితో అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే
-
ఎల్బీనగర్ అసెంబ్లీ సీటు కోసం బీజేపీలో పోటా పోటీ ..
-
మ్యాగజైన్ స్టోరీ : గుజరాత్ రాజు ఎవరు..!
-
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆలస్యానికి కారణం అదే ..
-
నేడు గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ షెడ్యూల్ విడుదల
-
ఎక్కడ ఎవరు పోటీ...?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎన్నికల సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారు. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల వారీగా కేంద్రీకృతమై ఉన్న పార్టీ కమిటీ (డీసీసీ)లను కొత్త జిల్లాల స్థాయిలో విస్తరించాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈ మేరకు కమిటీలు ఏర్పాటు చేయాల్సిన జిల్లాల జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఈనెల 4న అధికారికంగా ప్రకటించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈనెల 13, 14 తేదీల్లో జరిపే రాష్ట్ర పర్యటన ముగిసిన వెంటనే పార్టీ కమిటీలను కొత్త జిల్లాల వారీగా ప్రకటించేందుకు పీసీసీ స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని నాలుగు జిల్లాలకు కూడా డీసీసీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా నిర్మల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. రెండు గ్రూపులు... అధ్యక్షుల కోసం పోటాపోటీ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గంగా డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క వర్గంగా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఉమ్మడి జిల్లా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల రోజుల నుంచే డీసీసీ పదవుల కోసం రెండు వర్గాలు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలో నిర్మల్ జిల్లా ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డికి పెట్టనికోటగా ఉందనడంలో సందేహం లేదు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన ఆయన నిర్మల్‌కు ప్రాతినిథ్యం వహిస్తారా అనేది అనుమానమే. ఒకవేళ ఆయన డీసీసీ అధ్యక్ష పదవిని కాదనుకుంటే ఆయన ఎవరి పేరు చెపితే వారికే ఆ పదవి వస్తుందనడంలో సందేహం లేదు. అయితే మిగతా మూడు జిల్లాల్లో ఆ పరిస్థితి లేదు. సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, పీసీసీ స్థాయిలో వర్గాలు అధ్యక్ష పదవి విషయంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. మంచిర్యాలలో అధ్యక్ష పదవికి హోరాహోరీ మంచిర్యాలలో డీసీసీ అధ్యక్ష పదవికి రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వానికి ముడిపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డితో పాటు భట్టి వర్గంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఈ పరిస్థితిల్లో డీసీసీ అధ్యక్ష పదవిని అరవింద్‌రెడ్డికే ఇవ్వాలని ఆయన వర్గీయులు కోరుతున్నారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి కూడా మంచిర్యాల విషయంలో అరవింద్‌రెడ్డికే డీసీసీ పీఠం దక్కేలా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ప్రేంసాగర్‌రావు తన సతీమణి కొక్కిరాల సురేఖను తెరపైకి తెస్తున్నారు. డీసీసీ పదవిని మహిళకు ఇవ్వాలన్న డిమాండ్‌తో ఆయన వర్గీయులు సురేఖను డీసీసీ అధ్యక్షురాలిగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకునే పక్షంలో బీసీ అభ్యర్థిగా బెల్లంపల్లి జెడ్పీటీసీ కె.రాంచందర్‌కు ఆ పదవిని ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. సురేఖ లేదా రాంచందర్ లలో ఒకరు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు అవుతారని ఆయన వర్గం బాహాటంగానే ప్రచారం సాగిస్తోంది. ఆదిలాబాద్‌లో అదే తీరు ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన భార్గవ్ దేశ్‌పాండే ప్రస్తుతం మహేశ్వర్‌రెడ్డి శిబిరంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి టిక్కెట్టు ఆశిస్తున్న ఆయన డీసీసీ పీఠంపై కన్నేశారు. ఆయనకు మహేశ్వర్‌రెడ్డి మద్దతు పుష్కలంగా ఉంది. అదే సమయంలో గతంలో పోటీచేసి ఓడిపోయిన గండ్రాత్ సుజాత కూడా ఈసారి పోటీకి సిద్ధపడుతున్నారు. భట్టి వర్గంలో ఉన్న ఆమెకు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు మద్దతిస్తున్నారు. మహిళ కోటాలో మంచిర్యాలలో సురేఖతో పాటు ఆదిలాబాద్‌లో సుజాతకు డీసీసీ పీఠం దక్కేలా పావులు కదుపుతున్న ఆయన ఈ రెంటిలో ఒక చోటైనా తన మాటను చెల్లుబాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక్కడ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కూడా టిక్కెట్టు కోసం పోటీపడుతున్నప్పటికీ, డీసీసీ పోరులో లేరని సమాచారం. కుమురంభీంలో బహుముఖ పోటీ కుమురంభీం జిల్లాలో డీసీసీ పీఠంపై ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల నుంచి టిక్కెట్టు ఆశిస్తున్న నలుగురు నాయకులు కన్నేశారు. ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం టిక్కెట్టు రేసులో ముందున్న ఆత్రం సక్కు మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు మద్దతుతో డీసీసీ పీఠం దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన కాని పక్షంలో గిరిజనేతరుడి కోటాలో సిర్పూర్‌కు చెందిన రావి శ్రీనివాస్‌కు పదవి ఇప్పించేందుకు ప్రేంసాగర్‌రావు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ వర్గంలో ఉన్న సిర్పూర్ నాయకుడు బీసీ కోటాలో గోసుల శ్రీనివాస్ యాదవ్ జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి ఎస్టీ కోటాలో డీసీసీ పీఠంపై కన్నేశారు. వీరిద్దరికి మహేశ్వర్‌రెడ్డి సంపూర్ణ మద్దతు ఉండడం గమనార్హం. కొత్త జిల్లాల వారీగా డీసీసీల నియామకం ఉమ్మడి జిల్లాలో వర్గాల ఆధిపత్యాన్ని తేటతెల్లం చేయనున్నాయి. దీంతో రాజకీయ వర్గాలన్నీ డీసీసీల ఏర్పాటుపైనే దృష్టి కేంద్రీకరించాయి. ఆదిలాబాద్ : భార్గవ్ దేశ్‌పాండే, గండ్రత్ సుజాత మంచిర్యాల : గడ్డం అరవిందరెడ్డి, కె.ప్రేంసాగర్‌రావు కుమురం భీం : ఆత్రం సక్కు, రావి శ్రీనివాస్, గోసుల శ్రీనివాస యాదవ్, సిడాం గణపతి నిర్మల్ : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి లేదా ఆయన సూచించిన వారు -
'రేపు వరంగల్‌లో కేసీఆర్‌కు ఇదే పరిస్థితి'
హైదరాబాద్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ జిమ్మిక్కులు పనిచేయలేదని తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. బిహార్‌లో మోదీకి ఎదురైన పరాభవమే వరంగల్ ఉప ఎన్నకలో కేసీఆర్‌కు ఎదురౌతుందని ఆయన జోస్యం చెప్పారు. మతతత్వ రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి బిహార్ ప్రజలు గుణపాఠం చెప్పారన్న ఆయన ఈ తాజా పరిణామాలు బీజేపీ పతనాన్ని సూచిస్తున్నాయన్నారు. మతతత్వ ఎజెండాతో వెళ్లిన ఎంఐఎం కూడా బిహార్‌లో తిరస్కరణకు గురైందని తెలిపారు. బిహార్‌లో మహాకూటమి విజయంతో గాంధీ భవన్లో కాంగ్రేస్ నేతలు ఉత్తమ్ కుమార్, షబ్బీర్ అలీతో పాటు పలువురు కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. -
బిహార్‌లో ముగిసిన నాలుగోదశ ప్రచార పర్వం
పాట్నా: బిహార్‌లో నాలుగో దశ ఎన్నికలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన ప్రచార పర్వం శుక్రవారంతో ముగిసింది. నాలుగో దశలో భాగంగా 55 స్థానాల్లో 776 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ఎన్నికల నేపథ్యంలో నేపాల్‌తో సరిహద్దు గల జిల్లాలలో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. రెండు వారాలుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో మహాకూటమి, ఎన్డీఏ నేతలతో పాటు లెఫ్ట్ పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ర్యాలీలను నిర్వహించాయి. అన్ని పార్టీలు ముఖ్యంగా అభివృద్ధి ఎజెండాగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాయి. ఇప్పటివరకు జరిగిన మూడు దశలలో మహిళలు ఆసక్తిగా ఓటింగ్లొ పాల్గొనడమే కాకుండా ఓవరాల్‌గా గతంలో కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది. 5 వ దశ ఎన్నికల అనంతరం నవంబర్ 8న ప్రకటించే ఫలితాల్లో బిహార్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారోనని దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. -
పోరు షురూ
కరీంనగర్ : సార్వత్రిక ఎన్నికల పోరు మొదలైంది. ఊహించినట్లుగానే షెడ్యూల్ బుధవారం విడుదలైంది. కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు 13 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 30న పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా తొమ్మిది విడుతల్లో జరగనున్న లోకసభ ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో మొదటి విడతగా ఏప్రిల్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు జరిగి ఏప్రిల్ 2న కౌంటింగ్ ఉండగా ఆ వెంటనే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికోసం ఏప్రిల్ 2న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదే రోజు నుంచి 9వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 10న నామినేషన్ల పరిశీలన, 12న ఉపసంహరణ ఉంటాయి. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు.30న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మే 16న ఓట్లు లెక్కించి, ఫలితం వెల్లడిస్తారు. మే 28వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తారు. సాధారణ ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్ అధికారులను బుధవారం నియమించారు. కరీంనగర్ పార్లమెంట్‌కు కలెక్టర్ వీర బ్రహ్మయ్య రిటర్నింగ్ అధికారి కాగా, పెద్దపల్లి పార్లమెంట్‌కు జేసీ సర్పరాజ్ అహ్మద్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆర్డీవో స్థారుు అధికారులను రిటర్నింగ్ అధికారులుగా నియుమించారు. నిర్వహణకు గ్రావు, పట్టణ, జిల్లా స్థారుులో ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశారు. వుహారాష్ట్ర నుంచి జిల్లాకు కొత్తగా 12,000 ఈవీఎంలను తెప్పించే పనిలో ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన నోటా మీట ఉన్న ఈవీఎంలు జిల్లాకు రానున్నారుు. జిల్లా స్థారుులో ఎన్నికల వ్యయు వూనిటరింగ్ కమిటీ అధికారిగా శ్రీనివాస్ కువూర్ను నియుమించారు. ఎన్నికల వ్యయు పరిశీలనతోపాటు గ్రావు స్థారుులో వీఆర్వో, పంచాయుతీ సెక్రటరీ, వీఎల్వో, బీఎల్వోలు ఎన్నికల కోడ్‌ను అవులు చేస్తారు. వుండలస్థారుులో తహశీల్దార్, ఎంపీడీవో, ఎస్సైలు పర్యవేక్షిస్తారు. అసెంబ్లీ స్థారుులో డివిజనల్ అధికారులు, ఎస్డీపీవోలు అకౌంటింగ్ టీంగా వ్యవహరిస్తారు.అన్ని నియోజకవర్గాలకు కలిపి20 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఎప్పటికప్పుడు ఎన్నికల కోడ్ అవులు తీరును పర్యవేక్షిస్తూ రిజిస్టర్ మెయింటేన్ చేస్తాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలకు సిఫారసు చేస్తారు. మూడు పార్లమెంట్ స్థానాలకు గాను కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థులు మాత్రమే జిల్లాలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. నిజామాబాద్ లోక్‌సభకు నిజామాబాద్‌లోనే నామినేషన్ వేయాల్సి ఉంటుంది. పొత్తుల దోబూచులాట గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీల నడుమ పొత్తులు దోబూచులాట నడుస్తోంది. టీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని, టీడీపీ, బీజేపీల నడుమ పొత్తులు ఉంటాయని అంతా భావిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విలీనం ఉండదని కేసీఆర్ స్పష్టం చేయడం, తెలంగాణ ఏర్పాటులో బీజేపీ మోసం చేసిందంటూ టీడీపీ నేతలు బీజేపీపై విమర్శలకు దిగడంతో ఇరుపార్టీల నడుమ దూరం పెరిగిపోయింది. దీంతో ఒంటరిపోరు తప్పదని తేలిపోయింది. పైగా సీపీఐతో టీఆర్ఎస్కు పొత్తు అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తుకు ఇంకా తలుపులు మూసుకుపోలేదని ఆయా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీ, బీజేపీ మాత్రం ఒంటరిపోరుకు సై అంటున్నాయి. మూడో ఎన్నిక జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన తరువాత జరుగుతున్న రెండో ఎన్నిక అయినప్పటికీ, కొన్ని నియోజకవర్గాలకు ఇది ముచ్చటగా మూడో ఎన్నిక. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీడీపీ, టీఆర్ఎస్, స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, ఉప ఎన్నికలు రావడంతో ప్రస్తుతం ఆ నియోజకవర్గాలు మూడో ఎన్నికను ఎదుర్కొంటున్నాయి. పునర్విభజనలో మేడారం, బుగ్గారం, నేరెళ్ల, ఇందుర్తి, కమలాపూర్, మెట్పల్లి నియోజకవర్గాలు పోయి రామగుండం, ధర్మపురి, వేములవాడ, మానకొండూరు, హుస్నాబాద్, హుజూరాబాద్, కోరుట్ల నియోజకవర్గాలుగా ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గాల్లో ధర్మపురి, రామగుండం, సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, హుజురాబాద్ నియోజకవర్గాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉద్యమ క్రమంలో రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరిగాయి. మార్చి 30న ఈ నియోజకవర్గాలు మూడో ఎన్నికను ఎదుర్కోనున్నాయి. వేడెక్కిన రాజకీయం మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడడం, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అన్ని పార్టీలు సార్వత్రిక పార్టీల పొత్తు, అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. తమ గాడ్ఫాదర్ల ప్రాపకం కోసం ఇప్పటికే ఆశావహులు రాజధానికి పయనమయ్యారు.