'రేపు వరంగల్లో కేసీఆర్కు ఇదే పరిస్థితి' | shabbir ali comments on bihar results | Sakshi
Sakshi News home page

'రేపు వరంగల్లో కేసీఆర్కు ఇదే పరిస్థితి'

Published Sun, Nov 8 2015 3:00 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

'రేపు వరంగల్లో కేసీఆర్కు ఇదే పరిస్థితి' - Sakshi

'రేపు వరంగల్లో కేసీఆర్కు ఇదే పరిస్థితి'

హైదరాబాద్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ జిమ్మిక్కులు పనిచేయలేదని తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. బిహార్లో మోదీకి ఎదురైన పరాభవమే వరంగల్ ఉప ఎన్నకలో కేసీఆర్కు ఎదురౌతుందని ఆయన జోస్యం చెప్పారు. మతతత్వ రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి బిహార్ ప్రజలు గుణపాఠం చెప్పారన్న ఆయన ఈ తాజా పరిణామాలు బీజేపీ పతనాన్ని సూచిస్తున్నాయన్నారు. మతతత్వ ఎజెండాతో వెళ్లిన ఎంఐఎం కూడా బిహార్లో తిరస్కరణకు గురైందని తెలిపారు. బిహార్లో మహాకూటమి విజయంతో గాంధీ భవన్లో కాంగ్రేస్ నేతలు ఉత్తమ్ కుమార్, షబ్బీర్ అలీతో పాటు పలువురు కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement