* మంత్రి గంటా వెల్లడి
* ప్రభుత్వం ప్రోత్సహిస్తే సంసిద్ధమన్న సినీ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుంచి దశల వారీగా వైజాగ్‌కు తరలించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం ఆయన సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులతో సమావేశమై చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన సమావేశంలో చర్చించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. చిత్ర పరిశ్రమను విశాఖపట్నానికి తరలించాలనే ప్రభుత్వ యోచనను వారి ముందు ఉంచినప్పుడు తమకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహం ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు.
దశల వారీగా తెలుగు చిత్ర పరిశ్రమ తరలింపు
Published Sat, Aug 23 2014 10:09 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
Advertisement
Advertisement