
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్‌గా ఎన్నో మరపురాని పాత్రలు పోషించిన డైలాగ్ కింగ్ మంచు మోహన్‌బాబు నటుడిగా నేటితో 45 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన ఇప్పటివరకు 565కి పైగా సినిమాల్లో నటించగా.. 75 సినిమాలను నిర్మించారు. 1974లో వచ్చిన కన్నవారి కలలు, అల్లూరి సీతారామరాజు చిత్రాలతో ఆయన వెండితెరకు పరిచయమ్యారు. విలక్షణమైన నటనతో, డైలాగ్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి.. అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసిన అసెంబ్లీ రౌడీ సినిమాతో కలెక్షన్ కింగ్‌గా రాణించారు. అనంతరం నిర్మాతగానూ మారారు. మోహన్‌బాబు ప్రస్తుతం సన్నాఫ్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి 45 ఏళ్లుగా సేవలందిస్తున్న దిగ్గజ నటుడికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
(చదవండి: హద్దులు చెరిపిన ఆకాశం)
Comments
Please login to add a commentAdd a comment