విజయనగరం రూరల్: కోరుకొండ సైనిక పాఠశాలలో 2017–18 విద్యా సంవత్సరానికి ఆరు, తొమ్మిదో తరగతి ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష తుది ఫలితాలను పాఠశాల ప్రిన్సిపాల్, కల్నల్ రుద్రాక్ష అత్రి ఆదివారం విడుదల చేశారు. ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఇంటర్వ్యూలో అర్హత సాధించిన విద్యార్థులకు మెడికల్ టెస్ట్ నిర్వహించారు.
అన్ని విభాగాల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈనెల 25లోగా కాల్ లెటర్స్ పంపిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈనెల 30, 31 తేదీల్లో సైనిక పాఠశాలలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. కాల్‌లెటర్లు అందని వారు 08922–246119 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రవేశ పరీక్ష ఫలితాల తుది జాబితాను సైనిక పాఠశాల వెబ్‌సైట్ www.sainikschoolkorukonda.orgలో పొందుపరిచామన్నారు.
‘కోరుకొండ’ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలు
Published Mon, Mar 13 2017 2:38 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM
Advertisement
Advertisement