Military school
-
సైనిక స్కూల్‌పై రష్యా దాడి
కీవ్: రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై భీకర దాడికి పాల్పడింది. సెంట్రల్ ఉక్రెయిన్ ప్రాంతం పొల్టావా నగరంలోని సైనిక శిక్షణా కేంద్రం, ఆ సమీప ఆస్పత్రులే లక్ష్యంగా రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో 51 మంది చనిపోయారు. 219 మంది గాయపడ్డారు. శిథిలాల్లో చిక్కుకున్న 11 మంది సహా మొత్తం 25 మందిని కాపాడినట్లు సహాయక సిబ్బంది తెలిపారు. 2022లో ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలు పెట్టిన తర్వాత రష్యా చేపట్టిన భీకర దాడుల్లో ఇదొకటని పరిశీలకులు అంటున్నారు. కీవ్, ఖర్కీవ్‌లను కలిపే ప్రధాన రహదారి, రైల్వే మార్గంపై పొల్టావా ఉంది.మంగళవారం ఉదయం హెచ్చరిక సైరన్లు మోగడంతో బాంబు షెల్టర్లలోకి పరుగు తీస్తుండగానే క్షిపణులు వచ్చి పడ్డాయని స్థానికులు తెలిపారు. దాడిలో సైనిక శిక్షణ కేంద్రానికి చెందిన ఒక భవనం పాక్షికంగా దెబ్బతింది. అందులోని చాలామంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. వీరిలో చాలా మందిని సహాయక సిబ్బంది రక్షించారని పేర్కొంటూ జెలెన్స్కీ టెలిగ్రామ్ ఛానల్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. సైనిక సాయం వెంటనే అందజేయాలంటూ మరోసారి ఆయన పశ్చిమదేశాలను కోరారు. రష్యాలోని సరిహద్దులకు దూరంగా ఉండే ప్రాంతాలపై దాడులు చేపట్టేందుకు తమకు అనుమతివ్వాలన్నారు.‘ఉక్రెయిన్‌కు మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలు, రష్యాపై ఎదురుదాడికి దిగేందుకు క్షిపణుల అవసరం ఇప్పుడు ఎంతో ఉంది. ఎప్పుడో తర్వాత కాదు. అవి గోదాముల్లో ఉంటే ఎవరిక్కావాలి?’అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సాయం అందించడంలో ఆలస్యం జరిగే ఒక్కో రోజూ దురదృష్టవశాత్తూ మరిన్ని మరణాలకు కారణమవుతోందన్నారు. అమెరికా, పశ్చిమదేశాల నుంచి తక్షణ సైనిక సాయం అందే జాడలు కనిపించకపోవడం విచారకరమని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా వ్యాఖ్యానించారు. -
దేశవ్యాప్తంగా 21 సైనిక్ స్కూల్స్ కు రక్షణశాఖ ఆమోదం
-
సైనిక పాఠశాల వార్షికోత్సవ వేడుక
విజయనగరం రూరల్: విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక పాఠశాల 60వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆడిటోరియంలో నిర్వహించిన వార్షికోత్సవాన్ని ప్రిన్సిపాల్, కల్నల్ ఏఎం కులకర్ణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా ఆన్లైన్ విధానంలో నిర్వహించిన వేడుకల్లో పూర్వ విద్యార్థులు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, విశ్రాంత లెఫ్ట్‌నెంట్ జనరల్ కె.ఆర్.రావు, సురేంద్రనాథ్, వైవీకే మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కులకర్ణి మాట్లాడుతూ పాఠశాలకు చెందిన సుమారు 690 మంది త్రివిధ దళాలలో ప్రవేశించి దేశ సేవలో తరిస్తున్నారన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన గుర్రపు స్వారీ, మల్లకంబ, హై హార్స్ వంటి సాహస విన్యాసాలు చూపరులను అలరించాయి. ప్రత్యేక పోస్టల్ కవర్ ఆవిష్కరణ కోరుకొండ సైనిక పాఠశాల 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్కూల్‌పై భారతీయ తపాలా శాఖ ముద్రించిన ప్రత్యేక పోస్టల్ కవర్‌ను ప్రిన్సిపాల్, కల్నల్ ఏఎం కులకర్ణి, వైస్ ప్రిన్సిపాల్, వింగ్ కమాండర్ ఎస్.కేశవన్, పరిపాలన అధికారి, లెఫ్ట్‌నెంట్ కమాండర్ అభిలాష్ బాలచంద్రన్ మంగళవారం ఆవిష్కరించారు. పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం పాఠశాలకు అంబులెన్స్ వాహనం, 4 కిలోల వెండి జ్ఞాపిక బహూకరించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. -
టాయ్లెట్లో విద్యార్థి అనుమానాస్పద మృతి
బెంగళూరు: గుజరాత్లో తొమ్మిదో తరగతి విద్యార్థి హత్య ఘటన మరువక ముందే మరో విద్యార్థి అనుమానాస్పద మృతి కర్ణాటకలో కలకలం రేపింది. కొడగు జిల్లాలోని సైనిక పాఠశాల్లోని టాయ్లెట్లో తొమ్మిదో తరగతి విద్యార్థి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడగులో సైనిక పాఠశాలలో తొమిదో తరగతి విద్యార్థి(14) శనివారం సాయంత్రం టాయ్‌లెట్ వద్ద అపస్మారకస్థితిలో పడివుండటాన్ని గమనించిన పాఠశాల యాజమాన్యం అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే విద్యార్థి మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. విద్యార్థి తండ్రి అదే పాఠశాలలో హాకీ కోచ్‌గా పనిచేస్తున్నారు. పాఠశాలలోని కొంత మంది ఉపాధ్యాయులు తన కొడుకుని వేధించినట్లు విద్యార్థి తండ్రి ఆరోపించారు. ఈ విషయంపై పాఠశాల వైస్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. తమ కొడుకు మృతికి వైస్ ప్రిన్సిపాల్ కారణం మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. స్థానికులతో కలిసి పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. కాగా పాఠశాల ప్రిన్సిపాల్, మరో నలుగురు ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
జనవరి 7న సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష
6, 9 తరగతులకు ప్రవేశాలు కలికిరి: అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్షను 2018 జనవరి 7వ తేదీన నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా కలికిరి సైనిక పాఠశాల ప్రధాన అధ్యాపకులు కెప్టెన్ సైమన్ జేవియర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ద్వారా 6, 9 తరగతుల్లో విద్యార్థులకు ప్రవేశాలు ఉంటాయన్నారు. 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షలో గణితం, జనరల్ నాలెడ్జ్, భాష, ఇంటెలిజెన్స్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. తొమ్మిదో తరగతి ప్రవేశానికి గణితం, ఆంగ్లం, ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయని పేర్కొన్నారు. తొలిసారిగా ఓఎంఆర్ ఆధారిత పరీక్షను నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. -
‘కోరుకొండ’ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలు
విజయనగరం రూరల్: కోరుకొండ సైనిక పాఠశాలలో 2017–18 విద్యా సంవత్సరానికి ఆరు, తొమ్మిదో తరగతి ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష తుది ఫలితాలను పాఠశాల ప్రిన్సిపాల్, కల్నల్ రుద్రాక్ష అత్రి ఆదివారం విడుదల చేశారు. ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఇంటర్వ్యూలో అర్హత సాధించిన విద్యార్థులకు మెడికల్ టెస్ట్ నిర్వహించారు. అన్ని విభాగాల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈనెల 25లోగా కాల్ లెటర్స్ పంపిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈనెల 30, 31 తేదీల్లో సైనిక పాఠశాలలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. కాల్‌లెటర్లు అందని వారు 08922–246119 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రవేశ పరీక్ష ఫలితాల తుది జాబితాను సైనిక పాఠశాల వెబ్సైట్ www.sainikschoolkorukonda.orgలో పొందుపరిచామన్నారు. -
జనవరి 15న కలికిరి సైనిక స్కూలు ఎంట్రన్స్
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా కలికిరిలో ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలలో 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు 2017 జనవరి 15న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, కలికిరిలలో జరగనుంది. -
3న సైనిక పాఠశాల ప్రవేశ పరీక్షలు
విజయనగరం జిల్లా కోరుకొండలోని సైనిక్ స్కూల్లో 2016-17 సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్షలను వచ్చే జనవరి 3వ తేదీన నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పి.రవికుమార్ శనివారమిక్కడ విలేకరులకు తెలిపారు. ఏపీ, తెలంగాణలో 8 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించ నున్నట్లు పేర్కొన్నారు. ఆరో తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 11 వరకు గణితం, లాంగ్వేజ్ ఎబిలిటీ, మధ్యాహ్నం 12 నుంచి 12.50 గంటల వరకు మెంటల్ఎబిలిటీ పరీక్ష ఉంటుందన్నారు. అలాగే తొమ్మిదో తరగతి ప్రవేశానికి ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు గణితం, సైన్స్ పరీక్ష, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఇంగ్లిష్, సోషల్ పరీక్షలు ఉంటాయని వివరించారు. విద్యార్థులు ఉదయం 8 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలు: శ్రీకాకుళం (ఆర్సీఎం లయోలా ఇంగ్లిష్ మీడియం స్కూల్- ఇలిసిపురం), విజయనగరం (సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్), విశాఖ (ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్), రాజమండ్రి (ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల- డీలక్స్ సెంటర్), విజయవాడ (కేబీసీ జెడ్పీ బాలుర హైస్కూల్- పటమ ట), గుంటూరు (మాజేటి గురవయ్య హైస్కూల్), హైదరాబాద్ (కీస్ బాలికల హైస్కూల్- సికింద్రాబాద్). కరీంనగర్ (ప్రభుత్వ పాఠశాల). -
‘సైనిక పాఠశాల’తో పాఠం
విశ్లేషణ పెషావర్ సైనిక పాఠశాల మీద విరుచుకుపడి 132 మంది బాలలు సహా మొత్తం 140 మందిని తాలిబాన్ మట్టుబెట్టడం ప్రపంచాన్ని కలచివేసింది. బ్రిటిష్ వలస పాలన నుంచి ఉపఖండానికి వారసత్వంగా అందిన అలజడి విశ్వానికి బెడదగా మారి చాలా కాలమైంది. ఆ అలజడినే ఇప్పుడు అమెరికా పోషిస్తోంది. అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, ఇరాక్లలో ఉగ్ర కార్యకలాపాలకు ఊతమిచ్చిన అగ్రదేశాలు, మరో పక్క వారికి వ్యతిరేకంగా సైనిక వ్యూహాలను కూడా అమలు చేస్తున్నాయి. కశ్మీర్, పాక్, అఫ్ఘాన్, అమెరికా, ఇరాక్లలో దాడులు, న రమేధం వీటి పరిణామమే. పెషావర్ పాఠశాల మీద దాడి వాటి కొనసాగింపే. ‘పాకిస్తాన్‌లోని పెషావర్ సైనిక పాఠశాలలో చదువుతున్న 132 మందిని దండెత్తి చంపిన ముష్కరులు (తాలిబాన్ ఉగ్రవాదులు) ఇస్లామ్ ధర్మానికే శత్రు వులు. ఈ నీచమైన చర్యకు పాల్పడినవారు మానవ జాతికే శత్రువులు, వీళ్లు అల్లాకు శత్రువులు’. - నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి: (16.12.2014) ‘ప్రజలందరి రక్తం ఒక్కటే. అది హిందువుదైనా, ముస్లిందైనా, క్రైస్తవుడిదైనా- ఏమతమైనా శాంతినే కోరుకుంటుంది. రక్తపాతం ఇస్లాం ధర్మానికే వ్యతిరేకం’ - తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ: (18-12-2014) పాక్ సైన్యం అమెరికాతో మిలాఖత్ అయి తమ కుటుంబాలను హతమా రుస్తున్నందుకు ప్రతీకారంగా ఈ పని చేశామని మతోగ్రవాద సంస్థ తాలిబాన్ ఉన్మాదులు ప్రకటించుకున్నారు. వాయవ్య ప్రాంతంలోని పెషావర్ సైనిక పాఠ శాలలో చదువుకుంటున్న ముక్కుపచ్చలారని చిన్నారులను చంపిన తరువాత తాలిబాన్ చెప్పిన కారణమిది. ఈ దుర్మార్గం భారత ఉపఖండ దేశాల ప్రజలనే గాక, ప్రపంచ దేశాల పౌర సమాజాలను కూడా కలచివేసింది. ఉన్మాదానికి సరి హద్దులూ, వాస్తవాధీన రేఖలూ ఉండవు. చరిత్రలో దాని జాడ కూడా సుదీర్ఘమై నదే. అన్ని దేశాల, అన్ని మతాల ధర్మసూత్రాలూ శాంతిని, సౌమనస్యాన్నే ప్రబోధిస్తున్నప్పుడు మత ఘర్షణలు ఉన్మాదరూపం ఎందుకు ధరిస్తున్నాయి? ఆసియా ఖండానికీ, భారత ఉప ఖండానికీ తాజా ‘పెషావర్ ఘటన’ చెబుతున్న పాఠం ఏమిటి? వలస పాలకులు మిగిల్చిన సమస్య భారత్, పాకిస్తాన్ విభజనకోసం, ఆ రాజకీయాల కోసం బ్రిటిష్ వలసపాల కులూ, అధికార తాపత్రయంలో ఉభయ మతాలకు చెందిన నాయకులూ రేపిన చిచ్చు ఉపఖండంలో ఈరోజు దాకా ఆరలేదు. ఆయుధ వ్యాపారం కోసం యుద్ధ రాజకీయాలు నడుపుతున్న ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్య పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం ఆ చిచ్చు ఆరకుండా జాగ్రత్తపడుతున్నారు. అందు లో భాగమే తాలిబాన్ సృష్టి. తొలుత ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్యవాద పాలక వర్గాలు అఫ్ఘానిస్థాన్‌లో సోవియెట్ పలుకుబడిని దెబ్బకొట్టడం కోసం అక్కడి సెక్యులర్ (మతాతీత లౌకిక) ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ముందు ముజా హుదీన్ల పేరిట, ఆ తరువాత తాలిబాన్ పేరిట సెక్యులర్ వ్యతిరేకశక్తులకు డబ్బు, మారణాయుధాలిచ్చి సాకుతూ వచ్చారు. ఫలితంగానే అఫ్ఘానిస్తాన్‌లోని సెక్యులర్ ప్రభుత్వం కూలిపోయింది. ఇంత జరిగినా తమకొచ్చే దీర్ఘకాలిక రాజ కీయ ప్రయోజనంగానీ, సొంత ప్రభుత్వ స్థాపన గానీ సాధ్యపడదని నిర్ధారిం చుకోవడమే కాకుండా, తమను ఆంగ్లో-అమెరికన్లు ‘కరివేపాకు’లా వాడుకుం టున్నారని తాలిబాన్ గ్రహించింది. సామ్రాజ్యవాద పాలకులు కూడా, తాలి బాన్ దీర్ఘకాలంలో ఎదురు తిరిగి తమకే ‘ఏకు మేకవు’తారని వారిపైనే యుద్ధం ప్రకటించేందుకు సిద్ధమైనారు. దాని ఫలితంగానే 2002 సెప్టెంబర్ 11న కొత్త నాటకానికి తెరలేచింది. అదే - అమెరికాలోని వాణిజ్య కేంద్రమైన భారీ జంట సౌధ సముదాయంపై పౌర విమానాలతో జరిగిన దారుణ ఘటన. ఇందుకు బాధ్యులెవరై ఉంటారన్న వెతుకులాటలో తమకు తాజాగా శత్రువులుగా మారిన తాలిబాన్‌నూ, ఇరాక్‌లో సెక్యులర్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న సద్దాం హుస్సేన్‌నూ ఆంగ్లో-అమెరికన్లు ‘టార్గెట్’గా పెట్టుకుని, వారిని హతమార్చే వ్యూహరచనకు దిగారు. నిజానికి తాలిబాన్ అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా పెంచి పోషించిన శక్తే. కాగా ‘ట్విన్ టవర్స్’ కూల్చివేతకు ఎవరు సూత్రధారులో ఇప్ప టిదాకా తేల్చలేకపోయారు. దానిపైన అమెరికన్ సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాత మూర్ తీసిన చిత్రం (‘‘9/11’’) మనకు తెలియని రహస్యాల్ని బయట పెట్టింది. చరిత్రకారుడు, భాషా శాస్త్రవేత్త, ప్రపంచ వ్యవహారాల విశ్లేషకుడు ప్రొఫెసర్ నోమ్ చామ్స్కీ ‘‘9/11’’ దుర్ఘటనపైన ఆ పేరుతోనే ఒక గ్రంథం రాశాడు. ఆ దుర్ఘటన నిర్వహణ తీరును ఒకే ఒక్క వాక్యంతో తేల్చాడు: ‘ఈ దుర్ఘటనకు (సుమారు 3,000 మందిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గానికి) సంబంధించిన నిజాలను పూర్తిగా చరిత్ర నుంచి తొలగించడం జరిగింది’ (ఫ్యాక్ట్స్ హేవ్ బీన్ కంప్లీట్లీ రిమూవ్డ్ ఫ్రం హిస్టరీ). ఎందుకంటే, ఈ దుశ్చర్యకు తోడ్పడిన సాధన సంపత్తి అంతా - అమెరికా సైనిక శిక్షణ కేంద్రమూ, నేరగాళ్ల ఆటస్థలం ఫ్లోరిడా నగరం నుంచే, స్థానిక అమెరికన్ విమానాల సమీకరణతో జరిగిందనేది మరచిపోరాదు. అంటే, ఇంటిదొంగ (అమెరికన్) దొరికిపో యాడు. అప్పటి అధ్యక్షుడు జార్జి బుష్ ‘ట్విన్ టవర్స్’పై విమానదాడికి ముందు ఎక్కడున్నాడు? మారుమూల ఒక ప్రాంతంలో ఎలా తలదాచుకున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. ట్విన్ టవర్స్ కూల్చివేత రహస్యం అందుకే అసలు దాడి రహస్యాన్ని తెలుసుకునేందుకు 1,500 మంది అమెరికన్ ప్రసిద్ధ భవన నిర్మాణపు ఇంజనీర్లు, వాస్తుశిల్పులూ, నిజనిర్ధారణ సంఘాలూ ఒక భారీ విచారణ సంఘంగా ఏర్పడి ‘ట్విన్ టవర్స్’ పతన కారణాలపైన సమగ్ర విచారణ జరిపి తీరాల్సిందేనని పట్టుబట్టారు. మిరుమిట్లు గొలిపే నివేది కను ప్రపంచం ముందుంచారు. కాని దాన్ని అమెరికా పాలకులు పక్కన పెట్టే శారు. ఎందుకంటే అమెరికా పాలకులకు ఒక సిద్ధాంతం ఉంది - ‘సాధ్యమైతే దేశాలపైన చర్యకు అమెరికా ఇతర దేశాలను కలుపుకుని దిగుతుంది, ఒకవేళ దాడులు ఉమ్మడిగా సాధ్యపడకపోతే అమెరికా ఏకపక్షంగా చర్యకు దిగుతుంది’. మాజీ అధ్యక్షుడు క్లింటన్ దీనిని (1993) ప్రకటించాడు! ఇందుకొక సూత్రాన్ని బుష్ కనిపెట్టాడు: అమెరికా ఉగ్రవాదాన్ని మరచిపోండి, ‘ప్రపంచ ఉగ్రవాదం (టైజం)పై కత్తి కట్టడానికి అమెరికాతో చేతులు కలపాలి, లేదా కలపని దేశా లను దేశాధిపతులను ఉగ్రవాదులుగా ప్రకటిస్తాం, జరిపే విధ్వంసకాండకు మీరు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది’ అని ప్రగల్భించాడు (‘న్యూయార్క్ టైమ్స్’ లో బుష్ ప్రకటన ప్రచురణ: 2001 సెప్టెంబర్ 4). అంటే ట్విన్ టవర్స్‌పై స్థాని కంగానే జరిగిన దాడికి వారం రోజుల ముందుగానే వెలువడిన బుష్ (జూని యర్) ప్రకటన ఇది. అఫ్ఘానిస్తాన్, ఇరాక్‌లపై అమెరికా వేట, తానుగా అల్లు కున్న ‘మిష’ ఆధారంగా అఫ్ఘానిస్తాన్, ఇరాక్‌లపై యుద్ధాలు, లక్షలాది మంది అరబ్బు ప్రజలపై జరిపిన మారణకాండ అక్కడి నుంచే మొదలైనాయి. ఇంకా అఫ్ఘానిస్తాన్లోనూ, ఇరాక్‌లోనూ ‘నాటో’ కూటమి, దుష్టచతుష్టయం (యూరప్ దేశాలు సహా) జరిపిన దురాక్రమణలూ; అఫ్ఘానిస్తాన్, ఇరాక్లలో అమెరికా తైనాతీ ‘ప్రభుత్వాల’ ఏర్పాటు అందులో భాగమే. ‘ఉగ్రవాద’ మిషపైన కశ్మీర్ పక్కలో బల్లెంగా, భారత ప్రయోజనాలకు విరుద్ధంగా అఫ్ఘానిస్తాన్, ఆంగ్లో- అమెరికన్ సైనిక కూటమి ‘నాటో’ సైన్యాల తిష్ట కూడా ఆ క్రమంలోనిదే. అటు పాకిస్తాన్ సైన్యాన్ని ఇన్నాళ్లూ సాకుతూ వస్తూన్న ఆంగ్లో-అమెరికన్లను అక్కడే తాలిబాన్ ఎదిరించి డీకొనడమూ, అమెరికాకు వ్యతిరేకంగా తమతో కలసిరాని పాకిస్తాన్ పౌర ప్రభుత్వ పాలకులపైన, ఎదురొచ్చిన పాక్ పౌరులపైన తాలి బాన్ ఎదురుదాడులకు దిగడమూ, భీతావహులను చేయడం ఈ పరి ణామాలలో భాగమే. పెషావర్ పాఠశాల ఘటన ఆ క్రమంలోనిదే. మూడో శక్తికి చోటివ్వరాదు పాక్, చైనాలకు ఇండియా మిత్రదేశంగా ఉండటం ఆంగ్లో - అమెరికన్లకు ఇష్టం లేదు. అందుకే సంప్రదింపులకు భారత-పాకిస్తాన్ మధ్య అవకాశాలున్నా, వాటిని ఏదో ఒక రూపంలో చెదరగొట్టడం సామ్రాజ్యవాద పాలకుల లక్ష్యం. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఇండియా కేంద్రంగా కవ్వింపుతో నిర్వహించిన అఫ్ఘాన్ యుద్ధాలు, విస్తరణ చర్యలూ మనకు తెలుసు. ఫక్తూనిస్తాన్ ఏర్పడ కుండా భారత నాయకుల్ని బ్రిటన్ దువ్వుతూ వచ్చిన రహస్యమూ తెలుసు. అందువల్ల చరిత్ర పాఠాలు మరొక్కసారి చదువుకుని భారత్, పాకిస్తాన్ పాలకులు మూడో శక్తి ప్రమేయం లేకుండా నిరంతర సంప్రదింపుల ద్వారా జాగరూకులై స్వతంత్ర నిర్ణయాలు చేసుకుంటే ఉపఖండంలో శాంతికి వీలుంది. ఉగ్రవాదాలకు, అగ్రవాద కుట్రలకు స్వస్తి చెప్పించవచ్చు. గతించిన నాటి క్రిస్టియన్-ముస్లిం పాలకుల మత యుద్ధాలకూ, సామాన్య క్రైస్తవ, ముస్లిం ప్రజాబాహుళ్య శాంతి ప్రయోజనాలకూ సంబంధం లేదు! అటు పాకిస్తాన్, ఇటు అఫ్ఘానిస్తాన్. ఈ రెండు దేశాలూ మనకు ఇరుగు పొరుగు. అఫ్ఘానిస్తాన్‌లో మన వాళ్లకు కార్పొరేట్ కాంట్రాక్టులు ఎరచూపి అమెరికా మనల్ని యుద్ధాల్లోకి దించే అవకాశం పుష్కలంగా ఉంది. అలాగే బ్రిటిష్ వాళ్ల నిష్ర్కమణ తర్వాత కశ్మీర్‌పై కన్ను వేసిన అమెరికా, ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో 1948-49 నాటి ఫిర్యాదుల ఉపసంహరణ జరగనంత కాలం జోక్యం చేసుకునే విధానానికి అమెరికా వెరవదు గాక వెరవదు. అలాగే అఫ్ఘాన్‌ను ఆక్రమించి కూర్చున్నట్టే కశ్మీర్లో తలచుకున్నదే తడవుగా అఫ్ఘానిస్తాన్‌లోని ‘నాటో’ కూటమి సేనలను కశ్మీర్లోకి నడిపించడానికి కూడా అమెరికా వెనుకాడదు. పైగా ఇప్పుడు హమీద్ కర్జాయ్ పాలన ముగిసి, అమెరికా ఆశీస్సులతో ఆష్రాఫ్ ఘనీ పాలన అఫ్ఘాన్‌లో కొనసాగుతోంది. భారత్-పాక్ చర్చలే కీలకం కనుక భారత-పాకిస్తాన్ పౌర ప్రభుత్వాలు తమ మధ్య కశ్మీర్ సమస్యను మరిం త జటిలంగా మార్చుకోకుండా ఉపఖండ శాంతి ప్రయోజనాల కోసం తక్షణం చర్చల ప్రక్రియకు ప్రాణప్రతిష్ట చేయాలి. మూడో శక్తి ప్రమేయానికి తావు లేకుం డా అప్పుడే జాగ్రత్త పడగలరు. ఇది రెండు దేశాల ప్రజల సమస్య. నాయకుల పదవుల సమస్య కాదు. దీనిని గుర్తించాలి. అలాగే ఉభయ దేశాలలోని వివిధ మత ఛాందసవాదులకు కళ్లెం వేయడం ఉభయ దేశాల పాలకుల ఉమ్మడి ఎజెండాగా కూడా ఉండాలి. అన్నింటికీ మించి, బ్రిటిష్ వలస పాలన మిగిల్చిన ఈ కాష్టం ప్రచ్ఛన్నయుద్ధంతో మరోసారి భగ్గుమంది. దీనితో పాత సమస్యలు కొత్తరూపంలో వేధిస్తున్నాయి. పెషావర్ సైనిక స్కూలు బాలలపై జరిగిన హత్యాకాండ గానీ, అంతకు ముందు జరిగిన అనేక మారణహోమాలు వీటన్నిటి ఫలితాలే. (వ్యాసకర్త మొబైల్: 98483 18414) -
పాకిస్తాన్ స్వయంకృతమే
ఘోరం. క్రూరం. దారుణం. ఈ మాటలేవీ పాకిస్తాన్లో చిన్నారి పిల్లలపై జరిగిన మారణకాండను వర్ణించడానికి సరిపోవు. పెషావర్ నగ రంలోని సైనిక పాఠశాల పిల్లలపై తాలిబాన్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 145 మంది పిల్లలను, ఉపాధ్యాయులను, సిబ్బందిని పొట్టనబెట్టుకోవడం విషాదకరం. ఉగ్రవాదులు మానవ మృగాలుగా మారి అభంశుభం తెలియని పిల్లలను హత మార్చడం క్షంతవ్యం కాని నేరం. తాలిబాన్లు ఎంతటి దురాగతానికైనా పాల్పడతారనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. పసిపిల్లలపైకి తూటాలు ఎక్కుపెట్టడం దిగ్భ్రాం తికరం. చరిత్రలోనే ఇదొక చీకటి అధ్యాయం. తమపై దాడి చేస్తున్న పాకిస్తాన్ సైన్యాన్ని ఎదిరించి నిలువలేని ముష్కర మూకలు ఆ సైని కుల పిల్లలు చదివే పాఠశాలపై దాడిచేయడం పిరికిపందల క్రూర చర్య తప్పితే మరేమీ కాదు. అయితే ఆదినుంచీ ఉగ్రవాదులకు పాలు పోసి పెంచి పోషించిన పాకిస్తాన్‌కు తాజా రాక్షసకాండ కేవలం స్వయం కృతమే. ఎప్పటినుంచో భారతదేశంపై కత్తులు దూస్తున్న లష్కరే తోయిబా వంటి ముష్కర మూకలకు పాకిస్థాన్ అండగా నిలుస్తోంది. ఇప్పటికైనా పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకోవాలి. ప్రపంచ దేశాలతో కలసి తీవ్రవాదంపై పోరుకు సిద్ధమవ్వాలి. బట్టా రామకృష్ణ దేవాంగ సౌత్ మోపూరు, నెల్లూరు జిల్లా