జనవరి 7న సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష | Military School Entrance Test on January 7 | Sakshi
Sakshi News home page

జనవరి 7న సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష

Published Mon, Sep 18 2017 2:25 AM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM

Military School Entrance Test on January 7

6, 9 తరగతులకు ప్రవేశాలు
 
కలికిరి: అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్షను 2018 జనవరి 7వ తేదీన నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా కలికిరి సైనిక పాఠశాల ప్రధాన అధ్యాపకులు కెప్టెన్‌ సైమన్‌ జేవియర్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ద్వారా 6, 9 తరగతుల్లో విద్యార్థులకు ప్రవేశాలు ఉంటాయన్నారు.

6వ తరగతి ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షలో గణితం, జనరల్‌ నాలెడ్జ్, భాష, ఇంటెలిజెన్స్‌ అంశాలపై ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. తొమ్మిదో తరగతి ప్రవేశానికి గణితం, ఆంగ్లం, ఇంటెలిజెన్స్, జనరల్‌ సైన్స్, సోషల్‌ స్టడీస్‌ అంశాలపై ప్రశ్నలు ఉంటాయని పేర్కొన్నారు. తొలిసారిగా ఓఎంఆర్‌ ఆధారిత పరీక్షను నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement