3న సైనిక పాఠశాల ప్రవేశ పరీక్షలు | military school entrance exams on jan 3rd | Sakshi
Sakshi News home page

3న సైనిక పాఠశాల ప్రవేశ పరీక్షలు

Published Sun, Dec 27 2015 11:15 AM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM

military school entrance exams on jan 3rd

విజయనగరం జిల్లా కోరుకొండలోని సైనిక్ స్కూల్‌లో 2016-17 సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్షలను వచ్చే జనవరి 3వ తేదీన నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పి.రవికుమార్ శనివారమిక్కడ విలేకరులకు తెలిపారు. ఏపీ, తెలంగాణలో 8 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించ నున్నట్లు పేర్కొన్నారు. ఆరో తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 11 వరకు గణితం, లాంగ్వేజ్ ఎబిలిటీ, మధ్యాహ్నం 12 నుంచి 12.50 గంటల వరకు మెంటల్‌ఎబిలిటీ పరీక్ష ఉంటుందన్నారు. అలాగే తొమ్మిదో తరగతి ప్రవేశానికి ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు గణితం, సైన్స్ పరీక్ష, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఇంగ్లిష్, సోషల్ పరీక్షలు ఉంటాయని వివరించారు. విద్యార్థులు ఉదయం 8 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
 
 పరీక్షా కేంద్రాలు: శ్రీకాకుళం (ఆర్‌సీఎం లయోలా ఇంగ్లిష్ మీడియం స్కూల్- ఇలిసిపురం), విజయనగరం (సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్), విశాఖ (ఎస్‌ఎఫ్‌ఎస్ హైస్కూల్), రాజమండ్రి (ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల- డీలక్స్ సెంటర్), విజయవాడ (కేబీసీ జెడ్పీ బాలుర హైస్కూల్- పటమ ట), గుంటూరు (మాజేటి గురవయ్య హైస్కూల్), హైదరాబాద్ (కీస్ బాలికల హైస్కూల్- సికింద్రాబాద్). కరీంనగర్ (ప్రభుత్వ పాఠశాల).

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement