అనంతపురం: అనంతపురం-కదిరి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డీఎస్సీ పరీక్ష రాసి ఇంటికి తిరిగి వెళ్తున్న భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన బుక్కె వెంకటేష్‌నాయక్(35), ఈయన భార్య సుభద్రమ్మ(28)లు అనంతపురంలో డీఎస్సీ పరీక్ష రాసి.. బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. గుమ్మళ్లకుంట వద్ద వారి వాహనాన్ని ఓ లారీఢీ కొంది. భార్యాభర్తలు దుర్మరణం చెందారు.
పరీక్షకు వెళ్తూ ...
పాడేరు: డీఎస్సీ పరీక్షకు వెళ్తున్న మహిళపై చెట్టుకొమ్మ విరిగిపడడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మండలంలోని లగిశపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ(28) సోమవారం భర్తతో కలసి విశాఖపట్నంలో డీఎస్సీ పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తుండగా.. ఘాట్‌రోడ్డులో ఓ భారీ చెట్టు కొమ్మ విరిగి ఆమె తలపై పడింది. ఈశ్వరమ్మ మృతిచెందింది.
ఆ జంటకు చివరి పరీక్ష
Published Tue, May 12 2015 4:19 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement