గుంటూరు:బొల్లాపల్లి మండలం రావులాపురం వద్ద నల్లమల అడవుల్లో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా అడవిలో మంటలు చెలరేగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అయితే మంటలను అదుపు చేయడానికి యత్నిస్తున్నా.. అడవి భారీగా తగులబడుతున్నట్లు తెలుస్తోంది. మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు.