రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేటలో ఓ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం కావటంతో విద్యార్థులు ఎవరూ లేరు. దాంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఈ ప్రమాదంతో దాదాపు రూ.6లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.