గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని ఓ స్పిన్నింగ్ మిల్లులో మంగళవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రత్తిపాడు : గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని ఓ స్పిన్నింగ్ మిల్లులో మంగళవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాయంత్రం 6 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో మిల్లులో నిల్వ ఉంచిన పత్తిబేళ్లు చాలా వరకు దగ్ధమయ్యాయి.
భారీగా ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను కొంత వరకు అదుపు చేయగలిగారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు.