ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి శేషాచల అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై తమిళనాడు భగ్గుమంది. మంగళవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 20 మంది తమిళనాడుకు చెందిన కూలీలు ప్రాణాలు కోల్పోవడాన్ని రాష్ట్రం ముక్తకంఠంతో ఖండించింది. దీనిపై తమిళనాడు అంతటా బుధవారం నిరసనలు వెల్లువెత్తాయి. రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్యాలయాల ముట్టడి వంటి ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
నిరసనల వెల్లువ: ఎన్‌కౌంటర్‌కు నిరసనగా వేలూరు జిల్లా కన్నమంగళం పోలీస్‌స్టేషన్ వద్ద బాధిత కుటుంబాల వారు బుధవారం ధర్నాకు దిగారు. మరోవైపు వేలూరు టీటీడీ సమాచార కేంద్రం వద్ద ఆందోళన చేసి ఏపీ సీఎం చంద్రబాబు చిత్రపటాలను దహనం చేశారు. ఏపీకి చెందిన ఓ మాజీ ఎంపీ ఆధ్వర్యంలో సాగుతున్న తిరుచ్చి-తంజావూరు మధ్యనున్న టోల్‌గేట్‌ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఏపీవైపు వెళ్లే ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను సీఎంబీటీ బస్‌స్టేషన్‌లోనే నిలిపివేశారు.
భగ్గుమన్న తమిళనాడు
Published Thu, Apr 9 2015 2:40 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM
Advertisement