వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడి ఐరన్‌మార్టుకు నిప్పు | Fire to ysrcp leader iron mart | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడి ఐరన్‌మార్టుకు నిప్పు

Published Sun, Jun 29 2014 12:49 AM | Last Updated on Tue, May 29 2018 2:42 PM

వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడి ఐరన్‌మార్టుకు నిప్పు - Sakshi

వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడి ఐరన్‌మార్టుకు నిప్పు

బనగానపల్లెటౌన్: పట్టణంలోని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఫైజ్‌కు చెందిన ఐరన్ మార్టుకు శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియన వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పుంటించారు. వెంటనే స్థానికులు, రాత్రి బీట్‌లో ఉన్న పోలీసులు గమనించడంతో ఘోరఅగ్ని ప్రమాదం తప్పింది. బాధితుడి సోదరుడు ఖైజ్  శనివారం తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కేడీసీసీ బ్యాంకు సమీపంలో ఉన్న ఫయాజ్ ఐరన్ మార్టు దుకాణంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో అర్ధరాత్రి షెట్ట్టర్ కింద పెట్రోల్ పోసి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి పరారు అయ్యారు.
 
మంటలు వ్యాపించడంతో గమనించిన స్థానికులు, రాత్రి పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు వెంటనే అదుపులోనికి తెచ్చారు. ఈ సంఘటనలో చిన్న పైప్‌లు, గొట్టలు కాలిపోయాయి. పెద్దగా ఆస్తి నష్టం జరగా లేదు. సంఘటన స్థలాన్ని సాయంత్రం కర్నూలు నుంచి వచ్చిన డ్వాగ్ స్క్వాడ్ బృందం పరిశీలించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మంజునాథ్ పేర్కొన్నారు.
 
నిందితులను కఠినంగా శిక్షించాలి:  కాటసాని
వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు ఫైజ్‌కు చెందిన ఐరన్ మార్టుకు నిప్పంటించిన దుండగులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పోలీసు ఉన్నతాధికారులను కోరారు. అగ్నిప్రమాద సంఘటన స్థలాన్ని కాటసాని సందర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
 
ఈ సందర్భంగా ఆయన విలేకరుతో మాట్లాడుతూ 2000 సంవత్సరంలో కూడ బనగానపల్లె పట్టణంలో వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేసేందుకు కొదరు నాయకులు ఇటువంటి సంఘటలకే పాల్పడ్డారని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి సంఘటలు పునరావృతం చేసేందుకు అసాంఘీక శక్తులు ప్రయత్నిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.  ప్రశాంతంగా ఉన్న బనగానపల్లె పట్టణంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని రామిరెడ్డి పేర్కొన్నారు.  ఆయన వెంట వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పెద్ద వెంకటరెడ్డి, డాక్టర్ మహమ్మద్‌హుస్సేన్, న్యాయవాది ఖైర్, ఎవరెస్టు బాబు, ఆచారి, ఖానిక్, బాబులాల్, సురేష్‌కుమార్, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement