సాక్షి, విజయవాడ: మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైందని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. శనివారం ‘దిశ చట్టం’పై సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మీడియాతో సీపీ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ఏపీ లో ‘దిశ’ చట్టం అమలుకాబోతోందని తెలిపారు. సీఎం ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్ నూతన ఒరవడికి అద్దం పట్టేలా రూపొందించటం జరిగిందన్నారు. త్వరలోనే విజయవాడలో కూడా ఆధునిక హంగులతో దిశ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. దిశ పీఎస్‌లో డీఎస్పీ పర్యవేక్షణలో ఐదుగురు ఎస్‌ఐలతో సహా 47 మంది సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని సీపీ పేర్కొన్నారు.(ల్యాబ్స్ కోసం రూ. 31 కోట్లు: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment