ఫ్లెమింగో ఫెస్టివల్‌కు కొత్తదనం
దొరవారిసత్రం: సూళ్లూరుపేట కేంద్రంగా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ దఫా కొత్తదనాన్ని సంతరించుకునేలా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని కలెక్టర్ శ్రీకాంత్ అన్నారు. సూళ్లూరుపేట, నేల పట్టు, పులికాట్, బీవీపాళెం ప్రాంతాల్లో పండగ జరిపేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
జనవరిలో మూడురోజుల పాటు నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్‌పై శుక్రవారం నేలపట్టు పక్షుల కేంద్రంలో వివిధ శాఖల అధికారులతో పాటు తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండలాల్లోని అధికారులు, ప్రజాప్రతి నిధులు, స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో సమావేశాన్ని నిర్వహించారు. పక్షుల పండగను ప్రతిష్టాత్మకంగా, అలరించేలా ఎలా చేయాలనే అంశంపై చర్చించా రు. కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
వారంలోపు ఎప్పుడనేది వివరాలు వెల్లడిస్తామన్నారు. పక్షుల పండగలో స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చి వారు ఆర్థికంగా లాభపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. పర్యావరణం దెబ్బతినకుండా చూస్తామన్నారు. పక్షుల పండగను మూడు రోజుల పాటు నిర్వహించడ మే కాకుండా విహంగాల సీజన్‌లో వారం లో ఒకరోజు పండగ వాతావరణం కల్పిం చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నా రు.
పక్షుల కేంద్రంలోని చెరువుల్లోకి పండ గ సమయానికి తెలుగు గంగ కాలువ ద్వారా నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. పక్షుల పండగ సందర్భగా అధికారులు తమను చిన్నచూపు చూస్తున్నారని, ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని మత్స్యకారులు వాపోయారు.
పండగను ఇలా చేస్తే బాగుంటుంది
పక్షుల పండగ సమయంలో పర్యాటకుల కోసం ప్రత్యేకించి హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసి నేలపట్టు, పులికాట్ ప్రాంతాల్లో తిప్పి తే మంచి అనుభూతి కలుగుతుందని జాయింట్ కలెక్టర్ రేఖారాణి కలెక్టర్‌కు సూచించారు. ఇందులో ప్రయాణించేం దుకు టికెట్ ధర రూ.1000గా నిర్ధారించాలన్నారు. పక్షుల కేంద్రం వద్ద బంగి జంప్ వంటివి ఏర్పాటు చేస్తే పర్యాటకులను ఆకట్టుకోవచ్చన్నారు.
పండగ సమయంలో పిల్లలను ప్రత్యేకించి ఆకట్టుకునేలా పక్షుల కేంద్రంలో పులులు, చిరుత, నెమళ్లు వంటి వి ఏర్పాటు చేస్తామని సూళ్లూరుపేట వన్యప్రాణి విభాగం డీఎఫ్‌ఓ చంద్రశేఖర్ తెలి పారు. బీవీపాళెం వద్ద అకట్టుకునేలా ఏర్పాట్లు చేయడంతో పాటు పులికాట్‌లో పడవ పందేలు పెట్టాలని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచించారు. పులికాట్‌లో బోటు షికారును కొత్త తరహాలో కల్పించాలని కలెక్టర్‌ను కోరారు.
డ్వామా పీడీ గౌతమి, ఇన్‌చార్జి ఆర్డీఓ రవీంద్ర, ఎంపీపీలు సుజాతమ్మ, షమీమ్, జెడ్పీటీసీ సభ్యులు వేనాటి రామచంద్రారెడ్డి, విజిత, ఎంపీడీఓ సురేష్‌బాబు, తహశీల్దార్లు మునిలక్ష్మి, ఉమాదేవీ, సూళ్లూరుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, కమిషనర్ కనకరావు, పులికాట్ పక్షి ప్రేమికల సంస్థ నిర్వాహకుడు గోపిరెడ్డి, ఏపిల్ సంస్థ ప్రతినిధి ప్రసాద్‌రావు, కెమిల్ సంస్థ నిర్వాహకుడు ఈశ్వరయ్య పాల్గొన్నారు.