MLA kiliveti Sanjeevaiah
-
దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు
నాయుడుపేటటౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మొదటినుంచి దళితులంటే చిన్నచూపని వైఎస్సార్ సీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నాయుడుపేట పట్టణంలోని ఆ పార్టీ మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి నివాసంలో మంగళవారం ఎమ్మెల్యే విలేకరులతో సమావేశంలో మాట్లాడా రు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా అమరావతిలో ఆయన 125 అడుగల విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పి మూడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు కనీసం ఒక ఇటుకరాయి కూడా పేర్చలేకపోయారన్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ మేరిగ నాగార్జున శాంతియుతంగా మౌన ప్రదర్శన చేస్తుంటే పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలపై ప్రజలకు తెలియజేసేలా శాంతి యుతంగా ప్రదర్శన చేస్తున్న వారిని అడ్డుకోవడం నీతిమాలిన చర్య అన్నారు. రాష్ట్రంలో దళితుల మధ్య చిచ్చుపెట్టిన ఘనత బాబుకే దక్కిందన్నారు. ఆడబిడ్డకు రక్షగా నిలుద్దామని చెప్పే అర్హత బాబుకు ఉందా అని ప్రశ్నించారు. తహసీల్దార్ వనజాక్షిపై అధికారపార్టీ ఎమ్మెల్యే దాడి చేస్తే పట్టించుకోని మీరు అధికారుల చేత ర్యాలీలు చేయించడం శోచనీయమన్నారు. మేరిగ నాగార్జున అక్రమం అరెస్ట్ విషయంలో ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దళితుల సత్తా చూపుతామన్నారు. సమావేశంలో నాయకులు తంబిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, ముప్పాళ్ల జనార్దన్‌రెడ్డి, గంధవల్లి సిద్ధయ్య, ఆబోతుల బాబు, లింగారెడ్డి సురేష్‌రెడ్డి, పేట చంద్రారెడ్డి, కటకటం జయారామయ్య, ప్రకాశం పాల్గొన్నారు. -
అక్రమ కేసులు పెడితే తిరుగుబాటు
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అపహాస్యం చేస్తున్న టీడీపీ నాయకులు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయుడుపేట టౌన్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీవ్రంగా ఖండించారు. నాయుడుపేటలోని తన నివాసంలో శుక్రవారం ఆయనవిలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నాయకులు పోలీసులను అడ్డంపెట్టుకుని నైతిక విలువలకు సైతం తిలోదకాలు ఇస్తున్నారని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కామిరెడ్డి సత్య నారాయణ రెడ్డి, దువ్వూరు బాలచంద్రా రెడ్డితో పాటు నాయుడుపేట మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ షేక్ రఫీ, సూళ్లూరుపేట నాయకులు పెమ్మారెడ్డి త్రిలోక్చంద్రా రెడ్డిలపై అట్రాసిటీ కేసులతో పాటు పలు సెక్షన్లపై కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అన్నారు. మహిళా ఎంపీటీసీలను అడ్డం పెట్టుకుని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లలో చొరబడి రౌడీల్లా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరించడం సరికాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని అక్రమ కేసులను బనాయిస్తే ఊరుకునేది లేదన్నారు. టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. జిల్లాలో 100కు పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులున్నారని, తమ పార్టీ విజయం తధ్యమన్నారు. ఓడిపోతున్నా మన్న భయంతో టీడీపీ నీతిమాలిన పనులు చేస్తే తాము కూడా ప్రజలతో కలిసి తిరగబడుతామని హెచ్చరించారు. ఎస్పీని కలిసి అన్ని విషయాలు చెబు తామని, అవసరమైతే జిల్లా నాయకు లతో కలిసి నాయుడుపేట పోలీస్‌స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడ తామని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆల్టిమేటం జారీచేశారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు షేక్ జరీనా, కేఎంవీ కళాచంద్ర, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల కన్వీనర్లు తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, మారాబత్తిన సుధాకర్, జరుగుమల్లి బాబురెడ్డి, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి పాలూరు దశరధరామిరెడ్డి, రైతు విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందేపల్లి మధుసూధన్‌రెడ్డి, మహిళా జిల్లా కార్యదర్శి కురుగొండ ధనలక్ష్మి, రత్నశ్రీ, నాయకులు పేట చంద్రారెడ్డి, దొంతాల రాజశేఖర్‌రెడ్డి, భీమయ్య, సిద్ధయ్య, పాదర్తి హరినాధ్‌రెడ్డి, మూడు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు. -
హత్యాయత్నం దుర్మార్గం
నైతిక బాధ్యత అధికార యంత్రాంగానిదే: ఎమ్మెల్యే కిలివేటి నాయుడుపేట టౌన్ : అధికార పార్టీ నాయకుల అక్రమాలను అడ్డుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరం మధుసూదననాయుడు, భైనా చంద్రశేఖర్‌రెడ్డిలను హత్యచేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీవ్రంగా ఖండించారు. నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలలో బాధితులకు ప్రథమ చికిత్స నిర్వహిస్తుండగా ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీ మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కట్టా వెంకటరమణారెడ్డి, పట్టణ అధ్యక్షులు షేక్ రఫీలు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాయకులు ఇద్దరికీ ప్రథమ చికిత్సలు నిర్వహించి వెంటనే మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించేలా సత్వర చర్యలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి హత్యాయత్న ప్రయత్నంపై తీవ్రంగా ఖండిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్వాకం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలాగే స్వర్ణముఖి నది నుంచి భారీగా ఇసుక డంపింగ్‌లు చేసి వందల సంఖ్యలో లారీల్లో అక్రమంగా తరలించుకుపోతున్నారని జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యా దు చేశారన్న కారణంతో తమ పార్టీకి చెందిన నేతలపై దాడి చేసి హత్యారాజకీయాలకు తెరలేపుతున్నారని వారు దుయ్యబట్టారు. జిల్లా అధికార యంత్రాగమే ఇందుకు నైతిక బాధ్యత వహించాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా, అధికారపార్టీ అండదండలతో వీరు చేస్తున్న దురాగతాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వైద్యశాల వద్ద ఉద్రిక్తత వైసీపీ నేతలు పేరం మధుసూదననాయుడు, భైనా చంద్రశేఖర్‌రెడ్డిలపై హత్యాయత్నం జరిగినట్లు తెలుసుకుని పెళ్లకూరు మం డలం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన అనేకమంది ఆస్పత్రి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దాడిలో తీవ్రంగా గాయపడిన వైసీపీ నేతల కుటుంబ సభ్యు లు, బంధువులు, పార్టీ నాయకులు పలువురు చేరుకుని అధికార పార్టీ వైఖరిపై తీవ్రంగా విమర్శించారు. వైద్యశాల వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పెళ్లకూరు ఎస్సై రవినాయక్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామస్థులు సైతం ఆగ్రహంతో ఉన్నారని,ఏదైనా ఉద్రిక్తత నెలకొంటే మీరే బాధ్యత వహిం చాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పార్టీ మారుతున్నారనేది దుష్ర్పచారం
తెలంగాణలో టీడీపీ పరిస్థితిని కప్పి పుచ్చుకునేందుకే డ్రామాలు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నెల్లూరు: ‘తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు రోజుకొకరు పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్, ప్రకాష్‌గౌడ్ టీఆర్ఎస్లో చేరారు. ఆ విషయాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు మైండ్‌గేమ్ ఆడుతున్నారు’ అని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య స్పష్టం చేశారు. ఎస్సీ ఎమ్మెల్యేనైన తనపై ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీలంటే సీఎం చంద్రబాబుకు చులకనని, అందుకే ఆ సామాజికవర్గాన్ని కించపరచేలా మాట్లాడారని ధ్వజమెత్తారు. తానెప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటానని స్పష్టం చేశారు. మరోసారి తనపై ఇలాంటి తప్పుడు రాతలు రాయించి ప్రచారం చేస్తే అందుకు సంబంధించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ప్రచారం చేస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. వారు చేస్తున్న ప్రచారాల్లో ఏ ఒక్కటీ నిజం కాదని పలుమార్లు రుజువైందని తెలిపారు. అదేవిధంగా నేడు కూడా ఎల్లో మీడియా ద్వారా వార్తలు రాయించి మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. ఇకపై ఇటువంటి తప్పుడు రాతలు రాయించవద్దని కోరారు. చంద్రబాబును కాపాడేందుకు అబద్ధపు రాతలు రాసి పత్రిక, మీడియా పరువును బజార్లో పెట్టుకోవద్దని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచించారు. -
అభివృద్ధికి సహకరించండి
అపాచీ జీఎంను కోరిన ఎమ్మెల్యే కిలివేటి తడ: సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మాంబట్టులోని పరిశ్రమల ప్రతినిధులను సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కోరారు. శనివారం ఆయన మాంబట్టులోని అపాచీ కంపెనీ జీఎం ఆండ్రూ ఫిలిప్చెన్తో భేటీ అయ్యారు. నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. సూళ్లూరుపేట ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో అధ్వాన స్థితిలో ఉన్న మార్చురీ గది స్థానంలో నూతన భవనం చేపట్టాలన్నారు. మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్లు సమకూర్చాలని కోరారు. రోగుల కోసం ఆస్పత్రిలో కొన్ని పడకలను కూడా సమకూర్చాలని ప్రతిపాదించారు. అపాచీ జీఎం స్పందిస్తూ ఈ ప్రతిపాదనలను తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల కోసం ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం కోసం ప్రయత్నించాలని సూచించారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఆస్పత్రి నిర్మాణానికి నిధులు త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని కిలివేటి చెప్పారు. ఇరకందీవి వాసుల కోసం కలెక్టర్ శ్రీకాంత్ ఇటీవల మంజూరు చేసిన రెండు బోట్లకు మోటార్లు ఏర్పాటు కోసం రూ.1.25 లక్షలకు ప్రతిపాదనలు పంపాలని అపాచీ కంపెనీ ప్రతినిధులు సూచించారన్నారు. అనపగుంట మార్గంలోని కస్తూరిబా విద్యాలయంలో 25 లైట్లు, 25 ఫ్యాన్లు పనిచేసేలా ఇన్వర్టర్ ఏర్పాటు చేసేందుకు కూడా అపాచీ ముందుకొచ్చిందని ఎమ్మెల్యే కిలివేటి వెల్లడించారు. ఇన్వర్టర్కు సోలార్ అనుసంధానం చేసేందుకు అవసరమైన ప్యానళ్లను అందించేందుకు తడకు చెందిన ఓ దాత ముందుకొచ్చారని వివరించారు. ఈ సమావేశంలో ఆపాచీ పీఆర్ఓ సుధీర్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, నాయకులు గండవరం సురేష్‌రెడ్డి, తిరుమూరు రవిరెడ్డి, కామిరెడ్డి నందారెడ్డి, కోట నరేంద్రరెడ్డి, గండవరం జగదీష్‌రెడ్డి, సీహెచ్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లెమింగో ఫెస్టివల్‌కు కొత్తదనం
దొరవారిసత్రం: సూళ్లూరుపేట కేంద్రంగా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ దఫా కొత్తదనాన్ని సంతరించుకునేలా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని కలెక్టర్ శ్రీకాంత్ అన్నారు. సూళ్లూరుపేట, నేల పట్టు, పులికాట్, బీవీపాళెం ప్రాంతాల్లో పండగ జరిపేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జనవరిలో మూడురోజుల పాటు నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్‌పై శుక్రవారం నేలపట్టు పక్షుల కేంద్రంలో వివిధ శాఖల అధికారులతో పాటు తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండలాల్లోని అధికారులు, ప్రజాప్రతి నిధులు, స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో సమావేశాన్ని నిర్వహించారు. పక్షుల పండగను ప్రతిష్టాత్మకంగా, అలరించేలా ఎలా చేయాలనే అంశంపై చర్చించా రు. కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నామన్నారు. వారంలోపు ఎప్పుడనేది వివరాలు వెల్లడిస్తామన్నారు. పక్షుల పండగలో స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చి వారు ఆర్థికంగా లాభపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. పర్యావరణం దెబ్బతినకుండా చూస్తామన్నారు. పక్షుల పండగను మూడు రోజుల పాటు నిర్వహించడ మే కాకుండా విహంగాల సీజన్లో వారం లో ఒకరోజు పండగ వాతావరణం కల్పిం చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నా రు. పక్షుల కేంద్రంలోని చెరువుల్లోకి పండ గ సమయానికి తెలుగు గంగ కాలువ ద్వారా నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. పక్షుల పండగ సందర్భగా అధికారులు తమను చిన్నచూపు చూస్తున్నారని, ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని మత్స్యకారులు వాపోయారు. పండగను ఇలా చేస్తే బాగుంటుంది పక్షుల పండగ సమయంలో పర్యాటకుల కోసం ప్రత్యేకించి హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసి నేలపట్టు, పులికాట్ ప్రాంతాల్లో తిప్పి తే మంచి అనుభూతి కలుగుతుందని జాయింట్ కలెక్టర్ రేఖారాణి కలెక్టర్‌కు సూచించారు. ఇందులో ప్రయాణించేం దుకు టికెట్ ధర రూ.1000గా నిర్ధారించాలన్నారు. పక్షుల కేంద్రం వద్ద బంగి జంప్ వంటివి ఏర్పాటు చేస్తే పర్యాటకులను ఆకట్టుకోవచ్చన్నారు. పండగ సమయంలో పిల్లలను ప్రత్యేకించి ఆకట్టుకునేలా పక్షుల కేంద్రంలో పులులు, చిరుత, నెమళ్లు వంటి వి ఏర్పాటు చేస్తామని సూళ్లూరుపేట వన్యప్రాణి విభాగం డీఎఫ్ఓ చంద్రశేఖర్ తెలి పారు. బీవీపాళెం వద్ద అకట్టుకునేలా ఏర్పాట్లు చేయడంతో పాటు పులికాట్లో పడవ పందేలు పెట్టాలని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచించారు. పులికాట్లో బోటు షికారును కొత్త తరహాలో కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. డ్వామా పీడీ గౌతమి, ఇన్చార్జి ఆర్డీఓ రవీంద్ర, ఎంపీపీలు సుజాతమ్మ, షమీమ్, జెడ్పీటీసీ సభ్యులు వేనాటి రామచంద్రారెడ్డి, విజిత, ఎంపీడీఓ సురేష్‌బాబు, తహశీల్దార్లు మునిలక్ష్మి, ఉమాదేవీ, సూళ్లూరుపేట మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, కమిషనర్ కనకరావు, పులికాట్ పక్షి ప్రేమికల సంస్థ నిర్వాహకుడు గోపిరెడ్డి, ఏపిల్ సంస్థ ప్రతినిధి ప్రసాద్‌రావు, కెమిల్ సంస్థ నిర్వాహకుడు ఈశ్వరయ్య పాల్గొన్నారు.