Flamingo Festival
-
ప్రారంభమైన ఫ్లెమింగోల సందడి..
విహంగాల్లో రారాజైన గూడబాతులు (పెలికాన్).. ప్రపంచంలోనే అతి అందమైన పక్షులు ఫ్లెమింగోలు.. ఆహార వేటలో ఆకట్టుకునే విన్యాసాలు చేసే నారాయణ పక్షి.. జపం చేసే పెయింటెడ్ స్టార్క్స్.. చూపరులను ఆకట్టుకునే ఎర్రకాళ్ల కొంగలతో పాటు వందల రకాల అరుదైన పక్షి జాతులు జిల్లాలోని పక్షుల కేంద్రంలో సందడి చేస్తున్నాయి. జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే పులికాట్ సరస్సు వేల విదేశీ పక్షుల ఆహార భాండాగారంగా విలసిల్లుతోంది. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవడంతో నెల రోజుల ముందు నుంచే జిల్లాలో ఫ్లెమింగోల సందడి ప్రారంభమైంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పక్షుల విడిది కేంద్రం నేలపట్టు. జీవ వైవిధ్యానికి నెలవైన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు పులికాట్ విదేశీ వలస విహంగాల విహారంతో అరుదైన ప్రపంచంగా కనిపిస్తోంది. చెరువు నీటిలోని కడప చెట్లపై విడిది చేస్తున్న అతిథుల కిలకిలరావాలు, ఆహార వేటలో సాగించే విన్యాసాలు పక్షి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. దశాబ్దాలుగా నేలపట్టు విదేశీ పక్షుల సంతనోత్పత్తి కేంద్రంగా భాసిల్లుతోంది. అక్టోబరు మాసం వచ్చిందంటే.. రంగు రంగుల పక్షులు వచ్చి వాలుతుంటాయి. సుమారు ఆరు నెలల పాటు ఇక్కడ విడిది చేసి సంతానోత్పత్తిని పెంచుకుని తిరిగి స్వస్థలాలకు పయనమవుతాయి. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో నేలపట్టు చెరువులతో పాటు పులికాట్‌కు నీళ్లు రా వడంతో వలస పక్షులు నెల ముందుగానే చేరు కుని సందడి చేస్తున్నాయి. ►ఒక వైపు నేలపట్టు చెరువులో విదేశీ వలస విహంగాలు గుడ్లుపెట్టి పొదుగుతుంటే పులికాట్ సరస్సులో విహంగాలు ఆహార వేట సాగిస్తూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ►సూళ్లూరుపేట–శ్రీహరికోట రోడ్డులో పులికాట్ సరస్సులో నీళ్లు పుష్కలంగా చేరడంతో ఫ్లెమింగోలు, పెలికాన్స్, పెయింటెడ్ స్టార్క్స్ గుంపులు గుంపులుగా ఆహార వేటలో దర్శనమిస్తున్నాయి. ►సీగల్స్, చిలువలు, నీటికాకులు, నారాయణ పక్షులతో పాటు వివిధ రకాలకు చెందిన కొంగ జాతులు విపరీతంగా విడిది చేసి ఉన్నాయి. ►నేలపట్టును సంతానోత్పత్తి కేంద్రంగా, పులికాట్ సరస్సును ఆహార కేంద్రంగా చేసుకుని పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. హంసను పోలిన ఫ్లెమింగో ప్రపంచంలోనే అందమైన పక్షి ఫ్లెమింగో. ఈ పక్షి హంసను పోలి ఉంటుంది. శాఖాహారి. ఈ రకం పక్షులు అత్యంత అరుదుగా ఉన్నాయి. పులికాట్ సరస్సు మీద ఆçహార వేటలో గుంపులు గుంపులుగా చేరి పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తాయి. ►ఈ పక్షులు ఆ్రస్టేలియా, రష్యా, సైబీరియా నుంచి వలస వచ్చి గుజరాత్‌లోని రాణాఫ్కచ్ అనే ప్రాంతంలో సంతానోత్పత్తి చేసుకుంటూ పులికాట్ సరస్సును ఆహార కేంద్రంగా ఉపయోగించుకుంటున్నాయి. ►ఈ పక్షులు పులికాట్ సరస్సులో రోజుల తరబడి ఉంటాయని దీనిపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు చెప్పారు. ►పులికాట్ సరస్సులో ఉండే నాచును మాత్రమే తింటుంది. ►ఈ పక్షి చెట్ల మీద గూళ్లు కట్టుకోకుండా నేలమీద రంధ్రం చేసుకుని గుడ్లు పెట్టి పొదుగుతాయి. ►హంసలు పాలను నీళ్లును వేరు చేసినట్టు ఈ పక్షి నాచు తినేటప్పుడు బురదను నాచును వేరు చేసి ఆహారంగా తీసుకోవడం దీని ప్రత్యేకత. ఎర్రకాళ్ల కొంగల కేంద్రం వెదురుపట్టు, శ్రీహరికోట ఎర్రకాళ్ల కొంగలు (పెయింటెడ్ స్టార్క్స్) పక్షులు వెదురుపట్టు చెరువు, శ్రీహరికోట లోని బేరిపేట ప్రాంతాల్లో గూళ్లు కట్టు కు ని నివాసం ఉంటాయి. ఆహార వేటకు మాత్రం పులికాట్ సరస్సుకే వస్తాయి. ►రష్యా, సైబీరియా వంటి దేశాల నుంచి ఇక్కడికి వలస వచ్చి సంతానోత్పత్తిని చేసుకుని వెళ్తుంటాయి. ►ఇవి పులికాట్లో గుంపు గుంపులుగా విహరిస్తుంటాయి. అయితే వెదురుపట్టు చెరువు అనువుగా లేకపోవడంతో ఈ పక్షులు శ్రీహరికోటకు మకాం మార్చుకున్నాయి. ►ప్రస్తుతం శ్రీహరికోటను సంతానోత్పత్తి కేంద్రంగా చేసుకున్నాయి. ఇవి కూడా సరస్సులోని చేపలు, రొయ్యలు, పీతలను తింటుంది. అతి పెద్ద సంతానోత్పత్తి కేంద్రం ఆసియా ఖండంలోనే విదేశీ శీతాకాలపు వలస విహంగాల సంతానోత్పత్తి కేంద్రంగా, నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంగా భాసిల్లుతుంది. 1976లో నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రంగా వన్యప్రాణి విభాగం అధికారులు గుర్తించారు. ఈ కేంద్రం 458.92 హెక్టార్లలో విస్తరించి ఉంది. ప్రస్తుతం పక్షుల కేంద్రంలో 11 రకాల పక్షులు 4 వేలకు పైబడి విడిది చేశాయి. ఇందులో గూడబాతులు (పెలికాన్) 850, నత్తగుల్ల కొంగలు (ఓపెన్‌బిల్ స్టార్క్స్) 2015, తెల్లకంకణాయిలు (వైట్‌ఐబీస్) 600, తెడ్డుముక్కు కొంగలు (స్పూన్ బిల్స్) 100, నారాయణ పక్షులు (నైట్హేరాన్) 250, నీటికాకులు (కార్మోరెంట్స్)300, చిన్న,పెద్ద స్వాతికొంగలు150 (ఈ గ్రేడ్స్), వీటితో పాటు పదుల సంఖ్యలో పాముమెడ పక్షులు (డాటర్), చుక్కకోళ్లు (కూట్స్), ఊలబాతులు (లేజర్ విజిలింగ్ డక్స్) సందడి చేస్తున్నాయి. సందడిగా పులికాట్ ప్రాంతం దొరవారిసత్రం, నేలపట్టులో గూడబాతులు, నత్తగుల్ల కొంగలు, నీటికాకులు, తెల్లకంకణాయిలు, శబరి కొంగలు వంటి పక్షులు కనిపిస్తున్నాయి. ఇక్కడకొచ్చే విదేశీ వలస పక్షుల్లో అతి అందమైన పక్షి ఫ్లెమింగో కావడంతో ఆ పక్షి పేరుతో ఏటా పండగను నిర్వహిస్తున్నారు. ► పులికాట్ సరస్సు, నేలపట్టులో కలిపి సుమారు 50 వేల విదేశీ వలస విహంగాలు ఇప్పటికే విచ్చేసినట్లు పులికాట్ వన్యప్రాణి సంరక్షణాధికారులు వెల్లడించారు. ►కుదిరి–అటకానితిప్ప గ్రామాల మధ్య సరస్సులో పర్యాటకులు విహంగాలను వీక్షించేందుకు రెండు, మూడు చోట్ల వ్యూ పాయింట్స్ ఏర్పాట్లు చేశారు. గూళ్లలో నివశించే పెలికాన్ పక్షుల్లో రారాజు గూడబాతులు (పెలికాన్). నైజీరియా, సైబీరియా, ఆ్రస్టేలియా నుంచి నేలపట్టు చెరువులోని చెట్ల మీద విడిది చేస్తున్నాయి. గూళ్లు కట్టుకుని అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు నేలపట్టులోనే ఉండి సంతానోత్పత్తిని చేసుకుని వెళ్తుంటాయి. ►ఈ రకం పక్షులు ప్రపంచ వ్యాప్తంగా ఏడు వేలు మాత్రమే ఉన్నాయని, ఇందులో నేలపట్టుకు సుమారు 2 వేలకు పైగా వస్తున్నాయని వీటిపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ►ఈ పక్షులు మనుషుల్లో ఉండే గుణాన్ని కలిగి ఉంటాయి. ఆడపక్షి గుడ్లు పెట్టి పొదుగులో ఉంటే మగపక్షి ఆహార వేటకు వెళ్లి తను తిని, తెడ్డులాంటి ముక్కు కింద ఉన్న సంచిలో ఆహారాన్ని తీసుకొచ్చి ఆడపక్షికి, పిల్లలకు అందిస్తుంది. ►నేలపట్టులో సంధ్య వేళ ఇలాంటి మనోహర దృశ్యాలు పర్యాటకులను ఆహ్లాద పరుస్తాయి. ►ఆడ పక్షి పిల్లలను పొదిగి అవి ఎగిరే దాకా మగపక్షే పోషించడం ఈ పక్షుల్లో ప్రత్యేకత. పులికాట్ సరస్సులో దొరికే చేపలు, పీతలు, రొయ్యలు దీని ఆహారం. నారాయణపక్షి నారాయణ పక్షులు తడ మండలం బోడిలింగాలపాడు, చింతవక్కలు, నీటికాకులు చిల్లకూరు మండలం చింతవరం వద్ద గూళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నాయి. వాకాడు మండలం మొనపాళెం వద్ద చిన్నస్వాతి కొంగలు, పెద్ద స్వాతి కొంగలు కాకులతో కలిసి గూళ్లు కట్టుకుని ఉంటాయి. మనుబోలు చెరువులో ఐదారు రకాలు బాతులు ఉన్నాయి. మిగిలిన చాలా పక్షులు సమీప ప్రాంతాల్లో చెట్ల మీద గూళ్లు కట్టుకుని ఉంటూ శీతాకాలం అంతా ఇక్కడే ఉండి వెళ్తున్నాయని బాంబే బర్డ్స్ నేచరల్ సొసైటీ రీసెర్చ్‌లో వెల్లడైంది. రాత్రి గూటికి వెళ్లి తిరిగి వేకువ జాము నుంచి సరస్సుపై ఆహారం వేటలో విహరిస్తున్నపుడు అవి చేసే విన్యాసాలు పక్షి ప్రియులను అలరిస్తాయి. -
కనువిందు చేస్తున్న విదేశీ పక్షులు
సాక్షి, సూళ్లూరుపేట: మూడు రోజులపాటు నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్–2020 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆటవీ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జల వనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హాజరయ్యారు. సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండల కేంద్రాల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలుత సూళ్లూరుపేటలో తప్పెట్లు, తాళాలు, కోలాటాలు, జానపద నృత్యాలతో శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పక్షుల పండగను ప్రారంభించారు. అనంతరం ఫ్లెమింగో ఫెస్టివల్–2020 బెలూన్ ఎగురవేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను మంత్రులు వరుసగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి బాలినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతి పెద్ద సరస్సుగా పేరొందిన పులికాట్‌ను మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యాటక పరంగా ఏపీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేసి టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పక్షుల పండగను విజయవంతం చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరావు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, అటవీ శాఖ సంరక్షణాధికారి ప్రతీప్ కుమార్, టూరిజం కార్పొరేషన్ ఎండీ ప్రవీణ్‌కుమార్, చెంగాళమ్మ ఆలయ పాలక మండలి చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
‘ఫ్లెమింగో ఫెస్టివల్ పేరిట దండుకుంటున్నారు’
-
‘ఫ్లెమింగో ఫెస్టివల్ పేరిట దండుకుంటున్నారు’
సాక్షి, నెల్లూరు : పులికాట్ సరస్సు వద్ద పక్షుల పండగ (ఫ్లెమింగో ఫెస్టివల్) పేరిట టీడీపీ నేతలు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ ఆరోపించారు. కమీషన్ల కోసమే ప్రతి ఏటా కోట్లాది రూపాయలను ఫ్లెమింగో ఫెస్టివల్ కోసం వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. అక్కడంతా టీడీపీ సొంత పండగలా ఉందని విమర్శించారు. ఫెస్టివల్‌కు సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు ఆహ్వానం పంపకపోవడం టీడీపీ నేతల దుర్నీతికి నిదర్శనమని చెప్పారు. సరస్సు ముఖద్వారాలలో పూడిక తీతపై సీఎం చంద్రబాబు, మంత్రులు హామీలు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఫెస్టివల్ పేరుతో మూడు రోజుల పాటు హడావుడి చేయడం మినహాయించి పర్యాటకులకు సదుపాయాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టూరిజం అభివృద్ధికి స్వదేశీ దర్శన్ కింద రూ.65 కోట్లను తీసుకొస్తే.. వాటిలో కూడా టీడీపీ నేతలు కమీషన్లు నొక్కేస్తున్నారని ఆరోపణలు చేశారు. -
సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్
సూళ్లూరుపేట : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మంగళవారం ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. ఇక్కడి పులికాట్ సరస్సుకు ఏటా ఈ శీతాకాలంలో పక్షులు విదేశాల నుంచి వలస వస్తుంటాయి. ఈ సందర్భంగానే స్థానిక ప్రభుత్వ పాఠశాల వేదికగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి శిద్ధా రాఘవరావు ప్రారంభించారు. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయి. -
ఫ్లెమింగో ఫెస్టివల్‌కు ఏర్పాట్లు చేయండి
కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు నెల్లూరు(పొగతోట): జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేసి విజయవంతమయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ బంగళాలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో పక్షుల పండగ నిర్వహించనున్నామన్నారు. ఫెస్టివల్ ప్రచారం కోసం హోర్డింగులు, వాల్‌పోస్టర్లు, ఫేస్‌బుక్‌ను వినియోగించాలన్నారు. పండగకు ఏర్పాట్లకు సంబంధించి అధికారులతోపాటు, అనధికారులకు కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. బీవీపాళెంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా తెరచాప పడవలను ఏర్పాటు చేయాలని తెలిపారు. అందుబాటులో గజ ఈతగాళ్లు బోటు షికారు ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఇతర జిల్లాల్లో నిర్వహించిన పండగల్లో ధరలను పరిశీలించి వాటి ఆధారంగా పక్షుల పండగకు రేట్లు నిర్ణయించాలన్నారు. ఫుడుకోర్టులు ఏర్పాటు చేసి నాణ్యమైన రుచికరమైన వాటిని సరసమైన ధరలకు అందించాలన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా క్యాటిల్షో, డాగ్‌షో, స్నేక్ షోలను ఏర్పాటు చేయాలన్నారు. సూళ్లూరుపేట సుందరీకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ మహమ్మద్‌ఇంతియాజ్ మాట్లాడుతూ పక్షుల పండగ ఘనంగా నిర్వహించేలా అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. సందర్భంగా క్రీడాపోటీలు నిర్వహించాలన్నారు. ఆటలపోటీల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని, వారికి కూడా అవకాశం కల్పించాలన్నారు. జేసీ–2 రాజ్‌కుమార్ మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు ముందుగా స్థానిక కళాకారులకు అవకాశం కల్పించిన అనంతరం మెగాషోలు ప్రారంభమవుతాయన్నారు. పర్యాటక శాఖాధికారి నాగభూషణం మాట్లాడుతూ పండగకు సంబంధించి 2కె, 5కె రన్‌తోపాటు బ్యానర్లు, వాల్‌పోస్టర్లు, రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పక్షుల పండగకు సంబంధించిన పాటపాడిన జేసీ–2 కారు డ్రైవర్ కృపానందాన్ని కలెక్టర్, జేసీ అభినం«దించారు. సమావేశంలో జేడ్పీ సీఈఓ రామిరెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహించాలి
కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు నెల్లూరు(పొగతోట): వచ్చే నెల 28 నుంచి నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ (పక్షులపండగ)ను ఘనంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పక్షుల పండగకు నిర్దేశించిన పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఫెస్టివల్‌కు వచ్చే వారు ఇబ్బందులుపడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తడ నుంచి బీవీపాళెం, డీవీసత్రం, వేదురపాళెం, నరసాంబాపురం వరకు రోడ్లకు మరమ్మతులు చేయాలన్నారు. ఈ మరమ్మతులకు జిల్లా ఖజిన సంపద నిధులను విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్జీఓలు సమన్వయంతో పని చేసి ఫ్లెమింగో ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సమవేశంలో జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్‌ఇంతియాజ్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, పర్యటక శాఖ ఈడీ చంద్రమౌళి పాల్గొన్నారు. -
వచ్చే నెల 28 నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్
నిర్వహణకు రూ.2 కోట్లు కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు నెల్లూరు(పొగతోట): జిల్లాలో ప్రతిష్టాత్మకమైన ఫ్లెమింగో ఫెస్టివల్‌ను వచ్చే నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించిందన్నారు. ఫెస్టివల్ నిర్వహించే బీవీపాళెం, నేలపట్టు తదితర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. స్వచ్ఛభారత్, ఉపాధి హామీ పథకం ద్వారా టాయిలెట్స్, మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. నేలపట్టులోని అతిథి గృహానికి మరమ్మతులకు నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. ఫెస్టివల్ నిర్వహణకు అవసరమైన నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలల్లో స్థానిక కళాకారులకు అవకాశం కల్పించాలని తెలిపారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఫెస్టివల్ సందర్భంగా సూళ్లూరుపేటలో ట్రాఫిక్ ఐలాండ్లు అభివృద్ధి చేయాలన్నారు. రోడ్డు చుట్టుపక్కలా మొక్కలు నాటలన్నారు. నేలపట్టు చెరువుకు తెలుగుగంగ నీటిని విడుదల చేయాలన్నారు. పర్యటకుల కోసం బోట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో జేసీ ఇంతియాజ్, జేసీ–2 రాజ్‌కుమార్, పర్యటక శాఖ ఈడీ చంద్రమౌళి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, టూరిజం అ«ధికారి నాగభూషణం పాల్గొన్నారు. పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయండి. జిల్లాలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పర్యాటక రంగం అభివృద్ధికి చేపడుతున్న పనుల్లో నాణ్యత లోపించకుండా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. -
పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు
ప్రతిష్టాత్మకంగా ఫ్లెమింగో ఫెస్టివల్ కలెక్టర్ ముత్యాలరాజు నెల్లూరు(పొగతోట): జిల్లాలో పర్యాటకరంగం అభివృద్ధికి నిర్దేశించిన పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పర్యాటకరంగం అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మైపాడుబీచ్‌లో అప్రోచ్ రోడ్లు, కాటేజీలు పనులు పూర్తి చేయాలన్నారు. తడ నుంచి భీమునివారిపాళెం, కావలి క్రాస్ రోడ్డు నుంచి తుమ్మలపెంట వరకు, టీపీగూడూరు నుంచి కొత్తకోడూరు బీచ్ రోడ్డు వరకు, నర్రవాడ క్రాస్ రోడ్డు నుంచి ఉదయగిరి వరకు ఉన్న రోడ్లుకు మరమ్మతులు చేయాలన్నారు. ఇరకందీవి, తుమ్మలపెంట, తోకపాళెం వద్ద రిసార్ట్స్‌కు భూములు గుర్తించి ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. పల్లిపాడు పినాకిని గాంధీ ఆశ్రమం అభివృద్ధి, జువ్వలదిన్నె వద్ద శ్రీపొట్టి శ్రీరాములు మెమోరియల్ ఏర్పాటు అవసరమైన పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. కమిటీలు వేసి ప్రణాళికలు రూపొందించి ఫెస్టివల్ విజయవంతంమయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో టూరిజం ఈడీ చంద్రమౌళి, పీఆర్ ఎస్ఈ బుగ్గయ్య, జిల్లా టూరిజం అధికారి నాగభూషణం, ఫారెస్ట్ రేంజ్ అధికారులు వెంకటరత్నం, కుమారరాజ, కార్పొరేషన్ ఎస్ఈ జె.శ్రీనివాసులు, ఈఈ ఈశ్వరయ్య పాల్గొన్నారు. కామధేను ప్రాజెక్టు పనులు పూర్తి చేయండి.. కామధేను ప్రాజెక్టుకు పనులు సకాలంలో పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. చింతలదేవి కామధేను ప్రాజెక్టు పరిపాలన భవనాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. అంతకముందు నీరు-చెట్టుపై వివిద శాఖల అ«ధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ జేడీ శ్రీధర్‌బాబు, ఏపీ లైవ్‌స్టాక్ అభివృద్ధి సంస్థ సీఈఓ కొండలరావు, వ్యవసాయ శాఖ జేడీ హేమమహేశ్వరరావు, పీఆర్ ఎస్ఈ బుగ్గయ్య, డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి, ఏపీఎంఐపీ పీడీ రమణరావు పాల్గొన్నారు. -
నేలపట్టులో విదేశీ అతిథుల సందడి
-
సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభం
-
సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభం
నెల్లూరు : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్‌ను రాష్ట్ర మంత్రులు పి. నారాయణ, శిద్దా రాఘవరావు ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనుంది. అయితే ఈ ఫెస్టివల్‌కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కాగా ఫ్లెమింగో ఫెస్టివల్‌ను కార్యక్రమ చిత్రీకరణను ఏఎస్పీ గంగాధర్ అడ్డుకున్నారు. కెమెరామన్, ఫొటోగ్రాఫర్లను స్టేజీ మధ్యలోంచి పోలీసులు లాగేశారు. దీంతో ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు పాత్రికేయులు ప్రకటించారు. అనంతరం పాత్రికేయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
కోలాహలంగా ఫ్లెమింగో ఫెస్టివల్
రెండోరోజున ఆటల పోటీల సందడి సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్-2015లో భాగంగా రెండోరోజు శనివారం సూళ్లూరుపేట ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో ఆటలపోటీలను అత్యంత కోలాహలంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పురుషులకు, మహిళలకు వేర్వేరుగా క్రీడలను నిర్వహించారు. కబడ్డీ, వాలీబాల్, మహిళలకు త్రోబాల్ పోటీలను నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్రీడాపోటీలను ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాలనుంచి విద్యార్థులు, తిరుపతి, శ్రీకాళహస్తి, చెన్నై నుంచి వచ్చిన పలువురు పర్యాటకులు ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను సందర్శించారు. అ తర్వాత ఉచిత బస్సుల్లో అటకానితిప్పకు వెళ్లి పులికాట్లో ఆహారవేటలో ఉన్న విదేశీ వలస విహంగాలను వీక్షించారు. ఆ తర్వాత నేలపట్టు పక్షులు కేంద్రానికి వెళ్లి చెరువులోని చెట్లపై గూళ్లుకట్టుకుని విన్యాసాలు చేస్తున్న విహంగాలను తిలకించారు. శనివారం మాత్రం సూళ్లూరుపేట మైదానం, బీవీపాళెంలో బోట్ షికార్, నేలపట్టుల్లో పక్షులను వీక్షించేందుకు పర్యాటకులు కిటకిటలాడుతూ కనిపించారు. దీనికి తోడు పులికాట్లో అత్యధికంగా విదేశీ వలస విహంగాలు దర్శనమివ్వడంతో సందర్శకులు పులకించిపోయారు. శ్రీహరికోట-సూళ్లూరుపేట మార్గానికి ఇరువైపులా పులికాట్ సరస్సులో ఫ్లెమింగోలు, పెయింటెడ్ స్టార్క్స్ ప్రకృతి ప్రియులకు కనువిందు చేశాయి. బోటు షికారు... భలే హుషారు... తడ మండలం భీములవారిపాళెం వద్ద బోటు షికారు ఏర్పాటు చేశారు. పులికాట్ సరస్సులో బోటు షికారు బాగుందని పర్యాటకుల అభిప్రాయం. నేలపట్టులో పక్షులను తిలకించడానికి జిల్లా నుంచి, తమిళనాడు నుంచి వేలాదిమంది పర్యాటకులు వచ్చారు. -
ఫ్లెమింగో ఫెస్టివల్
-
ఏపీలో ‘ఫ్లెమింగో’ ఎగిరింది..
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పక్షుల పండగ ఫ్లెమింగో ఫెస్టివల్ శుక్రవారం సూళ్లూరుపేటలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణ మాట్లాడుతూ పులికాట్ సరస్సును రక్షించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సరస్సు బాగుంటే విదేశీ పర్యాటకులు పక్షుల పండగకు వస్తారన్నారు. 2016లో జరిగే పండుగనాటికి పులికాట్, ఇరకం, నేలపట్టు ప్రాంతాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్‌ను మోడల్‌గా తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక సర్క్యూట్లు ఏర్పాటు చేస్తామన్నారు. - సూళ్లూరుపేట -
వచ్చే పండగ నాటికి పర్యాటకాభివృద్ధి
సూళ్లూరుపేట: వచ్చే ఫ్లెమింగో ఫెస్టివల్ నాటికి సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం మండలాలతో పాటు పులికాట్ సరస్సును అభివృద్ధి చేస్తామని రాష్ర్ట పురపాలక శాఖామంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మూడురోజుల పాటు నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2015 పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ, సాంకేతిక శాఖామంత్రి పల్లె రఘునాథరెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి పీతల సుజాతలు లాంఛనంగా ప్రారంభించారు. సూళ్లూరుపేట ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన పక్షుల పండగ వేడుకలను ఫ్లెమింగో బెలూన్ ఎగురవేసి ప్రారంభించారు. వివిధ శాఖల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను వరుసగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముందుగా జిల్లా కలెక్టర్ జానకి మాట్లాడారు. అ తర్వాత సభకు అధ్యక్షుడుగా స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ 2001 నుంచి ప్రతి ఏటా మూడురోజుల పాటు పక్షులు పండగను నిర్వహించేసి ఆ తర్వాత పులికాట్‌ను గాని, నేలపట్టు చెరువును గాని, భీములవారిపాళెం పడవల రేవునుగాని పట్టించుకోవడం లేదన్నారు. పండగ నిర్వహణతో పాటు ప్రకృతి ప్రసాదించిన రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు. సముద్ర ముఖద్వారాలు పూడిపోయి ఫిబ్రవరి నెలకంతా పులికాట్ ఎండిపోయే పరిస్థితికొచ్చిందన్నారు. ఏన్నో వేల కిలోమీటర్లు నుంచి సంతానోత్పత్తి చేసుకోవడానికి వస్తున్న పక్షులకు ఆశ్రయం కల్పించాలంటే ఇటు పులికాట్‌ను, అటు నేలపట్టును అభివృద్ధి చేయాలన్నారు. అదేవిధంగా భీములవారిపాళెం పడవల రేవులో నిరంతరాయంగా పడవ షికార్ ఉండే విధంగా అభివృద్ధి చేయాలన్నారు. పర్యాటక పరంగా ఈ మూడు ప్రాంతాలను అభివృద్ది చేయడానికి టూరిజం హబ్‌గా ప్రకటించి అభివృద్ధి చేయాలని కోరారు. అనంతరం మంత్రులు పీతల సుజాత, పల్లె రఘునాధరెడ్డి మాట్లాడుతూ ఎంతో అందమైన విదేశీ వలసపక్షులు వచ్చే ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా చేసి అభివృద్ధి చేయడానికి సీఎం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ముఖ్య అతిథి మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ మూడు ప్రాంతాలను పర్యాటకరంగంలో అభివృద్ధి చేసి స్థానికంగా యువతకు ఉపాధి లభించేటట్లు చేస్తానమని చెప్పారు. టూరిజం హబ్‌గా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారని చెప్పారు. పులికాట్‌కు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు షార్ సహకారంతో ముఖద్వారాలు పూడిక తీయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పరసా, సుబ్రమణ్యం, బల్లి దుర్గాప్రసాద్, బీద మస్తాన్‌రావు, జేసీ ఇంతియాజ్, డ్వామా పీడీ గౌతమి పాల్గొన్నారు. సీఎం సహాయనిధికి రూ.10 వేలు విరాళం.. ఏపీ సీఎం సహాయనిధికి మునిరత్నం అనే వ్యక్తి పదివేలు చెక్కును ఫ్లెమింగో ఫెస్టివల్ సభలో జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.అదేవిధంగా నెల్లూరుకు చెందిన కృష్ణారెడ్డి సూళ్లూరుపేట డాట్కాం అనే వెబ్‌సైట్‌ను ఐటీ మంత్రి చేతులు మీదుగా ప్రారంభం చేశారు. -
ఫ్లెమింగో ఫెస్టివల్‌కు కొత్తదనం
దొరవారిసత్రం: సూళ్లూరుపేట కేంద్రంగా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ దఫా కొత్తదనాన్ని సంతరించుకునేలా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని కలెక్టర్ శ్రీకాంత్ అన్నారు. సూళ్లూరుపేట, నేల పట్టు, పులికాట్, బీవీపాళెం ప్రాంతాల్లో పండగ జరిపేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జనవరిలో మూడురోజుల పాటు నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్‌పై శుక్రవారం నేలపట్టు పక్షుల కేంద్రంలో వివిధ శాఖల అధికారులతో పాటు తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండలాల్లోని అధికారులు, ప్రజాప్రతి నిధులు, స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో సమావేశాన్ని నిర్వహించారు. పక్షుల పండగను ప్రతిష్టాత్మకంగా, అలరించేలా ఎలా చేయాలనే అంశంపై చర్చించా రు. కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నామన్నారు. వారంలోపు ఎప్పుడనేది వివరాలు వెల్లడిస్తామన్నారు. పక్షుల పండగలో స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చి వారు ఆర్థికంగా లాభపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. పర్యావరణం దెబ్బతినకుండా చూస్తామన్నారు. పక్షుల పండగను మూడు రోజుల పాటు నిర్వహించడ మే కాకుండా విహంగాల సీజన్లో వారం లో ఒకరోజు పండగ వాతావరణం కల్పిం చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నా రు. పక్షుల కేంద్రంలోని చెరువుల్లోకి పండ గ సమయానికి తెలుగు గంగ కాలువ ద్వారా నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. పక్షుల పండగ సందర్భగా అధికారులు తమను చిన్నచూపు చూస్తున్నారని, ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని మత్స్యకారులు వాపోయారు. పండగను ఇలా చేస్తే బాగుంటుంది పక్షుల పండగ సమయంలో పర్యాటకుల కోసం ప్రత్యేకించి హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసి నేలపట్టు, పులికాట్ ప్రాంతాల్లో తిప్పి తే మంచి అనుభూతి కలుగుతుందని జాయింట్ కలెక్టర్ రేఖారాణి కలెక్టర్‌కు సూచించారు. ఇందులో ప్రయాణించేం దుకు టికెట్ ధర రూ.1000గా నిర్ధారించాలన్నారు. పక్షుల కేంద్రం వద్ద బంగి జంప్ వంటివి ఏర్పాటు చేస్తే పర్యాటకులను ఆకట్టుకోవచ్చన్నారు. పండగ సమయంలో పిల్లలను ప్రత్యేకించి ఆకట్టుకునేలా పక్షుల కేంద్రంలో పులులు, చిరుత, నెమళ్లు వంటి వి ఏర్పాటు చేస్తామని సూళ్లూరుపేట వన్యప్రాణి విభాగం డీఎఫ్ఓ చంద్రశేఖర్ తెలి పారు. బీవీపాళెం వద్ద అకట్టుకునేలా ఏర్పాట్లు చేయడంతో పాటు పులికాట్లో పడవ పందేలు పెట్టాలని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచించారు. పులికాట్లో బోటు షికారును కొత్త తరహాలో కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. డ్వామా పీడీ గౌతమి, ఇన్చార్జి ఆర్డీఓ రవీంద్ర, ఎంపీపీలు సుజాతమ్మ, షమీమ్, జెడ్పీటీసీ సభ్యులు వేనాటి రామచంద్రారెడ్డి, విజిత, ఎంపీడీఓ సురేష్‌బాబు, తహశీల్దార్లు మునిలక్ష్మి, ఉమాదేవీ, సూళ్లూరుపేట మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, కమిషనర్ కనకరావు, పులికాట్ పక్షి ప్రేమికల సంస్థ నిర్వాహకుడు గోపిరెడ్డి, ఏపిల్ సంస్థ ప్రతినిధి ప్రసాద్‌రావు, కెమిల్ సంస్థ నిర్వాహకుడు ఈశ్వరయ్య పాల్గొన్నారు.