పులికాట్ సరస్సు వద్ద పక్షుల పండగ (ఫ్లెమింగో ఫెస్టివల్) పేరిట టీడీపీ నేతలు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ ఆరోపించారు. కమీషన్ల కోసమే ప్రతి ఏటా కోట్లాది రూపాయలను ఫ్లెమింగో ఫెస్టివల్ కోసం వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. అక్కడంతా టీడీపీ సొంత పండగలా ఉందని విమర్శించారు.