Varaprasadha Rao
-
నాన్నకు నేను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు
‘పితా’ అంటూ ‘రెండు రెళ్లు ఆరు’లో అందరినీ నవ్వులలో ముంచారు. ‘నమస్కారవండయ్యా! నమస్కారవండయ్యా!’ అంటూ ‘సాగర సంగమం’లో బావి గట్టు మీద నవ్వులు పూయించారు. ఇక ‘చంటబ్బాయ్’లో పత్రిక ఎడిటర్‌గా శ్రీ లక్ష్మి కవితలను ప్రచురించలేక, బంగాళా భౌభౌ తినలేక ఆయన నవ్వించిన నవ్వులు అన్నీ ఇన్నీ కాదు. ఆయన పొట్టి ప్రసాద్.తెలుగు హాస్యంలో గట్టి ప్రసాద్. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు ఆయన సినీ ప్రయాణం సుదీర్ఘమైనది. ఆ తండ్రి గురించి ఎన్నో జ్ఞాపకాలను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని∙ ఏకైక కుమారుడు కవిపురపు జగన్నాథరావు సాక్షితో పంచుకున్నారు. నాన్నగారు కృష్ణాజిల్లా ఆటపాకలో 1929 జనవరి 5న జన్మించారు. నాన్నగారి అసలు పేరు కవిపురపు ప్రసాదరావు. ఆయన కొద్దిగా పొట్టిగా ఉండటం వల్ల అందరూ పొట్టిప్రసాద్ అనేవారు. ఆ పేరే స్థిరపడిపోయింది. అందరూ ఆ పేరుతోనే గుర్తిస్తారు. నాన్నగారు సినిమాలలోకి వచ్చిన కొత్తలో టైటిల్స్‌లో ప్రసాద్ అనే ఉండేది. అమ్మ పేరు రాజ్యలక్ష్మి. వాళ్లది కృష్ణా జిల్లా కైకలూరు. నాన్నగారికి నేను ఒక్కడినే అబ్బాయిని. నా భార్య పేరు శారద. నాకు ఇద్దరు పిల్లలు. రాజేశ్వర ప్రసాద్, శ్రీరాజ్ఞి. నేను పుట్టటానికి ముందు ఒక ఆడపిల్ల పుట్టి పోయిందట. అందుకని నాన్నగారు ఆడపిల్లలను చూసి మురిసిపోయేవారు. కవిపురపు ప్రసాదరావు (పొట్టి ప్రసాద్) మేనత్తగారే పెంచారు... మాది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. నాన్న చిన్నతనంలోనే బామ్మ పోవటంతో ఆయన మేనత్త మైనంపాటి కామేశ్వరమ్మ ఆ లోటు తెలియకుండా కన్నతల్లిలా పెంచారు. క్రమశిక్షణ అలవాటు చేశారు. ఆవిడంటే మా తాతగారితో సహా ఇంట్లో అందరికీ హడలు. నాన్నగారు బి.కాం వరకు చదువుకున్నారు. నాటకాలలో గిరీశం పాత్రలో ప్రసిద్ధులైన కె. వెంకటేశ్వరరావు గారి రస సమాఖ్యలో నాటకాలు వేసేవారు. అది వాళ్ల మేనత్తగారికి ఇష్టం ఉండేది కాదు. ఆవిడకు తెలియకుండా గోడ దూకి వెళ్లి, మళ్లీ ఆవిడ చూడకుండానే గోడ దూకి వచ్చేసేవారట. ఇలా నాటకాలలో వేషం వేస్తూ, జీవితంలో ఆర్థికంగా స్థిరపడరేమోనని, పెళ్లి చేసేయాలనుకున్నారట తాతగారు. మేనత్తగారికి ఇష్టం లేకుండానే నాన్నగారికి పెళ్లి చేసేశారట. ఈ విషయాలు మా వాళ్లంతా మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాను. సినిమాల కోసం... 1958లో నాన్నగారు నటించిన ఆకాశరామన్న నాటకం చూసి నిర్మాత చక్రపాణిగారు నాన్నగారిని వచ్చి కలవమన్నారు. సరేనని నాన్న ఎలాగో కష్టపడి మద్రాసు వెళ్లారు. ‘అప్పు చేసి పప్పు కూడు’ చిత్రంలో పెళ్లి కొడుకు వేషం వేశారు. అది నాన్నగారు నటించిన మొదటి సినిమా. ఆ తరవాత ఎల్. వి. ప్రసాద్ గారికి దగ్గర నెలవారీ జీతానికి పనిచేశారు. ఎక్కువ అవకాశాలు రాకపోవటంతో, మళ్లీ వెనక్కి వచ్చేద్దామనుకున్నారట. ఆ సమయంలో జె. వి. రమణమూర్తి సహాయపడ్డారట. పూజాఫలంలో నాన్న పెద్ద పాత్ర వేశారు. మళ్లీ సినిమాలలో ఇబ్బంది వచ్చి నాటకాలు వేయటం ప్రారంభించారు. పొట్టి ప్రసాద్ భార్య, కొడుకు, కోడలు, మనుమలు నిత్యం బంధుమిత్రులు.. చెన్నైలో నుంగంబాకంలో అద్దెకు ఉండేవాళ్లం. అమ్మ తరఫున చుట్టాలు ఎక్కువ. నాన్నగారు అందరితోనూ చాలా స్నేహంగా ఉండేవారు. అందువల్ల నాన్నగారికి స్నేహితులు ఎక్కువ. మా ఇంట్లో నిత్యం సంతర్పణ సాగేది. చిడతల అప్పారావు, అల్లు రామలింగయ్య, రావి కొండలరావు అందరూ భోజనానికి వచ్చేవారు. కొన్నాళ్ల తరవాత సాలగ్రామంలో స్థలం కొనుక్కున్నాం. మా పక్కనే సాక్షి రంగారావు గారు కూడా కొన్నారు. రెండు కుటుంబాల మధ్య గోడలు ఉండేవి కాదు. అంత కలసిమెలసి ఉండేవాళ్లం. నాన్నగారికి భక్తి ఎక్కువ. పండుగలు బాగా చేసేవారు. దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్లు ఉండేది. అంత వైభవంగా చేసేవారు. నాన్నగారు చాలా స్ట్రిక్ట్... నాన్నగారు నా చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. ఆయనలా నేను ఇబ్బందులు పడకూడదని, చదువును నిర్లక్ష్యం చేయకూడదని తాపత్రయపడ్డారు. తొమ్మిదో తరగతి దాకా నాకు చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు. పరీక్షల్లో ఫెయిలయ్యేవాడిని. పరీక్ష పేపర్లు ఇచ్చేరోజున నాకు చాలా దడగా ఉండేది. నా మార్కులు చూసి, నాన్నగారు కోపంగా, నా చేతిలో నుంచి పుస్తకాలు తీసుకుని విసిరేసేవారు. సెంట్రల్ సిలబస్ వల్ల చదవలేకపోతున్నానేమోనని, స్టేట్ సిలబస్ కోసం కేసరి స్కూల్లో చేర్పించారు. పదోతరగతి ఫస్ట్ క్లాసులో పాసయ్యాను. నాన్నగారు నమ్మలేదు. పదకొండు, పన్నెండు తరగతుల్లో కూడా మార్కులు బాగా వచ్చాయి. బి. కామ్ పూర్తి చేశాను. ఎం.కామ్ మధ్యలోనే ఆపేశాను. సినిమాలకు దూరంగా... నాన్నగారికి నేను సినిమా ఫీల్డ్‌లోకి రావటం ఇష్టం లేదు. మా ఇంటికి ఎవరైనా సినిమా వాళ్లు వచ్చినప్పుడు, నేను అక్కడ నిల్చుంటే కళ్లెర్రచేసేవారు. సంగీతమే ప్రాణం నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. కాని నాన్నగారికి ఇష్టం లేదు. ఒకసారి నాన్న తన స్నేహితులతో కలిసి మా ఇంటి హాల్లో కూర్చుని పాటలు వింటూ, నన్ను రూమ్‌లో కూర్చుని చదువుకోమన్నారు. నా దృష్టంతా సంగీతం మీదే ఉండటంతో, ఆయన మీద కోపంగా ఉండేది. ఒకసారి కీబోర్డు కొనిపెట్టమని నాన్నగారిని అడిగాను. ఆయన నో చెప్పారు. నేను మొండివాడిని కావటంతో, పేచీ పెట్టి, సాధించుకున్నాను. నా పద్ధతి చూసి, ‘నీకు కొడుకు పుడితేనే కాని, నేను ఎందుకు బాధ పడుతున్నానో నీకు తెలియదురా’ అనేవారు. కంపెనీ ఉద్యోగిగా.. నాన్నగారు నా కోసమని ఆయనకు తెలిసిన ఎం.ఎస్.మూర్తిగారి కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్లమంటే వెళ్లాను. అక్కడ వారు అడిగిన ప్రశ్నలకు చాలా తిక్కగా సమాధానాలు చెప్పాను. వాళ్లు పదిరోజుల తరవాత చెప్తామన్నారు. ఇంక రాదంతే అనుకున్నాను. కాని పిలుపు వచ్చింది. మొదటినెల జీతం వెయ్యి రూపాయలు వచ్చింది. నాన్నకు ఇస్తుంటే, ‘నాకెందుకు? నువ్వే జాగ్రత్తగా ఖర్చు చేసుకో’ అన్నారు. అయినా నాలో పెద్దగా మార్పు రాలేదు. ఉద్యోగం నుంచి ఇంటికి రాగానే సంగీత సాధనకు వెళ్లిపోయేవాడిని. ఒకరోజు... నాన్నకు ఒంట్లో బాగులేదని థమ్గారి ద్వారా కబురు వచ్చింది. ఇంటికి వచ్చి చూసేసరికి ఆయనకు స్ట్రోక్ రావటంతో, వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాను. నాన్నగారు ఇంట్లో ఉన్నప్పుడు చిన్న తువ్వాలు కట్టుకుని సింపుల్‌గా ఉండేవారు. ఆర్భాటంగా కనిపించటం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ఆయనకు విల్‌పవర్ ఎక్కువే. సిగరెట్ మానేయాలనుకున్నప్పుడు వెంటనే మానేశారు. దాని బదులు జర్దా అలవాటు చేసుకున్నారు. ఆ తరవాత అది మానేసి ముక్కుపొడుం మొదలుపెట్టారు. ఆ తరవాత అది కూడా మానేయాల నుకున్నారు. మానేశారు. నాన్నగారు ఉన్నన్ని రోజులు ఆయన మంచితనం తెలియలేదు. 1998 ఫిబ్రవరి 23న నాన్నగారు కన్నుమూశాక, ఆయన నా గురించి ఎందుకు బాధపడ్డారో అర్థమైంది. – కవిపురపు జగన్నాథరావు పదిరోజులు ఆసుపత్రిలో ఉన్నారు. గొంతు పాడైపోయింది. అప్పటికి నాన్నగారి చేతిలో ఐదారు సినిమాలున్నాయి. 400 సినిమాలకు డబ్బింగ్ చెప్పిన నాన్నగారు మాట్లాడలేకపోయేసరికి ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. రెండేళ్ల పాటు వైద్యం చేయించిన తరవాత నాన్నగారికి మాట వచ్చింది. కాని సినిమాలు తగ్గిపోయాయి. మళ్లీ 1998లో నాన్నగారు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. ఫిబ్రవరి 23న తన నవ్వులను దేవలోకంలో పూయించడానికి తరలి వెళ్లిపోయారు.నాన్నగారు పోయినప్పుడు గొల్లపూడి మారుతీరావుగారు, ‘పూర్ణానంద సత్రంలో పొట్టి ప్రసాద్ వేస్తున్న నాటకాన్ని, ఒక మామూలు సంచి భుజాన వేసుకుని, గేటు బయట నుంచి చూశాను. అప్పట్లో నాటకాలకు అంత ఆదరణ ఉండేది’ అని రాశారు. – సంభాషణ: డా. వైజయంతి పురాణపండ -
‘అభివృద్ధి నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’
సాక్షి, అమరావతి : గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేస్తానని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సవాల్ విసిరారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నేతలు అవినీతికి పాల్పడుతూ.. ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందని, అందువల్లే ప్రజలు తమకు అధికారాన్ని ఇచ్చారని అన్నారు. ప్రజాపాలనపై తమ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో గవర్నర్ ప్రసంగం ద్వారా తెలియజేశామన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, ఆదాయం తెచ్చే కొత్త మార్గాలను తమ ప్రభుత్వం అన్వేషిస్తోందన్నారు. అన్ని రంగాలను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకురానుండటం జగన్ తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయమని కోలగట్ల వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతం : వరప్రసాద్ పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని కొనియాడారు. దివంగత సీఎం వైఎస్సార్‌లా వైఎస్ జగన్ కూడా ప్రజలకు మంచి పాలన అందించాలని కోరారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్ల ద్వారా ప్రజల వద్దకు నేరుగా చేరడం అభినందనీయం అన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు చేసే అరాచకం ఒక ముఖ్యమంత్రికి తెలియకపోవడం దారుణమని విమర్శించారు. -
‘ఫ్లెమింగో ఫెస్టివల్ పేరిట దండుకుంటున్నారు’
-
‘ఫ్లెమింగో ఫెస్టివల్ పేరిట దండుకుంటున్నారు’
సాక్షి, నెల్లూరు : పులికాట్ సరస్సు వద్ద పక్షుల పండగ (ఫ్లెమింగో ఫెస్టివల్) పేరిట టీడీపీ నేతలు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ ఆరోపించారు. కమీషన్ల కోసమే ప్రతి ఏటా కోట్లాది రూపాయలను ఫ్లెమింగో ఫెస్టివల్ కోసం వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. అక్కడంతా టీడీపీ సొంత పండగలా ఉందని విమర్శించారు. ఫెస్టివల్‌కు సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు ఆహ్వానం పంపకపోవడం టీడీపీ నేతల దుర్నీతికి నిదర్శనమని చెప్పారు. సరస్సు ముఖద్వారాలలో పూడిక తీతపై సీఎం చంద్రబాబు, మంత్రులు హామీలు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఫెస్టివల్ పేరుతో మూడు రోజుల పాటు హడావుడి చేయడం మినహాయించి పర్యాటకులకు సదుపాయాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టూరిజం అభివృద్ధికి స్వదేశీ దర్శన్ కింద రూ.65 కోట్లను తీసుకొస్తే.. వాటిలో కూడా టీడీపీ నేతలు కమీషన్లు నొక్కేస్తున్నారని ఆరోపణలు చేశారు. -
హోదా కోసం పోరాడుతున్నది వైఎస్ జగన్ మాత్రమే
-
బీజేపీతో పొత్తు పెట్టుకుని అదే పార్టీని దూషిస్తున్నారు
-
టీడీపీ పాలనలో ఎక్కడచూసిన అవినీతే
-
చంద్రబాబు నాయుడు కాదు.. పీకే నాయుడు
సాక్షి, గుంటూరు : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటానికి అనర్హుడని వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ రావు వ్యాఖ్యానించారు. గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం, ప్రజల కోసం రాజీనామా చేసిన తృప్తి తనకుందని అన్నారు. చంద్రబాబు నాయుడు విభజన హామీలు సాధించలేని అసమర్థుడని విమర్శించారు. నాలుగేళ్లుగా చంద్రబాబుకు విభజన హామీలేవి గుర్తుకు రాలేదని అన్నారు. సీఎంగా ఉన్న ఇన్నేళ్ల కాలంలో చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. 10లక్షల ఉద్యోగాలు, 10లక్షల రేషన్ కార్డులను పీకేశారని మండిపడ్డారు. నాలుగేళ్లుగా కడప స్టీల్‌ప్లాంట్ చంద్రబాబుకు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు 60 ప్రభుత్వ సంస్థలను మూసేశారని, గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లు మూతపడుతున్నాయని అన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు కాదు.. పీకే నాయుడు అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పని వ్యక్తని అన్నారు. వైఎస్ జగన్ వస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాజీనామా చేయమంటే దొడ్డి దారిన పారిపోయారు గుంటూరు : టీడీపీ ఎంపీలను రాజీనామా చేయమంటే దొడ్డిదారిన పారిపోయారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిథి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన ఐదుగురు వైఎస్సార్ సీపీ ఎంపీలను ఆయన అభినందించారు. దేశ రాజకీయాలన్నీ వైఎస్సార్ సీపీ వైపు చూస్తున్నాయని తెలిపారు. వైఎస్సార్ సీపీ ట్రాప్‌లో టీడీపీ పడిందని లోక్‌సభలో మోదీ చెప్పారు.. హోదా సాధించే క్రమంలో వైఎస్సార్ సీపీ ఎందాకైనా పోరాతుందని ప్రధానీ మోదీ పరోక్షంగా ఒప్పుకున్నారని అన్నారు. టీడీపీ ఎంపీల వేషాలన్నీ అయిపోయాయని, వారి వేషాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ప్రత్యేక హోదా వైఎస్ జగన్‌తోనే సాధ్యమన్నారు. హోదా ఎజెండాతోనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఏపీని చంద్రబాబు దోపిడీ చేశారు గుంటూరు : ఈ నాలుగేళ్లు ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు దోపిడీ చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటికి హోదా పేరుతో చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామా చేశారని తెలిపారు. చంద్రబాబు తన ఎంపీలను ఏరోజు కూడా హోదా కోసం పోరాటం చేయమని చెప్పలేదన్నారు. అవిశ్వాసం పెడతామని.. మద్దతివ్వమన్నా చంద్రబాబు ఒప్పుకోలేదని చెప్పారు. మోదీ భయంతోనే.. వైఎస్ జగన్ చేసిన తీర్మానానికి మద్దతివ్వలేదని పేర్కొన్నారు. లక్షల కోట్ల అవినీతి నుంచి తప్పించుకునేందుకు హోదాను కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టుపెట్టారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ కోసం వైఎస్ జగన్ పోరాటం చేస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, మోదీలకు గుణపాఠం చెప్పాలన్నారు. -
కేంద్రంతో చంద్రబాబు లాలూచీ
-
ప్రత్యేక హోదాకోసం పోరాడేది వైఎస్ఆర్సీపీనే
సాక్షి, చిత్తూరు : వైఎస్ఆర్సీపీ ఒక్కటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తోందని ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకహోదా కోసం పోరాడుతామని, కేంద్రం నుంచి ప్రకటన రాకుంటే ఏప్రిల్ 6న రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రయోజనాలపై తెలుగుదేశానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే తమతోపాటు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలుగుదేశం ఎంపీలు ఏపీ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఊసరవెల్లిలా రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, ప్రస్తుతం బాబు మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని వరప్రసాద్ పేర్కొన్నారు. -
'నీరుగార్చి నీతులు చెబుతున్నారు'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ముస్సోరి పర్యటన ఎందుకోసం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ రావు ప్రశ్నించారు. అక్కడ ఐఏఎస్‌లకు ఏం శిక్షణ ఇస్తారని నిలదీశారు. కలెక్టర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసింది చంద్రబాబు కాదా అని మండిపడ్డారు. అధికారాలన్నీ జన్మభూమి కమిటీలకు ఇచ్చింది నిజంకాదా అన్నారు. మస్సోరికి వెళ్లి చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నారని, ఆయన ఓ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహిరస్తున్నారని చెప్పారు. పార్టీ నేతలు చెప్పినట్లు వినాలని అధికారులను భయపెడుతున్నారని మండిపడ్డారు. వ్యవస్థలు నీరుగార్చిన చంద్రబాబు ఇప్పుడు నీతులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. -
దళితులను ఆదరించింది వైఎస్ కుటుంబమే
తిరుపతి ఎంపీ వరప్రసాదరావు నెల్లూరు: ‘‘దళితులను వైఎస్ కుటుంబం ఆదరించినంతగా మరే కుటుంబం, ఏ పార్టీ కూడా ఆదరించి అక్కున చేర్చుకోలేదు. దళితులకు వైఎస్సార్సీపీలో ఉన్నంత స్వేచ్ఛ ఏ పార్టీలోనూ లేదు. అంతెందుకు ప్రాంతీయ పార్టీల్లో దళితులను మాట్లాడనివ్వడమే గగనం. అలాం టిది అనేకమంది దళిత నేతలకు ఉన్నత పదవులు కట్టబెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదే’’ అని తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాదరావు అన్నారు. చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామితో కలిసి ఆయన ఆదివారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ కుటుంబం జూపూడి ప్రభాకరరావుకు ఇచ్చినంత ప్రాధాన్యం మరెవరికీ ఇవ్వలేదన్నారు. నాడు వైఎస్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి అప్పగించారని గుర్తు చేశారు. తాజాగా వైఎస్ జగన్ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారన్నారు. జూపూడి ఓటమికి పార్టీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డిని నిందించడం సరికాదన్నారు. సుబ్బారెడ్డి సొంతపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమిని కోరుకుంటారనడం సరికాదన్నారు. ఓటమి బాధలో జూపూడి కీలక నేతలను నిందించడం సరికాదన్నారు. -
వర‘ప్రసాదమే’
తిరుపతిలో ప్రాభవం చూపలేని కమలం ఎంపీ స్థానాన్ని విస్మరించిన టీడీపీ ఓటు మీఇష్టం అంటున్న తెలుగుతమ్ముళ్లు చిత్తయిన టీడీపీ, బీజేపీ పొత్తు రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో కుదరని సఖ్యత సాక్షి ప్రతినిధి, నెల్లూరు : తిరుపతి లోక్‌సభ స్థానం ఎన్నిక విషయం గురించి తెలుగుదేశం పార్టీ నేతలు మరచిపోయారు. ఈ లోక్‌సభ పరిధిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న వారు బీజేపీ పేరెత్తాలంటేనే హడలిపోతున్నారు. తమ నోటి వెంట ఆ మాట వస్తే ముస్లిం మైనారిటీ ఓట్లు వచ్చేవి కూడా పోతాయనే భయం పట్టుకుంది. ఎమ్మెల్యే ఓటు తమకు వేయాలని, ఎంపీ ఓటు మీ ఇష్టం అంటూ తెలుగు తమ్ముళ్లు ప్రచారం ప్రారంభించారు. రెండు పార్టీల నేతలు కలసి ప్రచారం చేయడానికి కూడా ఇష్టపడటంలేదు. క్షేత్ర స్థాయిలో ఈ రెండు పార్టీల శ్రేణుల మధ్య సఖ్యత కుదరక పోవడంతో పొత్తు చిత్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనిస్తున్నాయి. రెండు పార్టీల అగ్రనాయకులు ప్రచార సభలకు వచ్చిన సమయంలో ఈ రెండు పార్టీల నేతలు, శ్రేణులు తమ జెండాలతో హాజరవుతున్నారు. ముఖ్య నేతలు వెళ్లిపోయిన మరుక్షణం నుంచే ఎవరికి వారే యమునా తీరే అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామం వైఎస్సార్ సీపీకి తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు, ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావుకు కలిసొస్తోంది. సర్వేపల్లి : ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రెండేళ్లుగా ప్రతి ఇంటి గడప ఎక్కి దిగారు. ఓటర్లను వ్యక్తిగతంగా కలవడం, వారిని ఓటు అభ్యర్థించడం, ఎన్నికల ప్రచారం విషయాల్లో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కాకాణి సమీపానికి కూడా రాలేక పోతున్నారు. సోమిరెడ్డి అయిష్టంగా ఇక్కడి నుంచి పోటీకి దిగారనే విషయం గ్రహించిన ఓటర్లు ఆయన్ను కూడా ఆదరించే అవకాశాలే కనిపించడం లేదు. దీంతో సోమిరెడ్డి తన సంగతి తాను చూసుకుని గట్టెక్కితే చాలనుకుంటూ ఎంపీ ఓటు గురించి అడిగే ధైర్యం చేయలేక పోతున్నారు. బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు స్వగ్రామం ఈ నియోజక వర్గంలోనే ఉన్నా ఆ పార్టీ బలం మాత్రం నామమాత్రమే. ఇక్కడ టీడీపీ, బీజేపీ శ్రేణులు కలసి ప్రచారం కూడా చేయలేక పోతున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. గూడూరు: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోత్స్నలతకు ఆ పార్టీ శ్రేణుల నుంచి మనస్ఫూర్తిగా సహకారం అందడంలేదు. మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి చంద్రబాబు జోక్యం తో తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే జ్యోత్స్న గెలిస్తే ఇక తమ ఆధిపత్యం లేకుండా పోతుందనే భయంతో బల్లి వర్గం జ్యోత్స్నకు ఎదురు పోట్లు పొడుస్తోంది. ఇక్కక కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి పనబాక లక్ష్మి భర్త కృష్ణయ్య నామమాత్రంగానే పోటీలో ఉన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి పాశం సునీల్‌కుమార్‌తో పాటు పార్టీ విజయం కోసం సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి తీవ్రంగా కష్టపడుతున్నారు. ఆయనతో పాటు నేదురుమల్లి పద్మనాభరెడ్డి ఇతర ముఖ్య నేతలు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం ఉరకలెత్తిస్తున్నారు. ఇక్కడ టీడీపీ లోనే అనేక గొడవలు ఉన్నందువల్ల బీజేపీ కేడర్‌తో వారు కలసి పనిచేసేందుకు ఇష్టపడటం లేదు. వెంకటగిరి : తాజా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి రామకృష్ణకు ఏటికి ఎదురీదే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన తానెలా గట్టెక్కాలనే దిశగానే ఓటర్లను కలుస్తున్నారు. ఎంపీ అభ్యర్థి గురించి పట్టించుకునే ఆలోచన, తీరిక ఆయనకు కనిపించడం లేదు. దీంతో ఈ రెండు పార్టీల శ్రేణులు ఎవరికి వారే ప్రచారం చేసుకుంటూ వారి ఓటు మాత్రమే అడుగుతున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్య నాయుడు రెండు ఓట్లు ఫ్యాన్‌కు వేయాలని జనంలోకి దూసుకుపోతున్నారు. సూళ్లూరుపేట : టీడీపీ అభ్యర్థి పరసారత్నం తాను గెలిస్తే చాలనే విధంగా సైకిల్‌కు ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీకి చెప్పుకోదగ్గ కార్యకర్తలు కూడా లేకపోవడంతో ప్రచారంలో ఎంపీ ఓటు గురించి ప్రస్తావనే రావడంలేదు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్యతో పాటు పార్టీ నేతలు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. సత్యవేడు : టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య ఇప్పటి దాకా బీజేపీ కేడర్‌తో కలసి ప్రచారం చేయలేదు. ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ కేడర్ కూడా తక్కువ కావడంతో బీజేపీ గురించి పట్టించుకోకుండా తన ఓటు మాత్రమే అడుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలంతో పాటు పార్టీ నేతలు ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేయాలని ఓటర్లను కోరుతూ ప్రచారం చేస్తున్నారు. శ్రీకాళహస్తి : టీడీపీ తరఫున బరిలో ఉన్న మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బీజేపీ ఊసే ఎత్తడం లేదు. ఆ పేరెత్తితే ముస్లింల ఓట్లు పోతాయని ఆయన చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కండ్రిగ ఉమను సైతం తన వెంట ప్రచారానికి తీసుకువెళ్లేందుకు ఆయన ఇష్టపడటం లేదు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డి రెండు ఓట్లూ ఫ్యాన్‌కు వేయాలని జనాన్ని అభ్యర్థిస్తున్నారు. తిరుపతి : టీడీపీ అభ్యర్థి వెంకటరమణ మీద ఇక్కడ బీజేపీ నాయకులు గతంలో అవినీతి పోరాటం చేశారు. ఆయన భూ కబ్జాదారుడని బహిరంగ ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తితో కలసి ప్రచారం చేయడానికి బీజేపీ నేతలు భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీని వాస్, చంద్రారెడ్డి, శాంతారెడ్డి ఇష్టపడటం లేదు. దీంతో బీజేపీ నేతలు తమ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఓటేయాలని వేరుగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి వెంకటరమణ కూడా బీజేపీతో కలిసి ప్రచారం చేస్తే తనకు దెబ్బ తగులుతుందనే ఆలోచనతో వేరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.