సాక్షి, నెల్లూరు : పులికాట్ సరస్సు వద్ద పక్షుల పండగ (ఫ్లెమింగో ఫెస్టివల్) పేరిట టీడీపీ నేతలు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ ఆరోపించారు. కమీషన్ల కోసమే ప్రతి ఏటా కోట్లాది రూపాయలను ఫ్లెమింగో ఫెస్టివల్ కోసం వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. అక్కడంతా టీడీపీ సొంత పండగలా ఉందని విమర్శించారు. ఫెస్టివల్‌కు సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు ఆహ్వానం పంపకపోవడం టీడీపీ నేతల దుర్నీతికి నిదర్శనమని చెప్పారు.
సరస్సు ముఖద్వారాలలో పూడిక తీతపై సీఎం చంద్రబాబు, మంత్రులు హామీలు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఫెస్టివల్ పేరుతో మూడు రోజుల పాటు హడావుడి చేయడం మినహాయించి పర్యాటకులకు సదుపాయాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టూరిజం అభివృద్ధికి స్వదేశీ దర్శన్ కింద రూ.65 కోట్లను తీసుకొస్తే.. వాటిలో కూడా టీడీపీ నేతలు కమీషన్లు నొక్కేస్తున్నారని ఆరోపణలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment