కడియం : అంతెత్తున ఎక్కడో ఎగురుతూ, చిన్నగా కనిపించే విమానం ఇంకొంచెం కింద నుంచి వెళితే స్పష్టంగా చూడాలని పిల్లలే కాదు.. చాలామంది పెద్దలూ ఉబలాటపడతారు. ముఖ్యంగా విమానాల రాకపోకలకు అవకాశంలోని ప్రాంతాల్లోని పల్లెళ్లో ఈ ముచ్చట ఎక్కువగా ఉంటుంది. మండలంలోని దుళ్ల, మురమండ గ్రామాలకు చెందిన వారికీ ఆ సరదా ఉంటుంది. వారు ఆశించినట్టు ఓ బుల్లి విమానం బుధవారం ఉదయం 9 గంటల సమయంలో చెవులు గింగురుమనేలా పెనుశబ్దం చేసుకుంటూ, ఆ గ్రామాల మీదుగా బాగా తక్కువ ఎత్తు నుంచి ప్రయూణించింది. అది ఎంత దిగువకు వచ్చిందంటే.. ఎత్తై చెట్ల కొమ్మలు దానికి తగులుకుంటాయేమో అనేంతగా! దీంతో.. ‘ఓరి బాబోయ్! ఇది ఏదో ప్రమాదానికి గురైన విమానంలా ఉంది. ఇప్పుడేమవుతుందో, ఏమోనని హడలిపోయూరు.
చివరికి అది అలాఅలా పైకి దూసుకుపోయి, కనుమరుగైంది. చాలామందికి ఆ విమానంలో సాంకేతికపరమైన లోపం వచ్చి కింద నుంచి ప్రయూణించిందేమో, తమ ప్రాంతం దాటాక ఏదైనా ప్రమాదం జరిగిందేమో అన్న అనుమానం రేకెత్తింది. కొందరు మధురపూడి విమానాశ్రయూనికి ఫోన్ చేసి తాము చూసిన దాన్ని చెప్పి, ఏం జరిగిందని ఆరా తీశారు. అయితే విమానాశ్రయూనికి వచ్చి, పోయే విమానాలన్నీ ఎంచక్కా ప్రయూణించాయని అక్కడి సిబ్బంది చెప్పారు. ఏదైమైనా సాయంత్రం వరకూ విమానం గురించి ‘అక్కడ కూలింది’ అంటే ‘కాదు.. మరో చోట’ అంటూ పుకార్లు షికారు చేశాయి. కాగా విమానాన్ని చూసి వారిలో కొందరు అది నేవీకి చెందినదని చెప్పారు.
కలకలం రేపిన విమానం
Published Thu, May 7 2015 1:57 AM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM
Advertisement
Advertisement