స్వార్థ రాజకీయం కోసమే విభజన
Published Thu, Oct 17 2013 4:02 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
చీపురుపల్లి, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయ కోసమే రాష్ట్ర విభజనకు పాల్పడిందని వైఎస్సార్ సీపీ చీపురుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త శనపతి శిమ్మినాయుడు అన్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా ఆ పార్టీ నాయకులు స్థానిక మూడు రోడ్ల జంక్షన్ వద్ద చేపట్టిన రిలే దీక్షా శిబిరంలో బుధవారం ఆయన మాట్లాడారు. విభజనను అడ్డుకోవాల్సిన టీడీపీ నేత చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలోని 13 జిల్లాలు ఎడారిగా మారుతాయని చెప్పారు.
కాగా శిబిరంలో మెరకముడిదాం మండలంలోని యాడిక గ్రామానికి చెందిన పిన్నింటి అసిరినాయుడు, కంచుపల్లి అప్పల నాయుడు, రెడ్డి సత్యనారాయణ, సీహెచ్ తవిటినాయుడు, యడ్ల అప్పలనాయుడు కూర్చున్నారు. వారికి పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు తుమ్మగంటి సూరినాయుడు, పార్టీ నాయకులు ఇప్పిలి నీలకంఠం, మీసాల అప్పలనాయుడు, బలగ సూరిబాబు, అడ్డాల రామచంద్రరాజు, న్యాయవాది కొ ణిశ త్రినాథ్‌రావు సంఘీభావం తెలిపారు.
ఎన్‌జీఓల వినూత్న నిరసన
బెలగాం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పట్టణంలోని ఏపీ ఎన్‌జీఓలు బుధవారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఆర్‌టీసీ కాంప్లెక్స్ వద్ద కేంద్రమంత్రుల ప్లెక్సీలను నలుపు రంగుతో దిద్ది నిరసన తెలిపారు. ఈ సం దర్భంగా ఎన్‌జీఓ నేతలు మాట్లాడుతూ సీమాంధ్రలోని ఎంపీలు, మంత్రులు తక్షణమే పదవులకు రాజీనామా చేసి, ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జీఓ పార్వతీ పురం డివిజన్ అధ్యక్షుడు గంజి లక్ష్మీనాయుడు, జీవీఆర్‌ఎస్ కిశోర్, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు జి. శ్రీరామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు. కోర్టు జంక్షన్ వద్ద బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు ప్రధాన రహదారిలో కేంద్ర మంత్రుల ప్లెక్సీలను బైక్‌లతో తొక్కి, నిరసన తెలిపారు.
సమైక్యాంధ్రే వైఎస్సార్ సీపీ లక్ష్యం
పార్వతీపురం, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే వైఎస్సార్ సీపీ లక్ష్యమని ఆ పార్టీ నియోజకవర్గ సమ న్వయకర్తలు జమ్మాన ప్రసన్నకుమార్, గర్భాపు ఉదయభాను అన్నారు. బుధవారం సమైక్యాంధ్రకు మద్దతుగా ఆ పార్టీ నాయకులు పట్టణంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త మ పార్టీ మొదటి నుంచీ సమైక్యాంధ్రకు మద్దతు ఇస్తుందన్నారు. కాంగ్రెస్, టీడీపీ తీరు వల్లే రాష్ట్ర విభజన అనివార్యమైంద ని తెలిపారు. కోట్లాది మంది ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలను ఉద్ధృతం చేస్తా మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీనీ పట్టణ కన్వీనర్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, మండల కన్వీనర్ చుక్క లక్ష్ము నాయుడు, పట్టణ కో కన్వీనర్ ఆర్‌వీఎస్ కుమార్, యువజన విభా గం కన్వీనర్లు మజ్జి వెంకటేష్, చందాన శి వాజీ, నాయకులు బీఎం దాసు, డి. నాగరాజు, హరియాల ఆనందరావు, మంత్రి రవికుమార్, జి. కన్నంనాయుడు, పి. జయంతి, మాలూరు గంగమ్మ, ఎస్. శ్రీ నివాసరావు, జి. పకీరు, డి. సోకు, చుక్క పోలినాయుడు, పాల్గొన్నారు.
Advertisement