చీరాల: ప్రేమపేరుతో ఓ మైనర్ బాలికను వలలో వేసుకుని ఆమెతో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలను కెమెరాలో రహస్యంగా చిత్రీకరించి వాటిని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయడంతో పాటు, స్నేహితుల సెల్‌ఫోన్లకు పంపిన మాజీ కౌన్సిలర్ పుత్రరత్నం పైశాచికత్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా వేటపాలెం మండలంలోని గ్రామం నుంచి ఓ కుటుంబం పిల్లల చదువు నిమిత్తం చీరాల పట్టణానికి వచ్చి స్థిరపడింది.
ఆ కుటుంబంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలిక(17)పై కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ మూడో కుమారుడు జునైద్(25) కన్నుపడింది. ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలను రహస్యంగా వీడియో చిత్రీకరించి ఇంటర్నెట్‌లో పెట్టడంతో పాటు, స్నేహితుల సెల్‌ఫోన్లకు సైతం పంపిచాడు.
ఈ దారుణం జరిగి నెల రోజులు దాటింది. బాలిక తండ్రికి విషయం తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. చీరాల వన్‌టౌన్ పోలీసులు ఆ మృగాడిపై కేసు నమోదు చేశారు. నిందితుడు జునైద్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. వన్‌టౌన్ సీఐ భీమానాయక్ మాట్లాడుతూ నిందితుడిపై నిర్భయ చట్టం, అత్యాచారం, సైబర్ నేరం కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
ప్రేమపేరుతో పైశాచికత్వం
Published Sun, Apr 20 2014 8:33 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement
Advertisement