ప్రకాశం: ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే రాంబాబుకు బుధవారం రాత్రి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన వెళుతున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనం ఢీకొట్టినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో రాంబాబుతోపాటు మరో ఇద్దరికి స్వల్పగాయాలు అయ్యాయి.
ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని కొనకలమెట్ల మండలం పాతపాడు వద్ద చోటుచేసుకుంది. గాయపడిని వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మాజీ ఎమ్మెల్యే రాంబాబుకు తప్పిన ప్రమాదం
Published Wed, Jul 1 2015 10:04 PM | Last Updated on Wed, Oct 3 2018 7:38 PM
Advertisement
Advertisement