మహబూబ్‌నగర్ వ్యవసాయం, న్యూస్‌లైన్: అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శ ని..అనే చందంగా మారింది రైతుల ప రిస్థితి. వ్యవసాయానికి బడ్జెట్‌లో కోట్ల రూపాయలు కేటాయించినా..సక్రమంగా వినియోగించకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. నూనె గింజలు, మొక్కజొన్న పంటల ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం తో 2004-05లో సమగ్ర నూనెగింజలు, పప్పుధాన్యల పామాయిల్ మరియు మొ క్కజొన్న అభివృద్ధి పథకాన్ని మనరాష్ట్రం లో ప్రారంభించారు. ఈ పథకం అమలు కు 75శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం, 25శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భ రిస్తుంది.
అందులో భాగంగానే చిన్నసన్నకారు రైతులకు 50శాతం సబ్సిడీతో స్ప్రిం క్లర్ ఇరిగేషన్ విధానం, నీటి సరఫరా పై పులను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జి ల్లాలో వేరుశనగ రైతులకు ఈ పథకం కిం ద 2011-12లో ఏడువేల యూనిట్లకు పైగా పంపిణీ చేయగా 2012-2013లో రెండువేల యూనిట్లను తగ్గించి ఐదువేల యూనిట్లకు పైగా స్ప్రింకర్లను పంపిణీ చే శారు. కాగా, ప్రభుత్వం మరోఅడుగు ముందుకేసి ఈ ఏడాది రెండువేల యూ నిట్లకు కోత విధించింది. కాగా, ఈ ఏడా ది రబీ సీజన్ దగ్గర పడుతున్నా కొద్దీ ఇ ప్పటివరకు స్ప్రింక్లర్లు పంపిణీచేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నా రు.
అంతేకాకుండా వేరుశనగ ఒక హెక్టర్ స్ప్రింక్లర్ యూనిట్‌కు గతేడాది 30 పైపు లు ఇవ్వగా ఈ ఏడాది 25 పైపులు ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చె బుతున్నారు. ఒక హెక్టార్‌లోపు సాగుచేసే రైతులకు ఎనిమిది రకాల వస్తువులను రూ.14,804 పూర్తిధర కాగా రూ.7402 50 శాతం సబ్సిడీ పోను రైతులు రూ. 7402 భరించాల్సి ఉంటుంది. కాగా ఐదుశాతం వ్యాట్ రూ.740 కలుపుకుని మొ త్తం రూ.8142 రైతులను భరించాల్సి ఉం టుంది. రెండు హెక్టార్లలోపు సాగుచేసిన రైతులు రూ.9652 చెల్లించాల్సి ఉంటుంది.
సాగునీటిపైపుల పరిస్థితి అదేతీరు
వేరుశనగ పంటను రెండు హెక్టర్ల లోపు సాగుచేసిన రైతులు సాగునీటి పైపుల 75 ఎంఎం రకం పూర్తి ధర రూ.13,631 కా గా అందులో 50శాతం రూ.6816 సబ్సిడిపోను రైతులు రూ.6816తో పాటు రూ. 682 ఐదు శాతం వ్యాట్‌ను కలుపుకుని రూ.7498 భరించాల్సి ఉంటుంది. 90 ఎంఎం రకం పైపులు కావాల్సిన రైతులు రూ.7928 చెల్లించాల్సి ఉంటుంది. అదేవి ధంగా రెండు హెక్టార్లు సాగుచేసిన రైతు లు 75ఎంఎం రకం పైపులకు రూ.8656, అలాగే 90ఎంఎం రకం పైపులకు రూ.10,860 చెల్లించాల్సి ఉంటుంది.
డిమాండ్ ఎక్కువ.. పంపిణీ తక్కువ
జిల్లాలో స్ప్రింక్లర్లు, సాగునీటి పైపులకు రైతుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. అయితే అందుకు తగినట్టుగా పైపులను పంపిణీచేయకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మండలానికి 250పైగా దరఖాస్తులు వస్తుంటాయని, కానీ ప్రభుత్వం మాత్రం మండలానికి 50 యునిట్ల చొప్పున కూడా మంజూరు చేయకపోవడంతో ఇబ్బందికరంగా మారిందని వ్యవసాయశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. జిల్లాకు 3175 యూనిట్లు జిల్లాకు సరిపోయే పరిస్థితి లేదన్నారు. జిల్లాలో గతేడాది ఎనిమిది వేలకు పైగా దరఖాస్తులు రాగా, ఐదువేల యూనిట్లను మాత్రమే పంపిణీచేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. కాగా, ఈ సారి 12వేల దరఖాస్తులకు పైగా వచ్చే అవకాశం ఉంది.
కంపెనీలు ముందుకు రావడం లేదు
ప్రభుత్వం నిర్ణయించిన ధర సరిపోవడం లేదని కంపెనీలు స్ప్రింక్లర్లు, పైపులను పంపిణీ చేసేందుకు ముందుకురావడం లేదు. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడంతో కొద్దిరోజులు ఆగే పరిస్థితి ఏర్పడింది. జిల్లాకు మంజూరైన 3175 వేరుశనగ స్ప్రింక్లర్ యూనిట్లు సరిపోయే పరిస్థితి లేని విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తా.
- రామరాజు, వ్యవసాయశాఖ జేడీఏ
‘ స్ప్రింక్లర్’పై సన్నగిల్లిన ఆశలు
Published Fri, Sep 27 2013 3:57 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement