రైతులను భయపెడితే ఖబడ్దార్ | 2013 should be compensated according to the law | Sakshi
Sakshi News home page

రైతులను భయపెడితే ఖబడ్దార్

Published Thu, Jun 30 2016 4:22 AM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM

రైతులను భయపెడితే  ఖబడ్దార్ - Sakshi

రైతులను భయపెడితే ఖబడ్దార్

2013చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి
బ్రొకర్లలా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్ నాయకులు
►  కర్వెన సభలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ,దామోదర రాజనర్సింహ

 
 
భూత్పూరు : ప్రాజెక్టుల పేరుతో రైతులను మోసగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రైతులను పోలీసుల చేత బెదిరింపులకు గురిచేస్తూ భూములను ఆక్రమించుకుంటున్నారని  పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కురిముర్తిరాయ రిజర్వాయర్ ముంపు రైతులకు న్యాయం చేయాలని మండలంలోని కర్వెనలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భరోసా యాత్రలో వారు ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడారు.

రైతులు తమకు న్యాయం జరగాలని కోరుకుంటుంటే వారిని పోలీసులు చేత బెదిరించి భయాందోళనకు గురిచేస్తున్నారని, రైతులకు జోలికి వస్తే ఖబడ్దార్ నఅని హెచ్చరించారు.రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భూమికి బదులుగా భూమి, ముంపునకు గురవుతున్న ఇళ్ల స్థానంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, ముంపు బాధితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాటలకే పరిమితమైందని విమర్శించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు బ్రోకర్ల వ్యవహరిస్తూ తమ నాయకుల మెప్పు పొందేందుకు భూములను లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు ప్రాజెక్టులో ఆంధ్ర కాంట్రాక్టర్లకు పెద్దపీట వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినందుకే ఆయన రైతులను పోలీసుల చేత రైతులను భయంబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.

రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ పోరాడుతుందని  రైతులకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, నాయకులు నర్సింహరెడ్డి, హర్యానాయక్, సర్పంచ్ సునీత   పాల్గొన్నారు.
 
 
ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం లూటీ
 
మహబూబ్‌నగర్ అర్బన్ :  పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడానికి ఇష్టం లేని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల పేరుతో ప్రజా ధనాన్ని లూటీ చేస్తుందని  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.  జిల్లాకేంద్రంలో  నిర్వహించిన మాజీ ఎంపీ విఠల్‌రావు సం స్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడా రు.  ప్రాజెక్టులకు తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. మిషన్ కాకతీయ పనులను 20 శాతం లెస్‌కు కాంట్రాక్ట ర్లు పని చేస్తున్నారని ఇరిగే షన్ మంత్రి అసెంబ్లీ లో గొప్పలు చెప్పారన్నారు. కానీ సాగు, తాగునీటి ప్రాజెక్టు పనులను ఎక్సెస్ రేట్లకు ఎందుకు కట్టబెడుతున్నారని, వీటి టెండర్ ప్రక్రియలో రూ.వేల కోట్లలో అవకతవలు జరిగాయన్నారు.

ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కోవడం సరికాదని, 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేయాలని డిమాండ్ చేశారు.  పులిచింతల ప్రాజెక్టు విషయంలో తనను అప్రతిష్ట పాల్జేస్తున్నారని, కాని దేశంలోనే ఆదర్శంగా ఆ పనులను చేట్టామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement