మహబూబ్‌నగర్ క్రీడలు : తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన ఒలింపిక్ సంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయింది.
తెలంగా ణ రాష్ట్ర సంఘానికి జితేందర్‌రెడ్డి ఎంపికయ్యారు. జితేందర్‌రెడ్డికి జాతీయ, రాష్ట్రస్థాయిల్లో కూడా వివిధ క్రీడా సంఘాల్లో మంచి పట్టుఉంది. రాష్ట్ర ఒలింపిక్ సం ఘం అధ్యక్షుడిగా ఆయనకు రాష్ట్రంలోని ప లు క్రీడాసంఘాలు మద్దతు తెలిపినట్లు స మాచారం. ప్రస్తుతం ఆయన ఆలిండియా సాఫ్ట్‌బాల్ సంఘానికి ఉపాధ్యక్షుడు, రాష్ట్ర సంఘానికి జితేందర్ రెడ్డి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. జిల్లా సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు.
పలు క్రీడాసంఘాల సన్మానం
ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎంపికైన జితేందర్‌రెడ్డిని జిల్లాకు చెందిన పలు క్రీడాసంఘాల ప్రతినిధులు సన్మానించా రు. రాష్ట్ర త్రోబాల్ సంఘం ఉపాధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, జిల్లా ఈత సం ఘం కార్యదర్శి పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తె లిపారు. ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్‌రెడ్డి ఎంపికతో రాష్ట్రంతోపాటు జిల్లాలో క్రీడాభివృద్ధి జరుగుతుందని అన్నారు.
ఒలింపిక్ సంఘం సారథిగా ఎంపీ జితేందర్‌రెడ్డి
Published Mon, Apr 20 2015 2:36 AM | Last Updated on Thu, Mar 28 2019 5:34 PM
Advertisement