olympic association
-
జాతీయ స్థాయిలో ఏపీ పరువు గోవింద!
విజయవాడ స్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ (ఏపీవోఏ), ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏఏపీ–శాప్) మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు క్రీడాకారుల పాలిట శాపంగా మారాయి. వెరసి రాష్ట్ర క్రీడాకారులకు 38వ జాతీయ క్రీడలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రడూన్‌లో ప్రారంభమైన ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహించేందుకు వెళ్లిన క్రీడాకారులు, కోచ్, మేనేజర్లు పడరాని పాట్లు పడుతున్నారు. ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 21 క్రీడాంశాలు అర్హత సాధించాయి.వీటిల్లో ఆర్చరీ, అథ్లెటిక్స్, జూడో, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, మోడ్రన్ పెంటాథ్లాన్, షూటింగ్, కానోయింగ్ కాయాకింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, ఉషు, మాల్కాంబ్ జట్లు శాప్ ద్వారా వెళ్లాయి. ఈ జట్లకు ట్రాక్షూట్లు, షూ, టీఏ, డీఏ, కిట్, కోచింగ్ క్యాంపులకు నగదును శాప్ సమకూర్చింది. మిగిలిన ట్రైథ్లాన్, యోగాసన, సైక్లింగ్, బీచ్ హ్యాండ్‌బాల్ జట్లు ఏపీవోఏ ద్వారా వెళ్లాయి. ఈ జట్లకు ఏపీవోఏ అధ్యక్షుడు ఆర్.కె.పురుషోత్తం ట్రాక్‌షూట్, షూ సమకూర్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న జరిగిన మార్చ్ఫాస్ట్లో రాష్ట్రం నుంచి 20 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.వీరిలో కొందరు ధరించిన ట్రాక్ షూట్లలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, శాప్ లోగో లేకపోవడం నిర్వాహకులు, జాతీయ మీడియాను ఆశ్చర్యానికి గురి చేసింది. ర్యాలీలోనూ ఏపీవోఏ ప్రతినిధులు కేవలం ఏపీవోఏ పేరుతో ఉన్న ఫ్లకార్డులు, బ్యానర్లనే మైదానంలో ప్రదర్శించారు. ఇదిలా ఉండగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) నిర్వహించే ఈ క్రీడల్లో రాష్ట్ర క్రీడాకారుల వసతి సౌకర్యాలు ఏపీవోఏ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర క్రీడాకారులకు ఐవోఏ కేటాయించిన గదుల్లోకి శాప్ ఆధ్వర్యంలో వెళ్లిన క్రీడాకారులు, మేనేజర్, కోచ్‌లను ఏపీవోఏ కొన్ని గంటల పాటు అనుమతించక పోవడం కలకలం రేపింది. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోరా?హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ రాష్ట్ర క్రీడాకారులను ఆర్.కె.పురుషోత్తం ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. 21 క్రీడలకు సంబంధించిన క్రీడాకారులకు ట్రాక్‌షూట్, షూ, టీఏ, డీఏ, కిట్ సమకూర్చేందుకు శాప్ రూ.75 లక్షలను సిద్ధంగా ఉంచినా, రాష్ట్ర పరువు గంగలో కలవడం బాధాకరం. – యలమంచిలి శ్రీకాంత్, ఏపీ కబడ్డీ సంఘం రాష్ట్ర కార్యదర్శి -
ఒలింపిక్ అధ్యక్షుడిగా జయేష్ రంజన్ గెలుపు
-
మళ్లీ ఒడిశాలోనే 2023 ప్రపంచ కప్ హాకీ
భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌కు మళ్లీ తామే ఆతిథ్యమిస్తామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. 2023లో జరిగే పురుషుల ప్రపంచకప్ పోటీలను భువనేశ్వర్, రూర్కేలా నగరాల్లో నిర్వహిస్తామని బుధవారం ఆయన వెల్లడించారు. గతేడాది కూడా హాకీ మెగా ఈవెంట్‌కు భువనేశ్వరే ఆతిథ్యమిచ్చింది. ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వరుసగా రెండోసారి కూడా భారత్‌కే నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. 2023లో జనవరి 13 నుంచి 29 వరకు హాకీ పోటీలు జరుగుతాయి. బుధవారం కళింగ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ‘మేం 2018 ప్రపంచకప్ హాకీని నిర్వహించాం. అలాగే వచ్చే మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తాం’ అని ప్రకటించారు. ఈ సమావేశంలో ఎఫ్ఐహెచ్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా, హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు మహ్మద్ ముస్తాక్ అహ్మద్ పాల్గొన్నారు. -
ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపిక
-
ఏపీ ఒలింపిక్ నూతన కార్యవర్గ ఏర్పాటు
సాక్షి, విజయవాడ : ఆంద్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఆదివారం ఏర్పాటైంది. చైర్మన్‌గా ఎంపీ విజయసాయిరెడ్డి, అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, ప్రదాన కార్యదర్శిగా పురుషోత్తం ఎన్నికయ్యారు. వారితో పాటు 8 కమిటీలను, పలు అనుబంధ కమిటిలను ఏర్పాటు చేస్తున్నట్టు అసోషియేషన్ ఎన్నిక కమిటీ ప్రకటించింది. ఏపీఓఏ అధ్యక్షుడిగా నియమితుడైన ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేగా కంటే క్రీడాకారుడుగా చెప్పుకోవడమే నాకు ఇష్టం. నిజాయితీగా పనిచేసే వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చింది. క్రీడల అభివృద్ధికి పని పాటుపడాల్సి ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు క్రీడాభివృద్దికి కృషి చేస్తాను. సీఎం జగన్మోహన్ రెడ్డి, చైర్మన్ విజయసాయిరెడ్డి క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. క్రీడాభివృద్ధిలో భాగంగా మిగతా గొడవలు పట్టించు కోవద్దు. సీఎం జగన్ నాయకత్వంలో కలిసికట్టుగా పనిచేస్తాం’ అన్నారు. ‘హైదరాబాద్‌లో ఉన్న ఒలింపిక్ భవన్ కబ్జాలో ఉంది. ఆ సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేస్తాం. చైర్మన్ విజయసాయిరెడ్డి త్వరలో గుంటూరులో ఏపీ ఒలింపిక్ భవన్ నిర్మాణం చేపడతామని హమీ ఇచ్చారు. సరిపడా కోచ్‌లను కూడా నియమిస్తాం. క్రీడా సంస్కృతిని పెంపొందించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో క్రీడలపరంగా ఏపీని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతాం’అని ప్రదాన కార్యదర్శిగా పురుషోత్తం అన్నారు. -
చీరకు చెల్లుచీటీ...
న్యూఢిల్లీ: సంప్రదాయానికంటే మహిళా అథ్లెట్ల సౌకర్యానికే భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) జై కొట్టింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో ఏప్రిల్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభ వేడుకలో భారత బృందంలోని మహిళలు చీరలకు బదులు బ్లేజర్స్, ట్రౌజర్స్‌ను ధరించేందుకు ఐఓఏ అనుమతించింది. క్రీడాకారిణులు బ్లేజర్స్, ట్రౌజర్స్ ధరించి మార్చ్‌పాస్ట్ చేస్తారని ఐఓఏ ఒక ప్రకటనలో తెలిపింది. భారత ఒలింపిక్ సంఘం నిర్ణయాన్ని ఐఓఏ అథ్లెట్స్ కమిషన్ చైర్మన్ మాలవ్ ష్రాఫ్ స్వాగతించారు. కొత్త వస్త్రధారణ అమ్మాయిలకు సహజంగా, సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. కామన్వెల్త్ గేమ్స్ ఆరంభోత్సవం ఏప్రిల్ 4న కెర్రరా స్టేడియంలో జరుగనుంది. -
నేడు తైక్వాండో సెలక్షన్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నేడు (ఆదివారం) తైక్వాండో సెలక్షన్స జరుగనున్నాయి. ఎర్రమంజిల్ బ్యాడ్మింటన్ స్టేడియంలో బాలబాలికల విభాగంలో ఈ ఎంపికలు జరుగుతాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో రాష్ట్ర జట్లను ఎంపిక చేస్తారు. ఈ జట్లు 22 నుంచి పంజాబ్‌లో జరిగే జాతీయ స్థాయి జూనియర్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం కోచ్ సంపూర్ణం (9963775988)ను సంప్రదించవచ్చు. -
ఒలింపిక్ సంఘం సారథిగా ఎంపీ జితేందర్‌రెడ్డి
మహబూబ్‌నగర్ క్రీడలు : తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన ఒలింపిక్ సంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగా ణ రాష్ట్ర సంఘానికి జితేందర్‌రెడ్డి ఎంపికయ్యారు. జితేందర్‌రెడ్డికి జాతీయ, రాష్ట్రస్థాయిల్లో కూడా వివిధ క్రీడా సంఘాల్లో మంచి పట్టుఉంది. రాష్ట్ర ఒలింపిక్ సం ఘం అధ్యక్షుడిగా ఆయనకు రాష్ట్రంలోని ప లు క్రీడాసంఘాలు మద్దతు తెలిపినట్లు స మాచారం. ప్రస్తుతం ఆయన ఆలిండియా సాఫ్ట్‌బాల్ సంఘానికి ఉపాధ్యక్షుడు, రాష్ట్ర సంఘానికి జితేందర్ రెడ్డి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. జిల్లా సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. పలు క్రీడాసంఘాల సన్మానం ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎంపికైన జితేందర్‌రెడ్డిని జిల్లాకు చెందిన పలు క్రీడాసంఘాల ప్రతినిధులు సన్మానించా రు. రాష్ట్ర త్రోబాల్ సంఘం ఉపాధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, జిల్లా ఈత సం ఘం కార్యదర్శి పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తె లిపారు. ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్‌రెడ్డి ఎంపికతో రాష్ట్రంతోపాటు జిల్లాలో క్రీడాభివృద్ధి జరుగుతుందని అన్నారు. -
ఒలింపిక్ సంఘం చైర్మన్‌గా మంత్రి జగదీష్ రెడ్డి
-
క్రీడల్లో రాజకీయ జోక్యం వద్దు
-
ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నిక వివాదం కొత్త మలుపు
-
బాక్సింగ్ ఇండియాను గుర్తించడం లేదు
తేల్చి చెప్పిన ఐఓఏ జాతీయ క్రీడా సమాఖ్యలకు నిధులు కామన్వెల్త్, ఆసియా క్రీడల విజేతలకు రివార్డులు ఏజీఎంలో నిర్ణయాలు చెన్నై: నూతనంగా ఏర్పడిన బాక్సింగ్ ఇండియా (బీఐ)కు గుర్తింపునిచ్చేది లేదని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) స్పష్టం చేసింది. శుక్రవారం జరిగిన తమ సాధారణ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో సభ్యులు ఈ మేరకు తీర్మానించారు. బీఐకి ఇంతకుముందే తమ మాతృక బాడీ అయిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) నుంచి గుర్తింపు లభించింది. మరోవైపు ‘ఐబా’ నిషేధానికి గురైన భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య (ఐఏబీఎఫ్)ను ఇప్పటికీ తాము గుర్తిస్తున్నట్టు ఐఓఏ అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్ తెలిపారు. దీంతో పూర్తిగా అయోమయ పరిస్థితి నెలకొన్నట్టయ్యింది. ‘బాక్సింగ్ వ్యవహారాన్ని మా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాం. దీంతో బీఐకి గుర్తింపునివ్వరాదని ఏకగ్రీవంగా తీర్మానించాం. బీఐకి జరిగిన ఎన్నికల కోసం అటు ప్రభుత్వం కానీ, మా తరఫున కానీ పరిశీలకులు హాజరు కాలేదు. మాకిప్పటికే ఐఏబీఎఫ్ రూపంలో గుర్తింపు పొందిన బాక్సింగ్ సంఘం ఉంది. ఐఓఏ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగాలని ఐబా అధ్యక్షుడితో గతంలో మాట్లాడాం. కానీ మా సూచనలను వారు పట్టించుకోకుండా ఏకపక్షంగా ఎన్నికలకు వెళ్లారు. భారత్‌లో ఓ సమాఖ్యకు ఎన్నికలు జరిగితే వాటిలో మా భాగస్వామ్యం లేకపోతే ఎలా?’ అని రామచంద్రన్ ప్రశ్నించారు. క్రీడా సమాఖ్యలకు ఆర్థిక సహాయం దేశంలోని ఆయా క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు ఆర్థికపరంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ఐఓఏ ముందుకు రానుంది. ఈ మేరకు కార్పొరేట్ స్పాన్సర్షిప్లను ఆకర్షించేందుకు ప్రయత్నించనుంది. అలాగే ఎన్ఎస్ఎఫ్, రాష్ట్రాల ఒలింపిక్ సంఘాలకు ప్రతీ ఏడాది రూ.3 లక్షల గ్రాంట్‌ను ఇవ్వనుంది. ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన ఆటగాళ్లకు నగదు బహుమతులను అందించ నుంది. -
ప్రసాదంలా పంచుతున్నారు
క్రీడా అవార్డులపై మిల్కాసింగ్ వ్యాఖ్య బెంగళూరు: దేశంలో క్రీడల అవార్డులకు విలువ లేకుండా చేస్తున్నారని, ఎవరికి పడితే వాళ్లకు అవార్డులను ప్రసాదంలా పంచుతున్నారని భారత అథ్లెటిక్ దిగ్గజం మిల్కాసింగ్ ధ్వజమెత్తారు. ‘ఒలింపిక్స్, ఆసియాగేమ్స్, కామన్వెల్త్ క్రీడల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అవార్డులు ఇవ్వాలి. ఈసారి అర్జున అవార్డుల ఎంపిక మరీ అన్యాయంగా ఉంది’ అని మిల్కా అన్నారు. తన జీవిత కాలంలో ఒలింపిక్స్‌లో భారత్‌కు అథ్లెటిక్స్‌లో పతకం చూడలేనేమో అని అన్నారు. ‘వికాస్ గౌడ, క్రిష్ణ పూనియాల ప్రయత్నాలను నేను తక్కువ చేయడం లేదు. కానీ ఒలింపిక్స్‌లో పతకం సాధించటానికి మన ప్రమాణాలు సరిపోవడం లేదు. ఆ దిశగా మన ప్రయత్నాలు సాగుతున్నాయని కూడా అనుకోవడం లేదు’ అని మిల్కాసింగ్ వ్యాఖ్యానించారు. -
మెరుగైన సౌకర్యాల దిశగా చర్యలు
ఐఓఏ అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్ సాక్షి, హైదరాబాద్: క్రీడాకారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినప్పుడే వారి నుంచి పతకాలు ఆశించగలమని, అందుకే ఆ దిశగా చర్యలు ప్రారంభించామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్ అన్నారు. భారత క్రీడా జర్నలిస్టుల సమాఖ్య (ఎస్జేఎఫ్ఐ) కన్వెన్షన్‌లో భాగంగా శుక్రవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను బాధ్యతలు స్వీకరించినప్పుడు... తన మదిలో ప్రధానంగా రెండే అంశాలున్నాయన్నారు. ఐఓఏపై నిషేధం ఎత్తివేయించడం, సంఘాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించడమే తన లక్ష్యంగా ఉన్నాయన్నారు. ఇప్పుడిక మరో 50 రోజుల్లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలు, ఆ తరువాత జరిగే ఆసియా క్రీడల పైనే ప్రస్తుతం తమ దృష్టని చెప్పారు. క్రీడాకారుల శ్రమతోనే పతకాలు ఏ టోర్నీలోనైనా క్రీడాకారుల కఠోర శ్రమ వల్లే దేశానికి పతకాలు లభిస్తున్నాయి తప్ప.. క్రీడా సమాఖ్యల వల్ల కాదని రామచంద్రన్ అన్నారు. ఈ నేపథ్యంలో అథ్లెట్లకు ప్రభుత్వ సహకారంతోపాటు స్పాన్సర్‌షిప్‌లు లభించేలా చూడాల్సిన బాధ్యత సమాఖ్యలపై ఉందని, ముందుగా సమాఖ్యలు అంకితభావం, పారదర్శకతతో వ్యవహరించాల్సిన అవసరముందని ఐఓఏ అధ్యక్షుడు సూచించారు. తాము ఇప్పటికే కొన్ని కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, ప్రభుత్వ నిధులపై ఎక్కువగా ఆధారపడకుండా క్రీడల పట్ల ఆసక్తి గల కంపెనీలతో స్పాన్సర్ చేయించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దేశంలోని 38 క్రీడా సమాఖ్యలు, 29 రాష్ట్రాల ఒలింపిక్ సంఘాలు తలచుకుంటే అదేమంత పెద్ద పని కాబోదని రామచంద్రన్ అభిప్రాయపడ్డారు. మాజీ అథ్లెట్ల సలహాలు స్వీకరిస్తాం దేశంలో క్రీడల్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు నిన్నటితరం అథ్లెట్ల సలహాలు, సూచనలు తీసుకునే ఆలోచనలో ఉన్నామని ఐఓఏ అధ్యక్షుడు తెలిపారు. వారి అనుభవం తప్పక ఉపయోగపడుతుందన్నారు. క్రీడా సౌకర్యాలు అభివృద్ధి చెందాలంటే ఎక్కువ రాష్ట్రాల్లో జాతీయ క్రీడలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పుడు ప్రభుత్వాలే క్రీడలకు నిధులు కేటాయిస్తాయని వివరించారు. -
ఆసియా గేమ్స్‌కు మేం ఆతిథ్యమిస్తాం
ఐఓఏ ప్రయత్నాలు న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఆసియా గేమ్స్-2019కు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధమేనని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కార్యదర్శి జనరల్ రాజీవ్ మెహతా వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం వియత్నాం రాజధాని హోనోయ్లో ఈ క్రీడలు జరగాల్సి ఉన్నాయి. కానీ ఆర్థిక ఒత్తిళ్ల వల్ల హోనోయ్ వైదొలగడంతో భారత్ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ‘2019 ఆసియా గేమ్స్‌ను నిర్వహించాల్సి వస్తే ఆర్థిక వనరుల కోసం వెతకాల్సిన పనిలేదు. కేవలం గేమ్స్‌ను సమర్థంగా నిర్వహిస్తే సరిపోతుంది. వియత్నాం వైదొలగడంతో మేం ప్రయత్నిస్తున్నాం. అయితే వచ్చే నెలలో జరగనున్న ఐఓఏ సర్వసభ్య సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం. ఢిల్లీలో సకల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఆమోదం సులువుగానే లభించొచ్చు’ అని మెహతా పేర్కొన్నారు. మరోవైపు ఇండోనేసియా కూడా గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఆసక్తి కనబరుస్తోంది. అయితే సెప్టెంబర్ 20న ఇంచ్వాన్ ఆసియా గేమ్స్ సందర్భంగా వేదికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
నేడు సమైక్య రన్
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆర్కే బీచ్ నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు సమైక్య రన్ నిర్వహిస్తున్నట్టు ఏపీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ఈశ్వరరావు తెలిపారు. ఎన్జీఓ హోమ్‌లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ రన్లో 50 వేల మంది విద్యార్థులు, ఉద్యోగులతో పాటు రైతులు పాల్గొంటున్నట్టు చెప్పారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు సమైక్య రాష్ట్రంకోసం ఉద్యమించాలని హితవు పలికారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ ఈ రన్లో పాల్గొనే వారందరికీ టీషర్టు పంపిణీ చేయనున్నట్టు వివరించారు. బీచ్ రోడ్డులో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని, అందులో టోకెన్లు తీసుకున్న వారికి మాత్రమే వీటిని అందజేస్తారన్నారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ పోలాకి శ్రీనివాస్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం తాము కూడా సమ్మెలోకి దిగుతామని స్పష్టం చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో కార్యాచరణను రూపొందించనున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఎన్నికలు నిర్వహిస్తే నిషేధం ఎత్తివేస్తాం!
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా భారత్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసే దిశగా తొలి అడుగుపడింది. కళంకిత వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తమ రాజ్యాంగాన్ని సవరించుకోవడంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సంతృప్తి వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తే ఒలింపిక్స్‌లోకి తిరిగి అడుగుపెట్టేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. థామస్ బ్యాచ్ అధ్యక్షతన తొలిసారి జరిగిన ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘ఐఓసీ చేసిన విజ్ఞప్తి మేరకు... ఆదివారంనాడు భారత సంఘం తమ రాజ్యాంగాన్ని సవరించుకుంది. ఇది మంచి పరిణామం. దీన్ని ఎగ్జిక్యూటివ్ బోర్డు స్వాగతిస్తోంది. సవరించిన రాజ్యాంగానికి ఐఓసీ ఆమోదం తెలుపుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఐఓఏ ఎన్నికలు నిర్వహించుకుంటే బాగుంటుంది’ అని ఐఓసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఫిబ్రవరి 9న తాజాగా ఎన్నికలు నిర్వహించాలని ఐఓఏ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు నిర్వహించడంలో ఐఓఏ విఫలమైతే భారత్ అథ్లెట్లు సోచీలో జరిగే వింటర్ గేమ్స్ (ఫిబ్రవరి 7-23)లో ఒలింపిక్ పతాకం కింద ఆడాల్సి ఉంటుందని ఐఓసీ హెచ్చరించింది. ఈ ఈవెంట్లో భారత పతాకం, గుర్తులు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. స్వాగతించిన క్రీడాశాఖ ఎన్నికలు నిర్వహిస్తే నిషేధాన్ని ఎత్తివేస్తామన్న ఐఓసీ నిర్ణయాన్ని కేంద్ర క్రీడాశాఖ బుధవారం స్వాగతించింది. ‘ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు తమ జాతీయ పతాకం కింద పాల్గొనడానికి ఐఓసీ నిర్ణయం దోహదం చేస్తుంది. దేశం తరఫున ఆడటాన్ని ఆటగాళ్లు గొప్ప గౌరవంగా భావిస్తారు. అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు ఇది ప్రోత్సాహాన్నిస్తుంది కూడా’ అని క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐఓఏ, ఐఓసీల మధ్య తలెత్తిన ప్రతిష్టంభనను తొలగించేందుకు క్రీడాశాఖ కూడా చురుకుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రస్తుత పరిణామాల పట్ల మేటి షూటర్ అభినవ్ బింద్రా సంతృప్తి వ్యక్తం చేశాడు. సోచీ గేమ్స్ వరకు ఇదే స్ఫూర్తితో కొనసాగాలన్నాడు. -
ఐఓఏ తీరు సరిగా లేదు: నాచప్ప
న్యూఢిల్లీ: కళంకిత వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయకుండా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తమ రాజ్యాంగాన్ని సవరించడం కేవలం కంటితుడుపు చర్యగానే ఉందని క్లీన్ సపోర్ట్స్ ఇండియా (సీఎస్ఐ) ఆరోపించింది. ‘ఐఓసీ హెచ్చరికల నేపథ్యంలో వారు తమ రాజ్యాంగాన్ని సవరించినట్టు చెబుతున్నారు. అయితే ఈ సవరణను జాగ్రత్తగా పరిశీలిస్తే చార్జిషీట్ దాఖలైన వ్యక్తుల వ్యవహారం తమ సొంత ఐఓఏ ఎథిక్స్ కమిషన్‌కు వెళుతుంది. అక్కడ వారికి క్లీన్చిట్ లభిస్తే తిరిగి వారు పదవి పొందేందుకు అర్హులవుతారు. అందుకే ఈ నిబంధన ప్రభావం చూపదని భావిస్తున్నాం. ప్రస్తుత జనరల్ బాడీ ఇప్పటికీ చౌతాలా, బానోత్ వెనకాలే ఉన్నారని స్పష్టమవుతోంది’ అని సీఎస్ఐ అధ్యక్షురాలు అశ్వనీ నాచప్ప పేర్కొంది. తమపై అభియోగం నమోదైన వారు కోర్టు నుంచి సచ్ఛీలుగా బయటపడాలే కానీ తమ ఎథిక్స్ కమిషన్ నుంచి కాదని నాచప్ప స్పష్టం చేశారు. -
క్రీడా సంఘాల బకాయిలు చెల్లించాలి
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర క్రీడా సంఘాలకు గత మూడేళ్లుగా రావాల్సిన రూ.80 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ (ఏపీఓఏ) కోరుతోంది. ఈమేరకు ఏపీఓఏ సీనియర్ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ కె.రంగారావు, ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్‌లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కాలంలో ప్రతీ సంఘం సొంత డబ్బులతోనే టోర్నీలను నిర్వహించిందని వారు గుర్తుచేశారు. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని వారు సీఎంను కోరారు. ‘మద్యం ఆదాయంలో వాటా ఇవ్వాలి’ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా బడ్జెట్లో కేటాయించిన రూ.222 కోట్లలో రూ.200 కోట్లు నియోజక వర్గాల్లో మినీ స్టేడియాల నిర్మాణాల కోసం ప్రతిపాదించారని ఏపీఓఏ ప్రతినిధులు చెప్పారు. మిగిలిన రూ.22 కోట్లు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ(శాప్) అకాడమీల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతుందని అన్నారు. దీనికి అదనంగా మరో రూ.20 కోట్లు మంజూరు చేస్తే క్రీడా సంఘాలు తమ ప్రాథమిక విధులు అమలు చేసే పరిస్థితి ఉంటుందని వారు తెలిపారు. అలాగే 2001లో జారీ చేసిన జీఓ ప్రకారం సూచించినట్టు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీబీసీఎల్) మద్యం అమ్మకాల ఆదాయంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రతీ ఏడాది రూ.25 కోట్ల నిధులు శాప్‌కు కేటాయించాలని వారు కోరారు. న్యాయం చేస్తామన్న సీఎం: ఏపీఓఏ క్రీడా సంఘాల సమస్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఏపీఓఏ ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వయాదవ్ తెలిపారు. బడ్జెట్ కేటాయింపులో క్రీడలకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. -
తుది గడువు డిసెంబరు15
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది కాలంగా నిషేధంలో కొనసాగుతున్న భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)తో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. అవినీతి మచ్చ పడిన వారు క్రీడా సంఘాల్లో కొనసాగేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని తేల్చి చెప్పింది. తాజా పరిణామాలకు సంబంధించి ఐఓఏ తాత్కాలిక అధ్యక్షుడు విజయ్‌కుమార్ మల్హోత్రాతో పాటు సస్పెండ్ అయిన ఐఓఏ సభ్యులకు ఐఓసీ డెరైక్టర్ జనరల్ క్రిస్టోఫ్ కీపర్ ఒక లేఖ రాశారు. దీని ప్రకారం చార్జ్‌షీట్‌లో పేర్లు ఉన్న సభ్యులందరినీ అక్టోబరు 31లోగా తొలగించాలని ఆదేశించింది. ఆ తర్వాత ఐఓసీ నిబంధనల ప్రకారం డిసెంబర్ 15లోగా ఎన్నికలు జరపాలని పేర్కొంది. అప్పుడే భారత్ గుర్తింపును పునరుద్ధరించే విషయంపై ఆలోచిస్తామని ఐఓసీ స్పష్టం చేసింది. మీ ఇంటినుంచి వెళ్లిపో! ఒలింపిక్స్‌లో ఏకైక వ్యక్తిగత స్వర్ణం సాధించిన స్టార్ షూటర్ అభినవ్ బింద్రాపై ఐఓఏ మాజీ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా అక్కసు వెళ్లగక్కారు. ఒలింపిక్ సంఘంలో అవినీతిపరులను దూరంగా ఉంచాలంటూ ఉద్యమిస్తున్న బింద్రాపై ఆయన వ్యక్తిగత దూషణకు దిగారు. అభినవ్ తండ్రి ఏఎస్ బింద్రా నాలుగేళ్ల క్రితం ఆర్థిక అవకతవకలపై అరెస్టుకు గురైన విషయాన్ని గుర్తు చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘చార్జ్‌షీట్ ఎదుర్కొంటున్నవారిని ఐఓఏ నుంచి బయటికి పంపించాలని అభినవ్ బింద్రా భావిస్తున్నారు. అదే నిజమైతే ఆయన తన తండ్రిని ముందు సొంత ఇంటినుంచి బయటికి పంపించాలి లేదా తానే స్వయంగా వెళ్లిపోవాలి’ అని చౌతాలా తీవ్ర వ్యాఖ్య చేశారు.