న్యూఢిల్లీ: కళంకిత వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయకుండా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తమ రాజ్యాంగాన్ని సవరించడం కేవలం కంటితుడుపు చర్యగానే ఉందని క్లీన్ సపోర్ట్స్ ఇండియా (సీఎస్‌ఐ) ఆరోపించింది. ‘ఐఓసీ హెచ్చరికల నేపథ్యంలో వారు తమ రాజ్యాంగాన్ని సవరించినట్టు చెబుతున్నారు.
అయితే ఈ సవరణను జాగ్రత్తగా పరిశీలిస్తే చార్జిషీట్ దాఖలైన వ్యక్తుల వ్యవహారం తమ సొంత ఐఓఏ ఎథిక్స్ కమిషన్‌కు వెళుతుంది. అక్కడ వారికి క్లీన్‌చిట్ లభిస్తే తిరిగి వారు పదవి పొందేందుకు అర్హులవుతారు. అందుకే ఈ నిబంధన ప్రభావం చూపదని భావిస్తున్నాం. ప్రస్తుత జనరల్ బాడీ ఇప్పటికీ చౌతాలా, బానోత్ వెనకాలే ఉన్నారని స్పష్టమవుతోంది’ అని సీఎస్‌ఐ అధ్యక్షురాలు అశ్వనీ నాచప్ప పేర్కొంది. తమపై అభియోగం నమోదైన వారు కోర్టు నుంచి సచ్ఛీలుగా బయటపడాలే కానీ తమ ఎథిక్స్ కమిషన్ నుంచి కాదని నాచప్ప స్పష్టం చేశారు.
ఐఓఏ తీరు సరిగా లేదు: నాచప్ప
Published Wed, Dec 11 2013 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement
Advertisement