PCC President uttamkumarreddy
-
పట్నం టికెట్ క్యామకే
యాచారం(ఇబ్రహీంపట్నం): ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్.. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌కే ఇస్తామని, అందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించి భారీ మెజార్టీతో గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. యాచారం మండల పరిధిలోని మాల్ సర్పంచ్ చిన్నోళ్ల పద్మజ(టీఆర్ఎస్)తో పాటు పలువురు వార్డు సభ్యులు, 150 మంది వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజలు మనోభావాలను పరిగణనలోకి తీసుకుని సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. 2014 ఎన్నికల్లో మాయమాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో పాటు అన్ని వర్గాల వారిని మోసం చేశారని మండిపడ్డారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, ఇప్పటికే నిర్వహించిన అన్ని సర్వేలు దీన్ని ధ్రువీకరించాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో కూడా 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. 2014 ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి, బహిష్కరణలకు గురైన వారితో చర్చించి సస్పెన్షన్ ఎత్తేసే విధంగా చూస్తున్నట్లు తెలిపారు. పార్టీ నుంచి విడిపోయిన ప్రతీ నాయకుడిని, కార్యకర్తను మళ్లీ ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, కాంగ్రెస్ యాచారం మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పడకంటి శేఖర్‌గౌడ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు కాలె మల్లేశ్, ప్రధాన కార్యదర్శి లిక్కి పాండురంగారెడ్డి, నక్కర్తమేడిపల్లి సర్పంచ్ పాశ్ఛ భాషా, నాయకలు ఆడాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను భయపెడితే ఖబడ్దార్
► 2013చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి ► బ్రొకర్లలా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ నాయకులు ► కర్వెన సభలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ,దామోదర రాజనర్సింహ భూత్పూరు : ప్రాజెక్టుల పేరుతో రైతులను మోసగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రైతులను పోలీసుల చేత బెదిరింపులకు గురిచేస్తూ భూములను ఆక్రమించుకుంటున్నారని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కురిముర్తిరాయ రిజర్వాయర్ ముంపు రైతులకు న్యాయం చేయాలని మండలంలోని కర్వెనలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భరోసా యాత్రలో వారు ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడారు. రైతులు తమకు న్యాయం జరగాలని కోరుకుంటుంటే వారిని పోలీసులు చేత బెదిరించి భయాందోళనకు గురిచేస్తున్నారని, రైతులకు జోలికి వస్తే ఖబడ్దార్ నఅని హెచ్చరించారు.రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భూమికి బదులుగా భూమి, ముంపునకు గురవుతున్న ఇళ్ల స్థానంలో డబుల్బెడ్రూం ఇళ్లు, ముంపు బాధితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాటలకే పరిమితమైందని విమర్శించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు బ్రోకర్ల వ్యవహరిస్తూ తమ నాయకుల మెప్పు పొందేందుకు భూములను లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు ప్రాజెక్టులో ఆంధ్ర కాంట్రాక్టర్లకు పెద్దపీట వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినందుకే ఆయన రైతులను పోలీసుల చేత రైతులను భయంబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ పోరాడుతుందని రైతులకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, నాయకులు నర్సింహరెడ్డి, హర్యానాయక్, సర్పంచ్ సునీత పాల్గొన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం లూటీ మహబూబ్‌నగర్ అర్బన్ : పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడానికి ఇష్టం లేని టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల పేరుతో ప్రజా ధనాన్ని లూటీ చేస్తుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన మాజీ ఎంపీ విఠల్‌రావు సం స్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడా రు. ప్రాజెక్టులకు తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. మిషన్ కాకతీయ పనులను 20 శాతం లెస్‌కు కాంట్రాక్ట ర్లు పని చేస్తున్నారని ఇరిగే షన్ మంత్రి అసెంబ్లీ లో గొప్పలు చెప్పారన్నారు. కానీ సాగు, తాగునీటి ప్రాజెక్టు పనులను ఎక్సెస్ రేట్లకు ఎందుకు కట్టబెడుతున్నారని, వీటి టెండర్ ప్రక్రియలో రూ.వేల కోట్లలో అవకతవలు జరిగాయన్నారు. ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కోవడం సరికాదని, 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేయాలని డిమాండ్ చేశారు. పులిచింతల ప్రాజెక్టు విషయంలో తనను అప్రతిష్ట పాల్జేస్తున్నారని, కాని దేశంలోనే ఆదర్శంగా ఆ పనులను చేట్టామన్నారు. -
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి
రైతు ఆత్మహత్యలపై ఏఐసీసీ కార్యదర్శి కుంతియా వరంగల్ : రైతుల ఆత్మహత్యలు దేశంలో సర్వసాధారణంగా మారాయని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఆర్సీ.కుంతియా అన్నారు. వరంగల్ జిల్లా కాం గ్రెస్ కమిటీ, తెలంగాణ కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్‌ల సంయుక్త ఆధ్వర్యం లో వరంగల్ జిల్లా హన్మకొండలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సదస్సులో ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు పిట్టల్లా రాలిపోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయన్నారు. భూసేకరణ బిల్లును రైతులు వ్యతిరేకించడంతో మార్పులు చోటు చేసుకోనున్నాయని పేర్కొ న్నారు. వ్యవసాయరంగంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల తర్వాత స్థానం తెలుగు రాష్ట్రాలదే అన్నారు. వ్యవసాయ రంగాన్ని పట్టించుకోక పోవడంతో 2000 సంవత్సరం నుంచి పంటలు తక్కువ సాగు అవుతున్నాయన్నారు. అమెరికా లాంటి దేశాలు రైతులకు 300 శాతం సబ్సిడీని అందిస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలని కుంతియా సూచించారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తు అంధకారంగా మారే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సదస్సులో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, ఎంపీలు ఏకే .ఖాన్, హన్మంతరావు, ఆనందభాస్కర్, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌రాబు, సారయ్య పాల్గొన్నారు.