crores of rupes
-
టన్నుల కొద్ది వ్యర్థాలతో కోట్లు గడిస్తూ...వరుసగా ఆరోసారి తొలిస్థానం దక్కించుకున్న నగరం
భారతదేశంలోనే స్వచ్ఛ నగరంగా ఇండోర్ వరుసగా ఆరోసారి తొలిస్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐతే ఇండోర్ నగరమే ఎందుకు ఆ ఘనతను దక్కించుకోగలిగందంటే..ఎక్కడైన పొడిచెత్తను, తడిచెత్తను విభజించడం సర్వసాధారణం. కానీ ఇండోర్‌లో మాత్రం చెత్త సేకరణ వద్దే ఆరు విభాగాలుగా విభజిస్తారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధానిగా పిలిచే ఇండోర్ సుమారు 35 లక్షల జనాభా కలిగిన అతి పెద్ద నగరం. ప్రతిరోజు దాదాపు 1200 టన్నుల పొడి చెత్త, సుమారు 700 టన్నుల తడి చెత్తను విడుదల చేస్తున్నప్పటికీ చెత్త డబ్బాల్లో చెత్త మాత్రం కనిపించదు. ఎందుకంటే... అక్కడ దాదాపు 850 వాహనాలతో గృహాలు, వ్యాపార సంస్థలను నుంచి సేకరించే వేస్ట్‌ను ఆరు విభాగాలు విభజించి ఎప్పటికప్పుడూ తరలిస్తారని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మహేష్ శర్మ తెలిపారు. వాహానాల్లోని వ్యర్థాలకు సంబంధించి ప్రత్యేక కంపార్ట్మెంట్లు ఉంటాయి. దీంతో సేకరణ ప్రారంభంలోనే సమర్ధవంతంగా ఆ వేస్ట్‌ని ప్రాసెస్ చేసేందుకు సులభంగా ఉంటుంది. ప్రధానంగా సేకరించిన తడి చెత్త కోసం బయో సీఎన్జీ(కంప్రెషన్ నేచురల్ గ్యాస్) ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ఆసియాలోనె అతిపెద్దది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రధాని నరేంద్ర మోదీ 150 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ని ప్రారంభించారు. ఈ ప్లాంట్ రోజుకు 550 మిలియన్ టన్నుల పొడి చెత్తను ప్రాసెస్ చేయడమే కాకుండా సుమారు 17 వేల నుంచి 18 వేల కిలోల బయో సీఎన్జీ తోపాటు దాదాపు 10 టన్నుల సేంద్రీయ ఎరువును ఉత్పత్తి చేయగలదు. ఈ సీఎన్జీతో దాదాపు 150 సీటీ బస్సులు నడుపుతోంది. దీని ధర వాణిజ్య సీఎన్జీ కంటే రూ. 5లు తక్కువ కూడా. గత ఆర్థిక సంవత్సరంలో వ్యర్థాల తొలగింపుతో సుమారు రూ. 14 కోట్లు ఆర్జించింది. అందులో కార్బన్ క్రెడిట్ అమ్మకం ద్వారానే దాదాపు రూ. 8 కోట్లు కాగా, బయో సీఎన్జీ ప్లాంట్‌కి వ్యర్థాలను సరఫరా చేసినందుకు ప్రైవేట్ కంపెనీ నుంచి వార్షిక ప్రీమియం సుమారు రూ. 2 కోట్లు ఆర్జించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యర్థాల తొలగింపుతో దాదాపు రూ. 20 కోట్లు ఆర్జించాలని పౌర సంఘం లక్ష్యంగా పెట్టుకుందని సూపరింటెండెంట్ మహేష్ శర్మ చెప్పారు. అంతేకాదు నగరంలో విడుదలయ్యే మరుగు నీటిని సైతం ప్రత్యేక ప్లాంట్లలో శుద్ధి చేసి సుమారు 200 పబ్లిక్ గార్డెన్లు, పొలాలు, నిర్మాణ కార్యకలాపాలకు తిరిగి ఉపయోగిస్తారని ఉద్యానవన అధికారి చేతన్ పాట్ తెలిపారు. (చదవండి: దేశంలోనే స్వచ్ఛ నగరంగా మళ్లీ ‘ఇండోర్’.. విజయవాడకు నాలుగో స్థానం) -
నీటి మూటలు!
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో రైతులు ఇబ్బంది పడకుండా ప్రతి ఎకరాకు డ్రిప్ (బిందు) సేద్యపు యూనిట్లు అందజేస్తామని చంద్రబాబునాయుడు గొప్పగా చెప్పిన మాటలు నీటిమూటలుగా మిగిలిపోతున్నాయి. సూక్ష్మ సాగు మంజూరులో అనంతపురం జిల్లాను పెలైట్‌గా తీసుకుని వంద శాతం ఫలితాలు సాధిస్తామని గతేడాది జిల్లా పర్యటనలో భాగంగా కదిరి, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో జరిగిన బహిరంగసభల్లో ఆయన ప్రకటించారు. అందు కోసం ఎన్ని కోట్ల రూపాయలు అవసరమైనా వెనుకాడేదిలేదని చెప్పారు. ప్రత్యేకించి అనంతపురం జిల్లా రైతులకు డ్రిప్ యూనిట్లు మంజూరు చేయడానికి వీలుగా నిబంధనలు సులభతరం చేయడమే కాకుండా రాయితీలు, పరిమితులు సడలిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. చంద్రబాబు హామీలకు జిల్లా రైతుల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. బిందు, తుంపర సేద్యంతో కష్టాలు తీరిపోయినట్లేనని ఆనందపడ్డారు. నెలల తరబడి అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా రాయితీలు కూడా అందజేస్తారని ఉబ్బితబ్బిబ్బయ్యారు. కానీ నెలలు గడుస్తున్నా సీఎం ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చక పోవడంతో రైతులు పెదవి విరుస్తున్నారు. ‘మీ-సేవ’లో వెల్లువెత్తిన దరఖాస్తులు బిందు సేద్యపు పరికరాల కోసం ‘మీ-సేవ’లో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సీనియార్టీ ప్రకారం మంజూరు చేస్తామని ప్రకటించడంతో రైతుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. గత ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన మీ-సేవ కేంద్రాల్లో డ్రిప్ దరఖాస్తులను ఆన్లైన్ చేయడం ప్రారంభం కావడంతో రైతులు క్యూ కట్టారు. ఇప్పటి వరకు జిల్లాలో 65 వేల హెక్టార్లకు డ్రిప్ కోసం రైతులు దరఖాస్తు చేసుకోగా,, తక్కిన 12 జిల్లాలన్నీ కలిపితే అంతే సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అంటే జిల్లాలో డ్రిప్ అవసరం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2003 నుంచి ఇప్పటివరకు 1.75 లక్షల హెక్టార్లకు సరిపడా డ్రిప్, స్ప్రింక్లర్లు రాయితీతో అందజేశారు. అందులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అడిగిన ప్రతి రైతుకూ సూక్ష్మ సాగు పరికరాలు అందజేయడంతో డ్రిప్, స్ప్రింక్లర్ల సేద్యం అంచెలంచెలుగా విస్తరించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా లక్ష హెక్టార్లకు పైబడి విస్తీర్ణంలో పండ్ల తోటలు విస్తరించాయి. వాటితో పాటు కూరగాయలు, పూల తోటలు, ఔషధ పంటలతో పాటు ఇతర పంటలకు కూడా ఈ తరహా సేద్యం ప్రారంభించారు. రెండు మూడు సంవత్సరాలుగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అందులోనూ ఈ ఏడాది సాధారణం కన్నా 46 శాతం తక్కువ వర్షాలతో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. భూగర్భ జలాలు 21 మీటర్లకు పైబడి లోతుకు పడిపోయి కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. బోర్ల నుంచి నీరు రావడం గగనంగా మారింది. ఈ పరిస్థితుల్లో రైతులకు డ్రిప్ యూనిట్ల అవసరం మరీ ఎక్కువైంది. వాటి కోసం దరఖాస్తులు చేసుకున్న రైతులు అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కేవలం 11 వేల హెక్టార్లకు మాత్రమే డ్రిప్ యూనిట్లు ఇస్తామని జిల్లాకు కేటాయింపులు చేయడం, అది కూడా చాలా ఆలస్యంగా గత డిసెంబర్లో అనుమతులు ఇవ్వడంతో మంజూరు ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తూ ఇప్పటి వరకు 5 వేల హెక్టార్లకు డ్రిప్ యూనిట్లు మంజూరు చేయడంలో ఏపీఎంఐపీ అధికారులు సక్సెస్ అయ్యారు. ఆసల్యంగా అనుమతులు ఇవ్వడం వల్ల మార్చి ఆఖరుకు 6 వేల హెక్టార్లకు మించి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. -
ఎత్తిపోతలే..!
సాక్షి, కర్నూలు: కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాల్లో నీరు పారడం లేదు. మరోవైపు అవినీతి మాత్రం ఏరులై పారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని ఎత్తిపోతల పథకాల్లో చేపట్టిన పనులు నాసిరకంగా ఉండటంతో నిర్ణీత లక్ష్యం మేరకు రైతులకు నీళ్లు పారడం లేదు. కాంట్రాక్టర్ల జేబుల్లోకి మాత్రం నిధులు కోట్లలో నిండుకున్నాయి. నాసిరకంగా పనులు ఉన్నాయా? లేదా అనే విషయాన్ని క్వాలిటీ కంట్రోలు (నాణ్యత పరీక్ష) చేయకుండానే బిల్లులు చెల్లించేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఐడీసీ) అధికారులు చేష్టలూడిగి చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఎత్తిపోతల పథకాల కోసం పదేళ్ల కాలంలో దాదాపు రూ. 500 కోట్లు ఖర్చు చేశారు. ఈ పనులతో ప్రజలకు ఒరిగింది లేకపోయినా కాంట్రాక్టర్లు మాత్రం బాగుపడ్డారు. కోవెలకుంట్ల మండలం కలుగొట్ల ఎత్తిపోతల పథకాన్ని రూ. 6.71 కోట్లతో నిర్మించారు. అప్పట్లో నిధులు వెనక్కి మళ్లిపోతాయన్న సాకుతో కమిటీ వారికి రిజిస్ట్రేషన్ చేయకుండానే ఐడీసీ అధికారులు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి పనులు మొదలు పెట్టారు. అయితే పొలం యజమాని ఎం. వీరారెడ్డి అనుమతి లేకుండా నిర్మించిన పథకం నిరుపయోగంగా మిగిలిపోయింది. ఈ పథకాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ఐడీసీ అధికారులకు కమిటీ సభ్యులు లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయింది. అయితే పైపులైన్ పనులు నాసిరకంగా ఉండడంతో అక్కడక్కడ లీకేజీలు కూడా ఏర్పడ్డాయి. కోవెలకుంట్ల మండలం వల్లంపాడు ఎత్తిపోతల పథకం 500 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా రూ. 3.50 కోట్లతో సుజల కంపెనీ ఈ పనులను చేపట్టింది. పంట కాల్వలు నిర్మాణం జరగలేదు. పైప్‌లైన్ పనులూ పూర్తికాలేదు. పనులు అసంపూర్తిగా ఉండగానే ప్రాజెక్టు 2014 ఆగస్టు ఒకటి నాటికి పూర్తయినట్లు రైతు సంఘంతో ఐడీసీ అధికారులు ఒప్పంద పత్రం రాయించారు. అయితే 160 ఎకరాలకు కూడా నీరందడం లేదు. గూడూరులో 4,300 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో రూ. 19 కోట్లతో నిర్మించిన మునగాల ఎత్తిపోతల పథకం ద్వారా కనీసం 2,500 ఎకరాలకూ నీరందని పరిస్థితి. ఇక్కడ ఒకే మోటారుతో నీరు పంపింగ్ చేస్తున్నారు. రెండు మోటార్లు నడిస్తే పైపులైన్లు పగిలిపోతున్నాయి. సిమెంటు పనులు నాసికరంగా ఉన్నాయి. అయినా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చెల్లించారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా జలయజ్ఞం కింద రూ 176 కోట్లతో 12 ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో చిలకలడోణ, పూలచింత, సూగూరు, మాధవరం, దుద్ది, సోగనూరు, బసలదొడ్డి, మూగలదొడ్డి ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. 2005లో పనులు మొదలు పెట్టి నేటికీ పూర్తి చేయలేదు. కొన్ని రిజర్వాయర్లలో చేసిన పనులు నాసిరకం కావడంతో రాతికట్టడం, కట్టలు పగుళ్లిచ్చాయి. వీటి కోసం ఇప్పటివరకు వరకు రూ. 126 కోట్ల మేరకు ఖర్చు చేశారు. చింతలడోణ ఎత్తిపోతల పథకానికి రూ. 9 కోట్ల వరకు వెచ్చించారు. ఒక ఎకరానికి నీరు అందించలేదు. చేసిన పనులు నాసిరకం కావడంతో సిమెంట్ కాల్వలు శిథిలావస్థకు చేరాయి. సూగూరుది ఇదే పరిస్థితి. పూలచింత ఎత్తిపోతల పథకానికి రూ. 15 కోట్లు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. సోగనూరు ఎత్తిపోతల కాల్వ నిర్మాణంలో ఆలస్యమైంది. రాతి కట్టలతో నిర్మించాల్సిన కాల్వ లైనింగ్ పనులు పూర్తి కాలేదు. లీకేజీలతో అరకొరగా సాగునీరు.. కలుగొట్ల ఎత్తిపోతల పథాకానికి 750 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. రూ. 8 కోట్లతో దీనిని 2012లో పూర్తి చేశారు. ఇప్పటి వరకు 400 ఎకరాలకు మించి నీరు అందడం లేదు. పైపులైను లీకేజీలు, పంట కాల్వలు లేని కారణంగా ఈ పథకం ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు అందటం లేదు. - శ్రీనివాసరెడ్డి, రైతు, కలుగొట్ల రెండేళ్ల వరకు కాంట్రాక్టర్‌దే బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఐడీసీ) కింద 75 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఇందులో 11 పథకాలు పనిచేయడం లేదు. మిగిలిన అన్ని పథకాల్లోనూ 70 నుంచి 80 శాతం మేర ఆయకట్టుకు నీరు అందుతోంది. నాసిరకం పనులకు ఆస్కా రం ఉండదు. ఎందుకంటే పనులు చేపట్టిన కాంట్రాక్ట రు రెండేళ్ల వరకు నిర్వహణ చూసుకోవాల్సి ఉంటుంది. - రెడ్డి శంకర్, కార్యనిర్వాహకఇంజినీరు(ఈఈ), ఏపీఎస్ఐడీసీ. -
పోలీసుల అదుపులోనే రాజానాయుడు?
నాయుడుపేట టౌన్: ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కోట్లాది రూపాయలు కూడబెట్టుకున్న స్మగ్లర్లకు పోలీసుల చర్యలు ముచ్చెమటలు పట్టిస్తున్నా యి. నాయుడుపేటకు చెందిన టీడీపీ నేత వేముల రాజానాయుడి ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో ఇద్దరిని కూ డా అదేతరహాలో అదుపులోకి తీసు కుని విచారిస్తున్నట్లు సమాచారం. రాజానాయుడి కదలికలపై పోలీసులు నెల రోజులుగా నిఘా పెట్టినట్లు సమాచారం. ఆయనతో పాటు చిట్టమూరు మండలం యాకసిరి ప్రాంతానికి చెందిన ఒకరు, నాయుడుపేటకు చెందిన మరో వ్యక్తి కదలికలపైనా పోలీసులు దృష్టి సారించి పక్కా ఆధారాలతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరు ముగ్గురూ పదేళ్లుగా ఎర్రచందనం సగ్లింగ్ చేస్తూ, అంతర్జాతీయ స్మగ్లర్లకు ప్రధాన అనుచరులుగా కొనసాగుతున్నట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ ముగ్గురిని రహస్య ప్రాంతంలో విచారిస్తూ, వీరి వెనుక ఉన్న అంతర్జాతీయ స్మగ్లర్లను వెలుగులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. వీరు చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఆస్తులు కూడబెట్టినట్లు, బినామీ పేర్లతో భారీ అపార్టుమెంట్లు, అధునాతన భవనాలు సమకూర్చుకున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజానాయుడికి సంబందించి అతని సమీప బంధువుల పేర్లతో నాయుడుపేటలో పలుచోట్ల ఆస్తులు కూడబెట్టినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అధికార పార్టీ వ్యక్తి కావడంతో, అతని వెనుక ఉన్న సూత్రధారులు బయటకు వస్తారా లేదా అన్నది చిక్కు ప్రశ్నగా మారింది. పోలీసులు ఇదే తరహాలో కఠినంగా వ్యవహరించి లోతుగా విచారణ జరిపితే అసలు సూత్రధారులందరూ బయటకు వచ్చే అవకాశం ఉంది. -
కల నిజమైంది!
కదిరి : ‘ఒసేయ్ సెంద్రకళ నాకు కోటి రూపాయలు లాటరీ తగిలిందని రాత్రి నిద్దరలో కల వచ్చిందే. నువ్వు నమ్ము నమ్మకపో.. ఆ డబ్బుతో కదిరిలో మనం పేద్ద ఇల్లు కట్టినట్లు, మన పాప ఆ ఇంటో ఆడుకుంటాన్నట్లు కల వచ్చింది. ఏదో ఒకరోజు తగలకుండా పోతుందా.. అబ్బుడు మనకు ఈ అడుక్కుతినే ఖర్మ తప్పుతుంది. నీకు రోజూ నా చేతిలో దెబ్బలూ తప్పుతాయి’ అన్నాడు సోమ్లానాయక్ తన భార్య చంద్రకళతో. అందుకు ఆమె ‘మనం కేరళకు వచ్చినప్పటి నుండి నీకు ఇంతకన్నా ఇంగేంపనుంది. లాస్టుకు నా తాలిబొట్టు గూడా ఆ లాటరీ టికెట్లకే పెట్టేస్తివే. ఈ పొద్దు ఆదివారము. నాతో పాటు చర్చి దగ్గర కూచుందురా.. నీ చేతికీ కొంత చిక్కుతుంది.. బిడ్లు ఊరికాడ. మనం కేరళలో’ అని కోపగించుకుంది. ఇందుకు అతను ‘నువ్వు పోవే.. నేను రాను. అడుక్కోవడానికి సిగ్గులేదూ అని ఎవరైనా అంటే నాకు బాధైతుంది’ అని రోజూలాగానే బజారుకు వెళ్లిపోయాడు. మధ్యాహ్నానికి లాటరీ ఫలితాలు వచ్చాయి. కారుణ్య లాటరీ రూ. కోటి ‘కేఈ 237343’ నెంబరుకు తగిలిందని చెప్పారు. సోమ్లానాయక్ తన జేబులో ఉన్న టికెట్ బయటకు తీసి చూసుకున్నాడు. అది తనదేనని తెలుసుకొని కేరళ లో ఓ చర్చి దగ్గర అడుక్కుంటున్న తన భార్య దగ్గరకు పరుగెత్తుకెళ్లి ఆమె చేతిలో ఉన్న తట్ట(ప్లేట్) చేతికి తీసుకొని దూరంగా విసిరి పారేస్తూ ‘రావే ఇంగ మనూరికెళ్లిపోదాం. రాత్రి వచ్చిన కల నిజమైంది. ఆ చర్చిలో ఉన్న దేవుడే మనల్ని కరుణించాడు’ అంటూ ఆనందం పట్టలేకపోయాడు. ఆమె మొదట నమ్మలేదు. తర్వాత అందరూ చెప్పాక నిజమని నమ్మింది. వివరాల్లోకి వెళితే.. కదిరి మండలం కారెడ్డిపల్లితండాకు చెందిన సోమ్లానాయక్ వరుస కరువులు కారణంగా ఊరిలో పనులు లేక తన భార్య చంద్రకళను వెంట బెట్టుకొని కేరళ రాష్ట్రం కొట్టాయంకు దగ్గర్లో ఉన్న కంజిరపల్లి అనే పట్టణానికి ఐదేళ్ల క్రితం వలస వెళ్లాడు. అక్కడ చర్చిలు, మసీదులు, ఆలయాల వద్ద బిక్షాటన మొదలెట్టారు. డబ్బులు దానం చేస్తూ కొందరు సోమ్లానాయక్ వైపు చూసి ‘కష్టపడి పనులు చేసుకోవచ్చు కదా’ అని మళయాళంలో కోప్పడటం చూసి తనకు భాష అర్థం కాకపోయినా విషయం అర్థం చేసుకున్నాడు. ఆ మరుసటి దినం నుండి అడుక్కోవడం మానేసి ఓ రోజు ఊరు చూద్దామని ఊరంతా తిరగటం మొదలెట్టాడు. ఓ చోట లాటరీ టికెట్ల విక్రయాలు జోరుగా సాగుతుంటే అతనూ రూ.150 ఇచ్చి రూ.30 విలువ చేసే 5 టికెట్లు కొనుక్కున్నాడు. ఆ రోజే అతనికి రూ. 20 వేలు లాటరీ తగిలింది. ఇక అప్పటి నుండి ఐదేళ్లుగా ఇదే పనిలో మునిగిపోయాడు. అతని భార్య మాత్రం బిక్షాటన వదిలిపెట్టలేదు. ఆమె తెచ్చిన డబ్బు కోసం ప్రతి రోజూ ఇద్దరూ గొడవ పడేవారు. ఆఖరుకు భార్య తాలిబొట్టు సైతం లాక్కొని లాటరీలకే ఖర్చు చేసేశాడు. ఈ నెల 13వ తేదీ అతను తన భార్య దగ్గర బలవంతంగా రూ. 300 లాక్కెళ్లాడు. ఒక్కొక్కటి రూ. 50 చొప్పున కారుణ్య లాటరీ టికెట్లు 5 కొనుక్కున్నాడు. 14వ తేదీ కేఈ 237343 లాటరీ టికెట్‌కు రూ. 1 కోటి మొదటి బహుమతి తగిలింది. మిగిలిన ఆ 4 టికెట్లకు సైతం రూ.10 వేలు చొప్పున రూ.40 వేలు తగిలింది. రూ. 40 వేలు నగదు రూపంలో అతనికి లాటరీ టికెట్ల విక్రేతలు అక్కడికక్కడే అందజేశారు. మిగిలిన రూ. కోటి బ్యాంకు ద్వారా తీసుకోవాలని చెప్పడంతో సోమ్లానాయక్ దంపతులు కేరళలోని స్థానికుల సాయంతో కంజిరపల్లి సర్వీస్ కో ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్‌ను కలిసి లాటరీ విషయం చెప్పి ఆ లాటరీ టికెట్ అందజేశారు. అతను కలెక్షన్ కోసం పంపుతానని, అయితే ఈ లోగా పాన్ కార్డు తెచ్చుకోండని సలహా ఇస్తూ లాటరీ టికెట్ తన చేతికిచ్చినట్లు రాతమూలకంగా ఇవ్వడంతో పాటు ఆ లాటరీ టికెట్ జిరాక్స్ ప్రతిని కూడా వారికి అందజేశాడు. పాన్ కార్డు కోసం అక్కడ దరఖాస్తు చేసిన సోమ్లా దంపతులు స్వగ్రామం తిరిగొచ్చారు. ఆ డబ్బుతో ఏం చేస్తావని సోమ్లాను అడిగితే ‘నాకు ఒక పెద్ద ఇల్లు కట్టినట్లు కల వచ్చింది. నా కల నిజం చేసుకుంటాను. నా ఇద్దరు పిల్లలను బాగా చదివించుకుంటాను. డబ్బు కోసం ఇక నా భార్యను కొట్టడం మానుకుంటాను. ఇక బాగా చూసుకుంటాను’ అన్నాడు. ఇకనైనా లాటరీ టికెట్లను కొనడం మానేస్తావా? అంటే ‘ఇంగ కేరళకు వెళ్లం కాబట్టి లాటరీ టికెట్లు కొనేది ఉండదు’ అన్నాడు. సోమ్లానాయక్ తండ్రి తావ్రేనాయక్ ఏడాదిన్నత క్రితం జరిగిన పంచారుుతీ ఎన్నికల్లో కే బ్రాహ్మణపల్లి పంచాయతీ నుండి టీడీపీ మద్దతుతో బరిలోకి దిగి వైఎస్సార్సీపీ మద్దతుతో పోటీ చేసిన నారాయణనాయక్ చేతిలో ఓడిపోయాడు. ‘లాటరీతో కోటి రూపాయలు తగిలినాయంటే నాకైతే ఆనందం లేదు. ఆ లాటరీల వల్లే నా తాళి బొట్టుకూడా పోగొట్టుకున్నాను. లాటరీలకే ఇప్పటిదాకా రూ. 10 లక్షలు ఖర్చుపెట్టేసినాడు. మా ఆయనే కాదు ఎవ్వరూ ఆ లాటరీల జోలికి పోకపోతేనే మంచిది’ అని సోమ్లానాయక్ భార్య చంద్రకళ అమాయకంగానే మంచి సలహా ఇచ్చింది. -
మొక్కేశారు..!
నాగర్‌కర్నూల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. గ్రామాల్లో పండ్లతోటల పెంపకం పేర కొందరు అధికారులు, దళారులు నిధులను అమాంతంగా మెక్కేశారు. రికార్డుల్లో బోగస్ తోటల పేర అవినీతి రికార్డులను సృష్టించారు. ఇలా 2007 నుంచి 2010 వరకు కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతోంది. ఇందులో కొన్ని ఫైళ్లు మాయంకావడం పలు అనుమానాలకు తావిస్తోంది. నియోజకవర్గంలోని ఐదు మండలాలు.. 55 గ్రామాల్లో 2011-12, 13 సంవత్సరాల్లో దాదాపు 366 మంది లబ్ధిదారులకు చెందిన 1017 ఎకరాల్లో పండ్ల తోటలు సాగుచే సిన ట్లు ఈజీఎస్ అధికారులు లెక్కలు రాసిపెట్టారు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం రైతుల పొలాల్లో పండ్ల మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలు తీయడం, వాటిని పూడ్చడం, ఎరువులు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం సుమారు రూ.2కోట్లు ఖర్చుచేశారు. రైతులకు సరైన అవగాహన కల్పించకపోవడం, సకాలంలో మొక్కలు, నీటి సరఫరాకు అవసరమైన డ్రిప్‌లు అందించకపోవడం, పలు రకాల కారణాలతో నాటిన మామిడి, బత్తాయి మొక్కలు ఎండిపోయాయి. మరికొన్ని ఎదిగినా దిగుబడి, ఇతర కారణాలతో చెట్లను కొట్టేసి ఆ భూముల్లో ఇతర పంటలు సాగుచేశారు. తెలకపల్లి మండలం నడిగడ్డలో పండ్ల తోటల పథకం అవినీతికి చిరునామాగా మారింది. సామాజిక తనిఖీల్లో దాదాపు రూ.రెండులక్షలకు పైగా అవినీతి జరిగినట్లు బయటపడినా రాజకీయ వివాదాల మధ్య రికవరీ కూడా ఆగిపోయింది. కొందరు అధికారులపై చర్యలు తీసుకున్నా అది తాత్కాలికమే అయింది. నాగర్‌కర్నూల్, బిజినేపల్లి మండలాల్లో మూడో విడత సామాజిక తనిఖీలో పండ్లతోటల సాగుకు సంబంధించిన ఫైళ్లు గల్లంతవడం అవినీతి పరాకాష్టకు అద్దం పడుతుంది. 2007 నుంచి 2010 వరకు పండ్ల తోటల లెక్కలు స్థానిక ఈజీఎస్ కార్యాలయాల్లో అందుబాటులో లేవు. నిబంధనలను కఠినతరం చేసిన సమయంలోనే రూ.రెండుకోట్ల అవినీతి జరిగిదంటే పథకం ప్రారంభంలో అవినీతి ఎలా జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మూడేళ్లలో 1017 ఎకరాల్లో పండ్లతోటలు సాగుచేస్తే ప్రస్తుతం కేవలం 200ఎకరాల్లోపే మిగిలాయి. -
కలకలం
‘కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎంతో మంది దర్జాగా తిరుగుతున్నారు.. బలసాకు తినైనా బతికుండొచ్చు.. ఊరొదిలైనా గండం నుంచి తప్పించుకోయిండచ్చు.. ఇంతగా అప్పులున్నాయని చెప్పింటే అందరం కలిసి ఏదైనా చేసి ఉండేవాళ్లం.. ఇంత దారుణానికి ఒడిగడతారని ఊహించలేదు.. పసి పిల్లలేం చేశారు.. వారినెవరైనా పెంచుకుని ఉండేవారు కదా?.. అయినా వారికి ఎంత కష్టమొచ్చింటేనో ఇలా చేసుంటారు. బయటకు చెప్పుకోలేని బాధ మనకేం తెలుసు..’ - గుంతకల్లులో కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్న పప్పుశనగ వ్యాపారి చిరసాల బాబు (36) ఇంటి వద్ద మంగళవారం వినిపించిన మాటలివి. గుంతకల్లు టౌన్ : గుంతకల్లులో పప్పుశనగ వ్యాపారి బాబు కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త పట్టణంలో కలకలం రేపింది. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో వ్యాపారులు, ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. వ్యాపారంలో నష్టం రావ డంతో అప్పులు పెరిగిపోయాయి.. ఇదే సమయంలో కొట్టాల రాజేష్ అనే వడ్డీ వ్యాపారి, అతని స్నేహితులు తీవ్రంగా అవమానించడంతో భరించలేని బాబు.. ఇద్దరు పిల్లలు యశశ్రీ (3), నవనీత్ (2)ను గొంతు నులిమి చంపి.. భార్య రాజేశ్వరి (28), అత్త జయలక్ష్మి (45)తో పాటు తనూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అత్తమామలు, బావమరిదితో కలిసి హౌసింగ్ బోర్డు కాలనీలో ఒకే ఇంట్లో ఉంటున్న వీరు కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లు వెల్లడైంది. కుటుంబ మంతా కలిసి తనువు చాలించాలనుకున్నప్పుడు అత్త జయలక్ష్మి నివారించి ఉండాల్సిందని స్థానికులు చర్చించుకున్నారు. బాబు బావమరిది కాంత్రి.. తన తండ్రి శ్రీనివాసులును ఉద్యోగం చేసే చోట (రైల్వే) దిగబెట్టేందుకు వెళ్లినపుడు ఈ ఘటన చోటుచేసుకుంది. క్రాంతి ఇంటికి వచ్చి జరిగిన దారుణాన్ని చూసి బోరున విలపించాడు. ‘‘నాన్నను రైల్వేస్టేష న్ వద్ద దిగబెట్టేందుకు వెళ్తున్నప్పుడు ‘నాన్నా.. మేము లేకున్నా బాగా చదువుకో’ అని అమ్మ చెప్పింది. అమ్మ ఏంటి ఇలా మాట్లాడుతోందని అనుకుంటూ వెళ్లాను.. వచ్చి తిరిగి చూసేసరికి ఉరి వేసుకుంది. నన్ను, నాన్నను ఎవరు చూసుకుంటారమ్మా’’ అంటూ క్రాంతి గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు అందరినీ కలచివేసింది. ‘సోమవారం రాత్రి యశశ్రీ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. హాయిగా.. అందరూ నవ్వుకుంటూ కనిపించారు.. ఇంతలో ఇలా చేసుకుంటారనుకోలేద’ంటూ సమీప ఇళ్లలోని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, మునిసిపల్ చైర్మన్ కోడెల అపర్ణ సందర్శించి.. మృతుల బంధువులను పరామర్శించారు. అండగా ఉంటామని రైల్వే ఉద్యోగి శ్రీనివాసులుకు ధైర్యం చెప్పారు. శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఐదుగురి మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పలువురి వద్ద రూ.30 లక్షలకు పైగానే అప్పులు తీసుకున్నట్లు తోటి వ్యాపారులు చర్చించుకోవడం కనిపించింది. -
పాలసేకరణకు మంగళం
నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్: పాడిపరిశ్రమను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పాల సేకరణ ప్రక్రియకు ఆదిలోనే నిర్లక్ష్యపు చెద పట్టింది. ఎంతో ఉన్నతాశయంతో కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన యంత్రాలు శిథిలమైపోతున్నాయి. అధికారుల పర్యవేక్షణా లోపం, క్షేత్రస్థాయిలో కొందరి కాసుల కక్కుర్తి కారణంగా వీటికి గ్రహణం పట్టింది. జిల్లాలో పాల ఉత్పత్తిని పెంచి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు మండల సమాఖ్యల ఆధ్వర్యంలో 2008లో పాలశీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు రూ.3 కోట్లు వెచ్చించి యంత్రాలు అందుబాటులోకి తెచ్చారు. వీటి నిర్వహణ బాధ్యతలను డీఆర్డీఏ ఆధ్వర్యంలోని మండల సమాఖ్యలకు అప్పగించారు. ఈ సమాఖ్యల ఆధ్వర్యంలో గ్రామాల్లో పాలమిత్రలు పాలు సేకరించారు. పాల శీతలీకరణకు వెంకటాచలం, పొదలకూరు, డక్కిలిలో ఏపీ డెయిరీ నిధులు రూ.3 కోట్లతో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వీటిలో అధునాతన యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. పాలసేకరణ కేంద్రాలకు క్యాన్లు, మిల్క్ టెస్ట్ మిషన్లు సమకూర్చారు. పాలల్లో వెన్నశాతాన్ని తెలుసుకునేందుకు ఒక్కో మిషన్‌ను రూ.45 వేలతో కొనుగోలు చేశారు. కొద్దిరోజుల పాటు పాలసేకరణ విజయవంతంగా సాగింది. ప్రైవేటు డెయిరీలు లీటర్ పాలను రూ.16కి కొనుగోలు చేస్తున్న సమయంలో డీ ఆర్డీఏ ఆధ్వర్యంలోని డెయిరీలు రూ.18 వంతున చెల్లించడంతో రైతుల నుంచి విశేష స్పందన లభించింది. పాలమిత్రలు ప్రైవేటు డెయిరీలకు దీటుగా పాలను సేకరించారు. క్రమేణా అధికారుల పర్యవేక్షణ తగ్గడం, క్షేత్రస్థాయిలో కొందరు కాసులకు కక్కుర్తి పడటంతో పథకం అమలు లక్ష్యం పక్కదారి పట్టింది. రైతుల నుంచి రెండు వేల లీటర్ల పాలు సేకరిస్తే, వాటిలో 40 శాతం పాలను ప్రైవేటు డెయిరీలకు ఎక్కువ ధరకు విక్రయించసాగారు. మిగిలిన పాలలో నీళ్లు కలిపి విజయా డెయిరీకి తరలించేవారు. అక్కడ వెన్న శాతాన్ని పరిశీలించి రైతులకు తక్కువ ధర చెల్లించేవారు. క్రమేణా పాల రాబడి తగ్గిపోవడంతో రైతులు ప్రైవేటు డెయిరీల వైపు మొగ్గుచూపారు. పాలసేకరణ లేకపోవడంతో డీఆర్డీఏ ఆధ్వర్యంలోని డెయిరీలు ఏడాదిలోపే మూతపడ్డాయి. శీతలీకరణ కేంద్రాల్లోని కోట్లాది రూపాయల విలువైన పరికరాలు శిథిలమవడం ప్రారంభించాయి. 2010లో అప్పటి కలెక్టర్ రాంగోపాల్ దృష్టికి ఈ సమస్య వెల్లింది. ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించి డెయిరీల పునఃప్రారంభానికి చర్యలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మార్పు రాకపోవడంతో మళ్లీ ఆరు నెలలకే డెయిరీలు మూతపడటంతో శీతలీకరణ కేంద్రాల పరిస్థితి మొదటికొచ్చింది. మరోవైపు రైతులకు బకాయిల చెల్లింపు నిలిచిపోయింది. పొదలకూరు పాలశీతలీకరణ కేంద్రం పరిధిలో ఇప్పటికి రూ.2.35 లక్షలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం పాల వ్యాపారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో డీఆర్డీఏ పాల కేంద్రాలపై దృష్టిపెడితే మంచి ఫలితాలు ఉంటాయని రైతులు చెబుతున్నారు. అదే సమయంలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
‘ స్ప్రింక్లర్’పై సన్నగిల్లిన ఆశలు
మహబూబ్‌నగర్ వ్యవసాయం, న్యూస్‌లైన్: అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శ ని..అనే చందంగా మారింది రైతుల ప రిస్థితి. వ్యవసాయానికి బడ్జెట్లో కోట్ల రూపాయలు కేటాయించినా..సక్రమంగా వినియోగించకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. నూనె గింజలు, మొక్కజొన్న పంటల ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం తో 2004-05లో సమగ్ర నూనెగింజలు, పప్పుధాన్యల పామాయిల్ మరియు మొ క్కజొన్న అభివృద్ధి పథకాన్ని మనరాష్ట్రం లో ప్రారంభించారు. ఈ పథకం అమలు కు 75శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం, 25శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భ రిస్తుంది. అందులో భాగంగానే చిన్నసన్నకారు రైతులకు 50శాతం సబ్సిడీతో స్ప్రిం క్లర్ ఇరిగేషన్ విధానం, నీటి సరఫరా పై పులను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జి ల్లాలో వేరుశనగ రైతులకు ఈ పథకం కిం ద 2011-12లో ఏడువేల యూనిట్లకు పైగా పంపిణీ చేయగా 2012-2013లో రెండువేల యూనిట్లను తగ్గించి ఐదువేల యూనిట్లకు పైగా స్ప్రింకర్లను పంపిణీ చే శారు. కాగా, ప్రభుత్వం మరోఅడుగు ముందుకేసి ఈ ఏడాది రెండువేల యూ నిట్లకు కోత విధించింది. కాగా, ఈ ఏడా ది రబీ సీజన్ దగ్గర పడుతున్నా కొద్దీ ఇ ప్పటివరకు స్ప్రింక్లర్లు పంపిణీచేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నా రు. అంతేకాకుండా వేరుశనగ ఒక హెక్టర్ స్ప్రింక్లర్ యూనిట్‌కు గతేడాది 30 పైపు లు ఇవ్వగా ఈ ఏడాది 25 పైపులు ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చె బుతున్నారు. ఒక హెక్టార్‌లోపు సాగుచేసే రైతులకు ఎనిమిది రకాల వస్తువులను రూ.14,804 పూర్తిధర కాగా రూ.7402 50 శాతం సబ్సిడీ పోను రైతులు రూ. 7402 భరించాల్సి ఉంటుంది. కాగా ఐదుశాతం వ్యాట్ రూ.740 కలుపుకుని మొ త్తం రూ.8142 రైతులను భరించాల్సి ఉం టుంది. రెండు హెక్టార్లలోపు సాగుచేసిన రైతులు రూ.9652 చెల్లించాల్సి ఉంటుంది. సాగునీటిపైపుల పరిస్థితి అదేతీరు వేరుశనగ పంటను రెండు హెక్టర్ల లోపు సాగుచేసిన రైతులు సాగునీటి పైపుల 75 ఎంఎం రకం పూర్తి ధర రూ.13,631 కా గా అందులో 50శాతం రూ.6816 సబ్సిడిపోను రైతులు రూ.6816తో పాటు రూ. 682 ఐదు శాతం వ్యాట్‌ను కలుపుకుని రూ.7498 భరించాల్సి ఉంటుంది. 90 ఎంఎం రకం పైపులు కావాల్సిన రైతులు రూ.7928 చెల్లించాల్సి ఉంటుంది. అదేవి ధంగా రెండు హెక్టార్లు సాగుచేసిన రైతు లు 75ఎంఎం రకం పైపులకు రూ.8656, అలాగే 90ఎంఎం రకం పైపులకు రూ.10,860 చెల్లించాల్సి ఉంటుంది. డిమాండ్ ఎక్కువ.. పంపిణీ తక్కువ జిల్లాలో స్ప్రింక్లర్లు, సాగునీటి పైపులకు రైతుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. అయితే అందుకు తగినట్టుగా పైపులను పంపిణీచేయకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మండలానికి 250పైగా దరఖాస్తులు వస్తుంటాయని, కానీ ప్రభుత్వం మాత్రం మండలానికి 50 యునిట్ల చొప్పున కూడా మంజూరు చేయకపోవడంతో ఇబ్బందికరంగా మారిందని వ్యవసాయశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. జిల్లాకు 3175 యూనిట్లు జిల్లాకు సరిపోయే పరిస్థితి లేదన్నారు. జిల్లాలో గతేడాది ఎనిమిది వేలకు పైగా దరఖాస్తులు రాగా, ఐదువేల యూనిట్లను మాత్రమే పంపిణీచేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. కాగా, ఈ సారి 12వేల దరఖాస్తులకు పైగా వచ్చే అవకాశం ఉంది. కంపెనీలు ముందుకు రావడం లేదు ప్రభుత్వం నిర్ణయించిన ధర సరిపోవడం లేదని కంపెనీలు స్ప్రింక్లర్లు, పైపులను పంపిణీ చేసేందుకు ముందుకురావడం లేదు. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడంతో కొద్దిరోజులు ఆగే పరిస్థితి ఏర్పడింది. జిల్లాకు మంజూరైన 3175 వేరుశనగ స్ప్రింక్లర్ యూనిట్లు సరిపోయే పరిస్థితి లేని విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తా. - రామరాజు, వ్యవసాయశాఖ జేడీఏ