కడప(వైఎస్సార్ జిల్లా): జిల్లాలో ఎర్రచందనం అక్రమరవాణా యధేచ్చగా కొనసాగుతోంది. స్మగ్లర్ల ఆట కట్టించడానికి పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడతూనే ఉంది. అయినా స్మగ్లర్లు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా వైఎస్ఆర్ జిల్లాలోని బద్వేల్ పరిధి ఒట్టిమడుగు అటవీప్రాంతంలో నలుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 43 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను తరలించిన వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.