
ఒకే కాన్పులో నలుగురు శిశువులు
వినుకొండ రూరల్: గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళ మంగళవారం సాయంత్రం ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. బొల్లాపల్లి మండలం నెహ్రునగర్‌తండాకు చెందిన సుజాతాబాయి మంగళవారం కాన్పు కోసం వినుకొండలోని బాలాజీ వైద్యశాలలో చేరింది. సహజ ప్రసవం కాకపోవడంతో సాయంత్రం డాక్టర్లు ఆపరేషన్ చేసి నలుగురు శిశువులను బయటకు తీశారు. సుజాతాబాయికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగబిడ్డ జన్మించినట్లు డాక్టర్ అపర్ణ తెలిపారు. వీరిలో ఇద్దరు శిశువులను పరీక్షల నిమిత్తం గుంటూరు పంపినట్లు తెలిపారు.