Four babies
-
ఒకే కాన్పు లో నలుగురు శిశువుల జననం
ఖమ్మం: మనం మామూలుగా ఒక కాన్సులో ఒకరు లేదా ఇద్దరు మహా అయితే ముగ్గురు శిశువులు జన్మించారని విన్నాం. అయితే నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్సులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. తిరుమలాయపాలెం మండలానికి చెందిన శామీన అనే మహిళ పురిటినొప్పులతో స్థానిక జోయా ఆస్పత్రిలో చేరింది. ఆమెకు శ స్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు నలుగురు శిశువులు జన్మించిన్లు తెలిపారు. తల్లీ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని, చిన్నారుల్లో ముగ్గురు మగశివువులతో పాటు ఆడబిడ్డ ఉన్నట్లు వైద్యులు చెప్పారు. -
ఒకే కాన్పులో నలుగురు శిశువులు.
-
ఒకే కాన్పులో నలుగురు శిశువులు
వినుకొండ రూరల్: గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళ మంగళవారం సాయంత్రం ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. బొల్లాపల్లి మండలం నెహ్రునగర్తండాకు చెందిన సుజాతాబాయి మంగళవారం కాన్పు కోసం వినుకొండలోని బాలాజీ వైద్యశాలలో చేరింది. సహజ ప్రసవం కాకపోవడంతో సాయంత్రం డాక్టర్లు ఆపరేషన్ చేసి నలుగురు శిశువులను బయటకు తీశారు. సుజాతాబాయికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగబిడ్డ జన్మించినట్లు డాక్టర్ అపర్ణ తెలిపారు. వీరిలో ఇద్దరు శిశువులను పరీక్షల నిమిత్తం గుంటూరు పంపినట్లు తెలిపారు.